
సాక్షి, విజయవాడ: బీసీలకు సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్కహామీని చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివారని, బీసీల అభ్యున్నతికి వైఎస్ జగన్ పాటుపడతారని చెప్పారు.
బీసీలోని అన్ని కులాలకు జగన్ న్యాయం చేస్తారని అన్నారు. అన్ని బీసీ వర్గాలకు న్యాయం చేసేలా వైఎస్సార్‌సీపీ బీసీ డిక్లరేషన్ ఉంటుందని తెలిపారు. వైఎస్ జగన్ పాదయాత్ర బీసీ వర్గాలకు భరోసాయాత్రగా సాగుతోందన్నారు. బీసీ డిక్లరేషన్ ఎలా ఉండాలనే దానిపై బీసీ మేధావులు, ప్రజాసంఘాలతో తమ పార్టీ బీసీ అధ్యయన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోందని.. అందరి అభిప్రాయాలు సేకరించి నివేదికను జగన్‌ను అందజేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment