
పార్టీలో చేరుతున్న వారికి పార్టీ కండువాలు కప్పుతున్న ఎమ్మెల్యే కిలివేటి
నెల్లూరు, నాయుడుపేటటౌన్: రోజుకో మాట.. పూటకో అబద్ధం చెబుతూ మోసపూరిత పాలన సాగి స్తున్న సీఎం చంద్రబాబును సముద్రం లో కలిపే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎ మ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. శుక్రవారం నాయుడుపేటలోని లోతువానిగుంటలో నాయీబ్రాహ్మణ సంఘ నాయకులు పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ ఆధ్వర్యంలో కిలివేటి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే కిలివేటి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదన్న చంద్రబాబు తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరా టానికి పెద్ద ఎత్తున వస్తున్న ప్రజా స్పందనను చూసి నేడు మాట మార్చి ప్రత్యేక హోదాపై ఊసరవెల్లి నాటకాలు ఆడుతున్నారన్నారు.
అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబుకు జైలు జీవితం తప్పదని ఓటుకు నోటు కేసులో ఆయనకు భయం పుట్టుకుందని, అందుకే ప్రజలను రెచ్చగొట్టే దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం వైఎస్సార్‌సీపీకి భవిష్యత్‌లో పెట్టిన కోటగా నిలవబోతుందన్నారు. చంద్రబా బును విమర్శించే స్థాయి తనకు లేదని చెబుతున్న నెలవలా.. నీ గత చరిత్ర ఏమి టో తెలుసుకోవాలన్నారు. రూ.500కు హాస్టల్ సీటు అమ్ముకున్న నీవు దళితులను ఏ మాత్రం ఉద్దరిస్తున్నావో అందరికీ తెలుసన్నారు. ఎస్సీ కు లంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన చంద్రబాబు టీడీపీలో ఉన్న నీకు మా స్థాయిల గురించే మాట్లాడే అర్హత లేదన్నారు. సిగ్గు, రోషం ఉంటే నిజంగా దళిత కులంలో పుట్టి ఉంటే ఆ పార్టీని వీడి బయటకు రావాలన్నారు. దళితులకు చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలన్నారు.
దండుపాళెం గ్యాంగ్‌లా బావాబావమరుదులు
ప్రజల ఛీత్కారానికి గురైన బావాబావమరుదులు పరసా వెంకటరత్నం, నెలవల సుబ్రహ్మణ్యంలు దండుపాళెం గ్యాంగ్‌లాగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పరసా, నెలవలను ప్రజలు ఎప్పుడో మరిచిపోయారన్నారు. టీడీపీ నేతల తీరుతో విసుగు చెంది అనేక మంది వైస్సార్‌సీపీలో చేరుతున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డి, రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శి కళత్తూరు రామ్మోహన్‌రెడ్డి, మం డల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ షేక్ రఫీ, నాయీబ్రాహ్మణ సంఘ రాష్ట్ర కార్యదర్శి ముద్దపాటి శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు దుర్గారావు, మొదలియార్ సంఘ జిల్లా మాజీ అధ్యక్షుడు కరీం బాయి హరిబాబు మొదలియార్, మురారిశెట్టి హరిబాబు, ఎస్సీ నాయకులు చేవూరు చెంగయ్య తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment