జాబు రావాలి అంటే బాబు రావాలి అన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారని మళ్లీ అధికారంలోకి వస్తే కనీసం రేషన్ అయినా ఇస్తారా? అంటూ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. భీమవరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ.. బాబు వచ్చారు కానీ జాబు రాలేదు.. బాబు వచ్చాక సాక్షర భారత్, మధ్యాహ్నా భోజన పథకం, ఆదర్శ రైతు, గోపాల మిత్ర, ఆయుష్ ఉద్యోగాలను పీకేశారంటూ చంద్రబాబును విమర్శించారు.