
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య
సాక్షి, నెల్లూరు : దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ డిక్లరేషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నారని ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. బీసీ డిక్లరేషన్, వెనుకబడిన తరగతులలోని అన్ని వర్గాల కుటుంబాలలో వెలుగులు నింపబోతుందని పేర్కొన్నారు. బీసీల పురోగతి కోసం వైఎస్ జగన్ సదస్సులు నిర్వహించి, వారి సూచనలు, సలహాలతో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించబోతున్నారని చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేసి మోసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ విధంగా మోసం చేయకుండా బీసీ డిక్లరేషన్ అమలు చేసి జననేత చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు బీసీలకు ప్రకటించిన పదివేల కోట్ల ప్రత్యేక బడ్జేట్ అమలు చేశాడా అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అంతేకాక బీసీలకు సబ్‌ప్లాన్ ప్రవేశ పెడతానని చంద్రబాబు చెప్పి మోసం చేశారని వారు ధ్వజమెత్తారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు తప్ప.. వాళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment