Kiliveti Sanjeevaiah
-
చంద్రబాబు, టీడీపీ నేతలకు కిలివేటి సంజీవయ్య కౌంటర్
-
కాళంగి నది తీర నిర్వాసితులకు అండగా వైఎస్ఆర్సీపీ..!
-
లోకేష్ కు చెప్పుతో బడిత పూజ
-
టీడీపీ మాజీ ఎంపీ కుటుంబానికి పథకాల లబ్ధి రూ.45,702
సాక్షి, నాయుడుపేట టౌన్ (తిరుపతి జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా రూ.45,702 లబ్ధి చేకూరింది. వైఎస్సార్ ఆసరా ద్వారా 2020–21, 2021–22లకు రూ.17,261 చొప్పున, సున్నా వడ్డీ కింద 2020లో రూ.2,628, 2021లో రూ.1,575, 2022లో రూ.1,112 నగదు అమృతసరళ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. పంట రుణాల సున్నా వడ్డీ నగదును రెండు విడతలుగా రూ.5,865 నెలవల బ్యాంక్ ఖాతాలో వేసింది. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సంక్షేమ పథకాల బుక్‌లెట్‌ను నాయుడుపేటలో నెలవలకు అందజేశారు. చదవండి: (తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై ఈవో ధర్మారెడ్డి క్లారిటీ) -
ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూతురు వివాహానికి హాజరైన సీఎం జగన్
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని నవదంపతులు శ్రావణ్, సౌజన్యలను సీఎం జగన్ ఆశీర్వదించారు. వివాహ వేడుకకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. అంతకుముందు కనుపర్తిపాడులో హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. చదవండి: (వైఎస్సార్సీపీ నేత హత్యపై సీఎం జగన్ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు) -
నెల్లూరు జిల్లాకు సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు(బుధవారం) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో.. హెలిప్యాడ్ నుంచి వేడుక జరిగే విపీఆర్ కన్వెన్షన్ వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి హాజరు కానున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ మధ్యాహ్నం ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ద్వారా నెల్లూరు కనుపర్తిపాడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ఇరవై నిమిషాలపాటు ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. ఆపై రోడ్డు మార్గంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని.. కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేదిక వద్దకు చేరుకుని వధూవరులను ఆశీర్వదిస్తారు. హెలికాప్టర్లో బయలుదేరి తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. -
‘చంద్రబాబు మద్దతు తెలపడం హాస్యాస్పదం’
సాక్షి, చీరాల: కరోనా కష్టకాలంలో ప్రాణ భయంతో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు నాయుడు, రాజధాని పేరుతో తన సామాజిక వర్గం చేస్తున్న 200 రోజుల కృత్రిమ ఉద్యమానికి మద్దతు తెలపడం హాస్యాస్పదం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో భూములు కాపాడుకునేందుకు చంద్రబాబు విదేశాల్లో ఉన్న తన సామాజిక వర్గంతో అమరావతిలో దొంగ దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో 300 కోట్ల రూపాయలతో చంద్రబాబు విదేశాల్లో జల్సాలు చేశారని విమర్శించారు. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజధాని వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యం అని ఆమంచి పేర్కొన్నారు. చంద్రబాబుకు మతి భ్రమిస్తోంది: కిలివేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను చూసి చంద్రబాబు మతి భ్రమిస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. శనివారం ఆయన నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిని గ్రాఫిక్స్ లో చూపెట్టి భ్రమరావతి చేసిన చంద్రబాబుకు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 108, 104ల వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఒకేసారి 1088 అంబులెన్స్ వాహనాలను సీఎం జగన్ ప్రవేశపెడితే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు తాపత్రాయం : దాడిశెట్టి చంద్రబాబు నాయుడు అమరావతి లో ఉన్న తన భూముల కోసం తాప్రతాయ పడుతున్నడు తప్పా, ప్రజల అభివృద్ధి కోసం తాపత్రయం పడడం లేదని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. రాష్ట్ర బాగోగుల కంటే అమరావతిలో ఉన్న 30 గ్రామాల రియల్ ఎస్టేట్ బాగోగులే చంద్రబాబుకు ముఖ్యమని విమర్శించారు. శనివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ప్రకటిస్తే దానికి మోకాలడ్డుతూ చంద్రబాబు కోర్టుఓల కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. -
ఎమ్మెల్యే సంజీవయ్యకు కరోనా టెస్ట్
సూళ్లూరుపేట : సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బుధవారం అమరావతిలో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు కోవిడ్–19 పరీక్షలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సమావేశానికి హాజరు కోసం ముందుగా అమరావతిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రంలో స్వాబ్ టెస్టు చేయించుకున్నారు. ఆయనకు నెగిటివ్ వచ్చిందని వైద్యులు ధ్రువీకరించారు. -
సీఎం చొరవతో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు
