సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వేదికగా ప్రకటించిన డిక్లరేషన్‌తో బీసీలకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ‘గర్జన’ సభలో జగన్ ఇచ్చిన హామీలు వారికి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చాయి. జగనన్నతోనే బీసీలకు లాభం జరుగుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులు సంబరాలు జరపుకుంటున్నారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
అవనిగడ్డలో..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు డిక్లరేషన ప్రకటించడంపై అవనిగడ్డ నియోజకవర్గం బీసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అవనిగడ్డ సెంటర్‌లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్, బాబుకడవ కొల్లు నరసింహారావు, రేపల్లి శ్రీనివాస్, సింహాద్రి వెంకటేశ్వర్ రావు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానలు, బీసీ సంఘాల నేతలు, తదితరలు పాల్గొన్నారు.
నూజివీడులో..
బీసీలకు డిక్లరేషన్ ప్రకటించి, వరాలు ప్రకటించడంపై జిల్లా బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నూజివీడు మండలం సుంకొల్లులో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, వైఎస్సార్ సీపీ నాయకులు, బీసీ సంఘాల నేతలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు
పార్వతీపురంలో..
బీసీ గర్జన సభలో ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీల పట్ల పార్వతీపురం బీసీ సంఘాల నేతలు, వైఎస్సార్ సీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దివంగత ప్రజానేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూల మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు, వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు, ప్రజాసంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.
కురుపాంలో..
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో బీసీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు పాల్గొన్నారు.
గజపతినగరంలో..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు సభలో బీసీలకు ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేస్తూ దివంగత ప్రజా నాయకుడు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బీసీ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో..
బీసీ డిక్లరేషన్‌ను స్వాగతిస్తూ జగదాంబ జంక్షన్‌లోని దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ రమణ మూర్తి, ఆ పార్టీ నాయకులు జాన్ వెస్లీ, కొండా రాజీవ్ గాంధీ, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాసంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment