
నెల్లూరు : కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వంద ప్రమాణాలు అవలంబిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంట్ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతల ప్రశ్నలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఒకలా, బయట మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ఏమీ ప్రయోజనం లేదని, విదేశీ పర్యటన కేవలం తన అవినీతి సొమ్ము దాచుకొనేందుకే తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదన్నారు.