సాక్షి, నాయుడుపేట టౌన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పతకాలతో సుమారు రూ.700 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుటుడుతున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నాయుడుపేట ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. సీఎం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నవరత్నాలతో అన్ని వర్గాల సంక్షేమానికి బాటలు వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ కార్పొరేట్‌కు దీటుగా మనబడి–నాడు నేడు పతకం కింద ప్రభుత్వ పాఠశాలలు అభివృధ్దికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొదట విడతగా ఒక్క సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే సుమారు రూ..20 కోట్ల నిధులు మంజూరు చేస్తూ 150 పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో నాయుడుపేటలోని రెండు జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, కోటపోలూరు, తడ, ఏకొల్లు ఉన్నత పాఠశాలు కూడా ఉన్నాయన్నారు. ఆగష్టు నుంచి పనులు సైతం ప్రారంభమవుతాయన్నారు. దొరవారిసత్రంలో కొత్తగా బాలుర రెసిడెన్షియల్ ఐటీఐ, బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సూళ్లూరుపేటలో అద్దె భవనంలో ఉన్న ఈఎస్ఐ వైద్యశాలకు ప్రభుత్వ భవనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నాయుడుపేట మండలం బిరదవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్న బాలికల గురుకులంలో ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అప్‌గ్రెడ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇంకా నాయుడుపేటలో సీఎం ప్రత్యేక చొరవ చూపుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రూ.50 కోట్లతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సారధ్యంలో సీ–పెట్ సెంటర్ సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో రూ.100 కోట్లతో ఇరిగేషన్ కెనాల్ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు వివరించారు. ఇందులో విన్నమాల పంట కాలువ, నెర్రికాలువ, పాలచ్చూరు సిస్టమ్, పాములు కాలువ, కళంగి డ్రైయిన్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి అందించేందుకు విధంగా సుమారు రూ.400 కోట్లకు పైగా నిధులతో ప్రతి మండలంలో తాగునీటి పథకాలు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చందుకు ముఖ్యమంత్రి నిబద్ధతతో ముందుకు సాగుతున్నారన్నారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, షేక్ రఫీ, కామిరెడ్డి మోహన్‌రెడ్డి, దేవారెడ్డి విజయులురెడ్డి. పాదర్తి హరినాథ్‌రెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, చెవూరు చెంగయ్య ఉన్నారు. -
సంజీవయ్య సూపర్ విక్టరీ
సాక్షి, నాయుడుపేట/సూళ్లూరుపేట: సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సూపర్ విక్టరీని నమోదుచేసుకుంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య భారీ ఆధిక్యత సాధించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన ఓట్లు లెక్కింపులో ప్రారంభం నఉచి అత్యధిక మెజార్టీ కొనసాగింది. తొలి రౌండ్ నుండి మూడో రౌండ్ వరకు 3వేలు చొప్పున ఆధిక్యత సాధించారు. నాల్గొ రౌండ్లో కొంత మెజార్టీ తగ్గినా, ఐదవ రౌండ్ నుంచి 3వేలకు తగ్గకుండా మోజార్టీ జోరును పెంచింది. చివరి 21వ రౌండ్ వరకు మెజార్టీ ఆధిక్యతకు అడ్డేలేకుండా పోయింది. ఏదశలోనూ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పోటీ ఇవ్వలేకపోయారు. పోస్టల్ బ్యాలెట్ లోనూ కిలివేటి హవా కొనసాగింది. టీడీపీ నియోజకవర్గంగా పేరున్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో 1985లో టీడీపీ తరఫున పోటీచేసిన ఎం. మనెయ్య 28368 ఓట్లు మెజార్టీ సాధించారు., 1994లో 21001 ఓట్లు ఆధిక్యతలో పరసా వెంకటరత్నం విజయం సాధించారు. సూళ్లూరుపేటలో కిలివేటి విజయదుందుభీ మోగించడంతో పార్టీ క్యాడర్ ఆనందానికి హద్దేలేకుండా పోయింది. 1985 ఎం. మణెయ్య మెజార్టీ 28,368 ఓట్లు 1994 పరసా వెంకటరత్నం మెజార్టీ 21.001 ఓట్లు ఈ విజయం చారిత్రాత్మకం : కిలివేటి సంజీవయ్య సూళ్లూరుపేట నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి ఇంతటి ఘన విజయం ఇప్పటివరకు చరిత్రలో లేదు. ఇది చారిత్రాత్మక విజయం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి, కష్టం ఫలితమే ఈ అపూర్వ విజయం. నియోజకవర్గంలో నాయకులు, యువత, కార్యకర్తలు పార్టీ కోసం చాలా కష్టపడి చేశారు. ఓటర్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. -
టీడీపీకి ఓటడిగే హక్కు లేదు
సాక్షి, పెళ్లకూరు: అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులకు ఓటడిగే హక్కు లేదని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య అన్నారు. సోమవారం మండలంలోని పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, యాలకారికండ్రిగ, ముప్పాళ్లవారికండ్రిగ తదితర గ్రామాల్లో ఎంపీపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2015లో వచ్చిన వరదలకు ఈ ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పిన చంద్రబాబు ఒక్క పైసా కూడా అన్నదాతలకు ఇవ్వలేదన్నారు. నీరు – చెట్టు కింద మంజూరైన పనులను, రైతు రథాలపై అందించిన ట్రాక్టర్లను పర్సంటేజీలు తీసుకుని అప్పగించిన నాయకుడికి ఓట్లు వేయడం ఎంతవరకు న్యాయమో టీడీపీ శ్రేణులే ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ పాలూరు మహేంద్రరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ మారాబత్తిన సుధాకర్ నాయకులు చైతన్యకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, సుబ్బారెడ్డి, శంకరయ్య, బాలాజీ, శేఖర్‌రెడ్డి, గోపాల్, రాజారెడ్డి, బాబు, మురళి, కేశవ్‌రెడ్డి, చంద్రయ్య, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. చమరగీతం పాడాలి నాయుడుపేటటౌన్: టీడీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఓట్టురు కిషోర్‌యాదవ్, మల్లెలా మనోహర్‌రెడ్డిల సారథ్యంలో మండల పరిధిలోని కలిపేడు గ్రామానికి చెందిన 50 కుటుంబాల పెద్దలు సంజీవయ్య సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యేతోపాటు ఆ పార్టీ మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, జిల్లా కార్యదర్శి పాదర్తి హరినాథ్‌రెడ్డి, బీసీ నాయకులు గంధవళ్లి సిద్ధయ్య, భరత్ తదితర నాయకులు పార్టీ కండువాలను కప్పి ఘనంగా స్వాగతించారు. -
టీడీపీకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే షాక్..!
సాక్షి, ఒంగోలు : ఎన్నికల సమరానికి రోజులు దగ్గపడుతున్న కొద్దీ టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో ఎమ్మెల్యే అదే బాటన నడిచారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్‌రాజు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఒంగోలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. సాక్షి, సూళ్లూరుపేట: నాయుడుపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు కేసీ చెంచయ్య, తన కుమారులు సురేష్, సాయి, 100 మంది అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమక్షంలో మంగళవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దువ్వూరు బాలచంద్రారెడ్డి, కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కట్టా సుధాకర్ రెడ్డి, తంబిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి, డాక్టర్ పాలూరు మహేందర్ రెడ్డి, లింగారెడ్డి భాను ప్రకాశ్ రెడ్డి, మునుస్వామి నాయుడు పాల్గొన్నారు. (చదవండి : గెలిపించండి.. అండగా ఉంటా) -
గెలిపించండి.. అండగా ఉంటా
సాక్షి, సూళ్లూరుపేట: ‘ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. అండగా ఉంటా’ అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నియోజకవర్గ ప్రజలను కోరారు. వడ్డెర సంఘం జిలా ఉపా«ధ్యక్షులు మల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుమారు 200 మంది పార్టీలో ఆదివారం పట్టణంలో వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే సన్నారెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, (స్వామిరెడ్డి) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాసంరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, సూళ్లూరుకు చెందిన యూత్ సుమారు వందమంది పార్టీలో చేరారు. వారికి సంజీవయ్య కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామిరెడ్డి ఇంటివద్ద పార్టీ పట్టణ అధ్యక్షులు కళత్తూరు శేఖర్‌రెడ్డి ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో కిలివేటి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే కాళంగి గ్రాయిన్, నెర్రికాలువ లిఫ్ట్ ఇరిగేషన్, తెలుగుగంగ బ్రాంచ్ కాలువలను పూర్తి చేయించడం, సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చి భూగర్భ డ్రెయినేజీ నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ఓజలి సుబ్బారావు, భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దబ్బల శ్రీమంత్‌రెడ్డి, మండల అధ్యక్షులు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శిలు ఎం.పాండురంగయాదవ్, చాంపియన్ చంద్రారెడ్డి, వేనాటి సుమంత్‌రెడ్డి, ముత్తుకూరు లక్ష్మమ్మ, అలవల సురేష్, వంకా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న సీఎం అయితే యువతకు ఉద్యోగాలు
సాక్షి, నాయుడుపేటటౌన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద గురువారం ఓజిలి మండల బీజేపీకి చెందిన అల్లిపూడి సుబ్బారావు, దాసరి సాయి, హేమంత్, ఎస్డీ గౌస్, షేక్ దావూద్, జనార్దన్, నాగరాజు, వెంకటస్వామి, మన్నెమాల సాయి, ఎం.విజయకుమార్ తదితర నాయకుల సారథ్యంలో 100 మందికి పైగా యువత వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యేతోపాటు పార్టీ ఓజిలి మండల కన్వీనర్ గుంటమడుగు రవీంద్రరాజు, జిల్లా కార్యదర్శులు దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, పాదర్తి హరనా«థ్‌రెడ్డి, ఉచ్చారు హరనా«థ్‌రెడ్డి, కోండూరు ప్రభాకర్‌రాజు, ట్రెడ్ యూనియన్ మండల అధ్యక్షుడు తిరుపాలయ్య తదితరులు కండువాలను కప్పి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ఇష్టారాజ్యంగా పాలన చేశాడన్నారు. టీడీపీ దుర్మార్గపు పాలనకు చమరగీతం పాడే రోజులు వచ్చేశాయన్నారు. రాక్షసపాలనను అంతమొందించేందుకు యువత నడుం బిగించాలన్నారు. నవరత్నాలతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండలాంటే జగనన్న సీఎం కావాలన్నారు. కార్యక్రమంలో పఠాన్ రబ్బానీబాషా, ఎస్కే ఖాజావలీ తదితరులు పాల్గొన్నారు. -
‘దళితులపై దాడి జరిగినా స్పందన లేదు’
సాక్షి, నెల్లూరు : రాపూరులో దళితులపై దాడి జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో దళిత సంక్షేమం కుంటు పడిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాజ్యాంగ కమిషన్లను నీరు గారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పోరేషన్ అవినీతి మయమైపోయిందని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దళితుల తలుపులు తట్టి, వారికి సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు. కీలకమైన స్థానాల్లో దళితులను నియమించకుండా వారిని అవమానిస్తున్నారని, దళితులంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. వైఎస్ జగన్‌తోనే సంక్షేమ రాజ్యం వస్తుందని అన్నారు. దళితుల గుండెల్లో వైఎస్సార్ ఉన్నారు : సంజీవయ్య ప్రతి దళితుడి గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వ్యాఖ్యానించారు. డా. బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో వైఎస్సార్ ఎంతో మంది దళితులను ఉన్నత స్థాయికి తీసుకువచ్చారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలలను చంద్రబాబు నీరుగారుస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో దళితుల కష్టాలు, వారి జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలో దళితుల సంక్షేమానికి వినూత్న పథకాలను ప్రకటిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్నారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై పోలీస్ జులుం
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాల్టీలో మంత్రి పి.నారాయణ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాలనీ సమస్యలను పరిశీలించాలని మంత్రిని కోరడానికి వచ్చిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై దౌర్జన్యం చేశారు. అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్న పోలీసుల తీరుపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ‘హౌస్ ఫర్ ఆల్’ గృహాలను లబ్ధిదారులకు కేటాయించేందుకు మంత్రి నారాయణ శనివారం సూళ్లూరుపేట మున్సిపాల్టీ పరిధిలోని మన్నారుపోలూరుకు వచ్చారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నాయుడుపేటకు బయలుదేరారు. ఇదే సమయంలో వట్రపాళెం వద్ద స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మంత్రి కాన్వాయ్‌ను ఆపి, మర్యాదపూర్వకంగా మంత్రికి శాలువా కప్పారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న వట్రపాళెంలో కనీస వసతులకు దూరంగా బతుకుతున్న నిరుపేదల బాధలను చూడాలని మంత్రిని కోరారు. అది పెద్ద నేరమైనట్లు గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు, స్థానిక పోలీస్ అధికారులు రెచ్చిపోయారు. డీఎస్పీ రాంబాబు ఎమ్మెల్యే కిలివేటిని పక్కకు నెట్టేశారు. అక్కడే ఉన్న పలువురు సీఐలు, ఎస్సైలు కూడా కల్పించుకుని ఎమ్మెల్యేను ఈడ్చుకెళ్లారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కిలివేటితోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందోళనకు దిగారు. పోలీస్ జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి నారాయణ స్పందిస్తూ.. ‘‘నేను రాను, నాకు వేరే షెడ్యూల్ ఉంది. నాయుడుపేటకు వెళ్లాలి, ఈ రోజు షెడ్యూల్లో వట్రపాళెం లేదు. ఊరికే విసిగించకు’’ అంటూ రుసరుసలాడారు. నాయుడుపేటలో గందరగోళం నాయుడుపేటలో ‘హౌస్ ఫర్ ఆల్’ ఇళ్లు కేటాయింపు సభలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. పేదలకు మేలు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మంత్రి నారాయణ తీరును ఆయన తప్పుపట్టారు. జై వైఎస్సార్ అంటూ ప్రసంగాన్ని ముగించబోయారు. అదే సమయంలో సభలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా జై వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ‘నుడా’ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే సంజీవయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కార్యకర్తలను అడ్డుకుని, బయటకు పంపేందుకు యత్నించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేసి సభ నుంచి బయటకు వచ్చేశారు. -
చంద్రబాబుకు అధికారమే పరమావధి
సూళ్లూరుపేట: రకరకాల సమస్యలతో ఆంధ్రా ప్రజలు అల్లాడుతుంటే పరిష్కార మార్గం చూపాల్సిన సీఎం చంద్రబాబు అధికారమే పరమావధిగా రాష్ట్రాన్ని వదిలి తెలంగాణాలో ఆంధ్రాద్రోహి కాంగ్రెస్‌ను అధికారంలో నిలబెట్టేందుకు శక్తి వంచన లేకుండా తిరుగుతున్నాడని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. సూళ్లూరుపేట మహదేవయ్యనగర్‌లో శనివారం రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యే కిలివేటికి తమ సమస్యలు వివరించారు. తాగునీరు, రోడ్లు తదితర సమస్యలను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలిపారు. సమస్యలను స్వయంగా పరిశీంచిన ఎమ్మెల్యే కిలివేటి పర్యటన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యథా రాజ, తథా ప్రజ అన్నరీతిలో ఆంధ్రాలో పాలన సాగుతోందన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలి తన కేసులు, తన పలుకుబడి, తన అధికారం అంటూ ఆంధ్రా ద్రోహి కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు తెలంగాణా సీఎం కేసీఆర్‌కి భయపడి అమరావతి నిర్మాణం అంటూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిలో ఉన్న హక్కులను వదిలేసి పారిపోయి వచ్చేశారన్నారు. అప్పట్లో కేంద్రంలోని బీజేపీ తన జట్టులో సభ్యుడిగా ఉన్న చంద్రబాబుని రక్షించేందుకు ఇద్దరు సీఎంల మధ్య మధ్యవర్తిత్త్వం నెరిపి సమస్య లేకుండా చేసిందని కిలివేటి తెలిపారు. ఈ కేసు ఎప్పుడైనా మెడకు చుట్టుకుంటుందని తెలిసిన చంద్రబాబు భవవిష్యత్లో తమకు అండగా నిలిచే కొందరిని పక్కన చేర్చుకోవాలన్న ఉద్దేశంతో తన శిష్యుడు రేవంత్‌రెడ్డిని తెలివిగా ముందే కాంగ్రెస్‌లోకి పంపి ఇప్పడు తాను కూడా అందులో కలిసి పోయారన్నారు. తెలంగాణాలో ఓట్లకోసం మొసలి కన్నీరు కార్చడం, ఆంధ్రాకి ద్రోహం చేసి అడ్డగోలుగా విభజన చేసిన కాంగ్రెస్‌తో చెట్టపట్టాలు మాని రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కళత్తూరు శేఖర్‌రెడ్డి, అల్లూరు అనిల్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గండవరం సురేష్‌రెడ్డి, నాయకులు తిరుమూరు రవిరెడ్డి, ఎస్కే ఫయాజ్, బి.నవీన్‌రెడ్డి, రాఘవ, లక్ష్మయ్య, నిమ్మల గురవయ్య, మునిరత్నం, శరత్‌గౌడ్, పాలా మురళి, గోగుల తిరుపాల్, దినేష్, అలీ, బిగువు శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఎల్లో వైరస్‌ను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి
నెల్లూరు ,నాయుడుపేటటౌన్: గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని సంక్షేమ పథకాలను అధికారపార్టీ నాయకులకే పరిమితం చేస్తూ రాష్ట్రంలో ప్రమాదకరంగా మారిన ఎల్లో వైరస్‌ను ప్రజలు తరిమికోట్టే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నాయుడుపేటలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నాయకులతో కలసి మాట్లాడారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుకుంటూ జగన్మోహన్రెడ్డి చేస్తున్న యాత్ర చరిత్రలో అపూర్వ ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ స్మారక మందిరం నుంచి ప్రారంభించిన రోజే రాష్ట్రానికి సాధించాల్సిన లక్ష్యాలను స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధించుకోవడంతో పాటు ప్రతి ఇంటా వెలుగులు నింపాలన్నా సంకల్పంతో నవరత్నాలాంటి పథకాలను ప్రకటించారన్నారు. ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేక చివరకు తమ నేతపై హత్యాయత్నం చేసే విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించక పోవడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు మూసివేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యను దూరం చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. 2019లో ప్రజలు తమ నేతను అదరించి ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఖాయమన్నారు. సమావేశంలో వైఎప్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుడుపేట, సూళ్లూరుపేట మండల కన్వీనర్లు తంబిరెడి సుబ్రమణ్యంరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పాదర్తి హరినా«థ్‌రెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, రైతు విభాగ జిల్లా కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మహిళా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రత్నశ్రీ, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు కళాత్తూరు శేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి చెంగయ్య, పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాబు, వాణిజ్య విభాగ పట్టణ అధ్యక్షుడు జి.మోహన్‌రావు, పట్టుకోట రఘు పాల్గొన్నారు. -
ప్రతిపక్షం లేకుండా కుట్రలు
నెల్లూరు, సూళ్లూరుపేట: నాలుగున్నరేళ్లుగా టీడీపీ హత్యారాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని, ›ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డు తొలగించుకోవాలని, ఎవరికీ అనుమానం రాకుండా శ్రీనివాసరావు అనే వ్యక్తితో హత్యాయత్నం చేయించినట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. సూళ్లూరుపేట మండలంలోని మంగానెల్లూరు, సుద్దమడుగుతాగేలి, అచ్చుకట్ట గ్రామాల్లో ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కళత్తూరు రామ్మోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు కళత్తూరు జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి నవరత్నాల పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేసి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి మాట్లాడుతూ టీడీపీ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా హత్యారాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణ ముందు నిలబడలేక ఆయనను పథకం ప్రకారం మట్టుబెట్టేందుకు పథకాలు రచించారన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు జగన్ అభిమానని, ఆయనతో వేసిన ఫ్లెక్సీలను విడుదల చేసి మసి పూసి మారేడు కాయ చేయాలనుకున్న టీడీపీ నేతల ప్రయత్నాలు బెడిసికొట్టాయని అన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక భయంకరమై కుట్ర దాగి ఉందని, దీని వెనుక ఉన్న కొత్త కొత్త విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల కనుసన్నల్లోనే ఈ హత్యాయత్నంపై పెద్ద కసరత్తు జరిగినట్టు ఆయన ఆరోపించారు. 2019లో ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోవడంతో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు కేసులన్నింటినీ తిరగతోడి శిక్ష పడేట్లు చేస్తారనే భయంతో ఈ పథకం వేశారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దువ్వూరు గోపాల్‌రెడ్డి, పుట్టు రమణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి నలుబోయిన రాజసులోచనమ్మ, జిల్లా కార్యదర్శి దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి, పార్టీ దొరవారిసత్రం మండల అధ్యక్షుడు ఈశ్వరవాక శ్రీనివాసులురెడ్డి, ఓజిలి మండల అధ్యక్షుడు గుంటమడుగు రవీంద్రరాజు, తిరుపతి పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి మంగానెల్లూరు వీరరాఘవన్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దామతోటి లక్ష్మయ్య, ప్రచార విభాగం పట్టణ కార్యదర్శి తుపాకుల ప్రసాద్, మండల ప్రచార కార్యదర్శి వడెం సుధాకర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బుంగా చెంగయ్య, బూత్ కన్వీనర్ల నియోజకవర్గ ఇన్చార్జి మందా దేవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ పాలనలో అడుగడుగునా అవినీతి
తడ(సూళ్లూరుపేట): ‘నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో అడుగడుగునా అవినీతి తాండవిస్తోంది. సంక్షేమ పథకాలను వదిలేశారు. చంద్రబాబు పాలనలో తెలుగు తమ్ముళ్లు రూ.3 లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారు’ అని వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. తడ మండలంలోని వాటంబేడులో బుధవారం ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాల కరపత్రాలను అందజేసి వాటి గురించి వివరించారు. పార్టీ మండల అధ్యక్షడు కొళివి రఘు ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో సంజీవయ్య మాట్లాడుతూ చెరువులు, కాలువలు, గుంతలను బాగు చేస్తున్నామని చెప్పి రూ.కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. నెర్రికాలువ మరమ్మతులు చేయడం పూర్తిగా విస్మరించారన్నారు. చెంతనే తెలుగుగంగ ప్రధాన కాలువనుంచి తమిళనాడుకు నీరు వెళుతుండగా నార్లు పోసుకోవడానికి చుక్కనీరు లేకుండా రైతులు ఇబ్బందులు పడుతుంటే గంగనీరు తీసుకురాలేని అసమర్ధులుగా టీడీపీ నేతలు మిగిలిపోయారని విమర్శించారు. ఒకవైపు లోటు బడ్జెట్ అంటూనే రూ.కోట్లు అనవరంగా ఖర్చు చేస్తున్నారన్నారు. చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లి గెలిచేందుకు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు. నీరు – చెట్టు పథకంలో రూ.కోట్లు అవినీతి పాల్పడుత్నుట్లు చెప్పారు. సంక్షేమ పథకాల సృష్టికర్త వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ కావాలంటే జగనన్నను సీఎం చేయాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడికి రూ.50 వేలు ఇస్తారన్నారు. బడికెళ్లే ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ.20 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. నవరత్నాల పథకాలు ప్రతి పేద ఇంటిని తాకుతాయని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి గండవరం సురేష్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు కళత్తూరు శేఖర్‌రెడ్డి, పట్టణ ప్రచార విభాగం కార్యదర్శి తుపాకుల ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి కొమ్మల శేఖర్‌బాబు, మండల రైతుల విభాగం అధ్యక్షులు చిల్లకూరు మునిరత్నం రెడ్డి, ఎంపీటీసీ హరినాథరెడ్డి, నరేష్‌రెడ్డి, అట్రంబాక రాజేష్, కారికాటి సురేష్‌రెడ్డి, చంద్రారెడ్డి, పాల మహేశ్వర్, తడకుప్పం రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
యువత జగన్ వెంటే నడవాలి
సూళ్లూరుపేట రూరల్ (నెల్లూరు): గ్రామీణ యువత ఎప్పుడూ యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడవాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కోరారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో గోపాలరెడ్డిపాళెం దళితవాడకు చెందిన యువత 25 మంది పురపాలక సంఘ సభ్యుడు పాలా మురళి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువత సహకారంతోనే తాను ఇది వరకు ఎన్నికల్లో విజయం సాధించినట్లు తెలిపారు. ఆ యువతకు తోడు మరికొంతమంది చేరడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డిపాళెం దళితవాడ యువత చెప్పిన సమస్యలపై సంజీవయ్య వెంటనే స్పందించారు. కొత్త దళితవాడకు దారి కోసం, దళిత కాలనీలో విద్యుత్ స్తంభాలు లేకపోవడంపై సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడారు. వచ్చే ఆదివారం గ్రామానికి విచ్చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఎం.బాలు, టి.నవీన్, టి.శరత్, బి.రాజేష్, ఎం.రామకృష్ణ, కె.సుబ్రమణ్యం, కె.అజయ్, ఎం.చిన్నరాజ, టి.ప్రసన్నకుమార్, ఎం.జానీ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గండవరం సురేష్‌రెడ్డి, తుపాకుల ప్రసాద్, గోగుల తిరుపాలు, తిరుమూరు రవిరెడ్డి, నరేష్‌రెడ్డి, బుంగా చెంగయ్య, ఆలీభాయ్, శరత్‌గౌడ్, యుగంధర బాబురెడ్డి, కన్నంబాకం శరత్, కుట్టి, రాఘవ, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా నిలుస్తాం
సూళ్లూరుపేట రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో అండగా నిలుస్తామని స్థానిక శాసన సభ్యులు, పార్టీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు పట్టణంలోని సత్యసాయి కల్యాణ మండపంలో జరిగిన బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలకు ముందు పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తనూ అధికారంలోకి వచ్చాక తాము భుజంపై మోస్తామన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కృషితో పార్టీ అధికారంలోకి వచ్చాక అదే కార్యకర్తల ఆధ్వర్యంలోనే ప్రజాసేవ చేస్తామన్నారు. గత ఎన్నికల్లో ప్రతి బూత్‌కు పదకొండు ఓట్లు తక్కువైనందున పార్టీ అధికారంలోకి రాలేక పోయిందని గుర్తు చేశారు. అందుకని ప్రతిఒక్కరూ కష్టపడి పార్టీని విజయ ప«థాన నడిపించాలని కోరారు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడు జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. అలాగే అధికార పార్టీ చేస్తున్న మోసాల గురించి అందరికీ తెలియజేసి వారిని తమ వైపునకు మరల్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి బూత్ కమిటీ సభ్యులు నాయకులై పని చేయాలన్నారు. పార్టీ నాయకులు కళత్తూరు శేఖర్‌రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు నలబోయిన రాజసులోచనమ్మ, మాదరపాకం బాలసుబ్రహ్మణ్యం, మంగా నెల్లూరు వీరరాఘవన్, గండవరం సురేష్‌రెడ్డి, వంకా రామాంజనేయులు, కర్లపూడి సురేష్ బాబు, శ్రీహరికోట చెంగయ్య, తుపాకుల ప్రసాద్, గోగుల తిరుపాలు, గాలి మల్లికార్జునరెడ్డి, మందా దేవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పేదలపై ఆవేశపడటం తగదు
సాక్షి, తడ (నెల్లూరు): అబద్ధపు హామీలు ఇచ్చి 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చక పోవడంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తారనే భయంతోనే చంద్రబాబు తన నోటికి పదును పెట్టారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. మత్స్యకార గ్రామాల పర్యటనలో భాగంగా గురువారం బీవీపాళెం పంచాయతీలోని పాతకుప్పం, కొత్తకుప్పం, పూడి పంచాయతీ, పూడి కుప్పం, తడ పంచాయతీ తడకుప్పంలో ఎమ్మెల్యే పర్యటించి కుప్పాల్లోని సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కిలివేటి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రజల సమస్యలు గాలికి వదిలి కేవలం తెలుగు తమ్ముళ్ల ధనదాహం తీర్చేందుకు నడుం బిగించారన్నారు. ఈ క్రమంలో గ్రామదర్శిని పేరుతో దోపిడీలకు ఉన్న అవకాశాలు, వనరులను వెతికేందుకు తమ్ముళ్లను గ్రామాల మీదికి పంపారు తప్ప సమస్యలు తెసుకునేందుకు కాదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. గతంలో తొమ్మిదేళ్లు తాజాగా నాలుగేళ్లుగా పాలన సాగిస్తూ ప్రజల సమస్యలన్నీ తొలగిపోయాయని ప్రకటనలు ఇస్తున్న సీఎం గ్రామాల్లో ఇంకా ఏం సమస్యలు మిగిలి ఉన్నాయని గ్రామాల్లో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎంతో సమయం వేచి చూసి ముఖ్యమంత్రిని చూస్తే వారి సమస్యలు తెలుసుకోకుండా దాడికి, ధూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే హితవు పలికారు. సీనియర్ నాయుకుడినంటూ గొప్పలు చెప్పుకునే బాబుగారు ఓట్లు అడిగే సమయంలో చూపిన వినయ విధేయతలు అధికారం దక్కి పాలన సాగించే సమయంలో చూపకపోవడమే సీనియారిటీనా అని ప్రశ్నిం చారు. మత్స్యకారులు తమను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ విశాఖపట్టణంలో శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిపై సాక్షాత్తు ముఖ్య మంత్రే కఠినంగా, దురుసుగా వ్యవహరిస్తే వారు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని పేర్కొన్నారు. టెంట్లు పీకేయండి లేకుంటే తాటతీస్తా అంటూ మత్స్యకారులపై గూండా తరహాలో హూంకారాలు చేయడం మత్స్యకారులు మరవలేదని ఆయన అన్నారు. తమ సమస్యలు తెలిపేం దుకు వెళ్లిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరి స్తాననడం, ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా అంటూ కులాలను తక్కువ చేసి మాట్లాడటం బాబు అహంభావానికి, ఓటమి భయానికి నిదర్శనాలని కిలివేటి అన్నారు. ఆయన ప్రజల తోకలు కత్తిరించడం అటుంచి ప్రజలు ఆయనకు గుండు కొట్టే సమయం ఆసన్నమయిందని ఎమ్మె ల్యే తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారులందరికీ తేడాలు లేకుండా వేట నిషేధ సమయంలో జీవన భృతి రూ.10వేలు అందిస్తానని చెప్పడంతో హడావిడిగా పులికాట్ జాలర్లకు రూ. 4వేలు భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని కిలివేటి అన్నారు. పులికాట్ మత్స్యకారులను మెరైన్ మత్స్యకారుల తరహాలో అన్ని సౌకర్యాలు అందేలా చట్టం తెచ్చే ఆలోచనలో జగన్మోహన్రెడ్డి ఉన్నట్టు కిలివేటి తెలిపారు. పులికాట్ పూడిక, ముఖద్వారాల పూడిక వల్ల పులికాట్ ఎండిపోతూ మత్స్య సంపద లభించక జాలర్లు వేట సాగని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన అన్నారు. సరస్సులో 75 శాతం మనకు ఉన్నా చేపలు, రొయ్యలు లేక 17 కుప్పాల జాలర్లు పూట గడవని స్థితిలో ఉన్నారని అన్నారు. తమిళనాడులో 25 శాతం సరస్సుని ఆధారంగా చేసుకుని కేవలం నాలుగు కుప్పాల జాలర్లు నివసిస్తున్నా అక్క డి ప్రభుత్వం ఏటా రెండు, మూడు కోట్లు ఖర్చు చేసి పూడికతీత తీయిస్తూ ఉండటంతో మత్స్య సంపద పుష్కలంగా లభిస్తూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే వేట కోసం తమి జాలర్లతో గొడవలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జా లర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ తడ మండల అధ్యక్షుడు కే రఘు, తిరుపతి పార్లమెంటరీ జాయింట్ సెక్రటరీ ఎస్ జయచంద్రారెడ్డి, నాయకులు కే ఆర్ముగం, కే శేఖర్‌బాబు, టీ కోదండం, జీ రత్నం, కే మురుగన్, కే వాసుమొదలి, పరమశివంరెడ్డి, తిరుమలైరెడ్డి, నత్తం శ్రీని వాసులు, ఎస్ కృష్ణారెడ్డి, శివకుమార్, బీ మోహన్, కుమార్, మణికంఠ, అనీష్ ఉన్నారు. -
దళిత విద్యార్థులంటే ఇంత చులకనా!
నాయుడుపేటటౌన్: నెల్లూరు జిల్లా ‘నాయుడుపేట గురుకులంలో పరిస్థితి ఇంత దారుణమా?, దళిత విద్యార్థులంటే ఇంత చులకనా’ అంటూ వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గురుకులాన్ని బుధవారం ఆయన ఆ పార్టీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ షేక్ రఫీ, మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, కౌన్సిలర్లు కేఎంవీ కళాచంద్ర, పలువురు నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఎమ్మెల్యే వంటగది వద్దకు వెళ్లారు. అపరిశుభ్ర పాత్రల్లో వంటలు చేస్తుండటం, మురికిమయంగా ఉన్న గ్రైండర్‌లోనే ఆకుకూర పప్పు వేసేందుకు ప్రయత్నిస్తుండటాన్ని చూసి ఇదేం పద్ధతి అంటూ కేర్ టేకర్‌గా ఉన్న గురుకుల పీడీ శ్రీరేష్పై మండిపడ్డారు. మోనూ ప్రకారం బుధవారం విద్యార్థులకు బెండకాయ తాళింపు వేయకపోవడాన్ని గుర్తించారు. అలాగే అన్నం సక్రమంగా వండకుండా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసి ఉండటం చూసిన కిలివేటి ‘మీ ఇంట్లో పిల్లలకు ఇలాగే పెడతారా’ అని వారిని ప్రశ్నాంచారు. పురుగులు పట్టిన బియ్యం, చెడిపోయిన కూరగాయలు, నాసిరకంగా ఉండే పప్పులు తదితరాలు స్టోరూంలో నిల్వలు చేసి ఉండటం చూచి ఇవేనా దళిత విద్యార్థులకు వండి పెడుతోంది అంటూ ఆగ్రహించారు. ‘ఎస్సీ విద్యార్థులంటే అంతా చులకనా’ అంటూ గురుకులు అధికారుల తీరుపై మండిపడ్డారు. అనంతరం తరగతి గదుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తమ బిడ్డలు గురుకులంలో అధ్వాన పరిస్థితుల మధ్య చదువులు సాగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఇళ్ల వద్ద ఇలాగే పెట్టుకుంటారా? విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లు దుర్గందభరితంగా ఉండటం చూసిన ఎమ్మెల్యే చలించిపోయారు. మరుగుదొడ్ల పక్కనే విద్యార్థుల వసతి భవానలు ఉండటంతో పారిశుద్ధ్యం పనులు చేపట్టపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. మీ ఇళ్ల వద్ద ఇలాగే పెట్టుకుంటారా అంటూ వారిని నీలదీశారు. గురుకులంలో పనిచేస్తున్న అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉంటూ దళిత విద్యార్థులకు కల్పించాల్సిన వసతులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి పాదర్తి హరిరెడ్డి, నాయకులు దొంతాల రాజశేఖర్‌రెడ్డి, పార్టీ తిరుపతి పార్లమెంటరీ ఎస్సీ సెల్ కార్యదర్శి చేవూరు చెంగయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి రత్నశ్రీ, విద్యార్థి విభాగం నాయకులు వెంకటేష్, ఇరుగు సాయి, విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు.