పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘరామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శనివారం పార్టీ చేరిన ఆయన.. రాష్ట్ర విభజన హామీలు సాధించే సత్తా ఒక్క వైఎస్ జగన్‌కే ఉందన్నారు.