బీసీ సామాజికవర్గాల సమస్యలను అధ్యయనం చేసి.. వారి అభ్యున్నతికి స్పష్టమైన హామీలు ఇవ్వటంతోపాటు బీసీల జీవన ప్రమాణాల మెరుగుదలకు తాము అధికారంలోకి వస్తే ఏమి చేయబోతామో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించనున్నారు. సమాజంలో 52 శాతంగా ఉన్న బీసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది.