వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వేదికగా ప్రకటించిన డిక్లరేషన్‌తో బీసీలకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ‘గర్జన’ సభలో జగన్ ఇచ్చిన హామీలు వారికి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చాయి. జగనన్నతోనే బీసీలకు లాభం జరుగుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులు సంబరాలు జరపుకుంటున్నారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.