సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
నెల్లూరు ,నాయుడుపేటటౌన్: గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని సంక్షేమ పథకాలను అధికారపార్టీ నాయకులకే పరిమితం చేస్తూ రాష్ట్రంలో ప్రమాదకరంగా మారిన ఎల్లో వైరస్‌ను ప్రజలు తరిమికోట్టే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నాయుడుపేటలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నాయకులతో కలసి మాట్లాడారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుకుంటూ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న యాత్ర చరిత్రలో అపూర్వ ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ స్మారక మందిరం నుంచి ప్రారంభించిన రోజే రాష్ట్రానికి సాధించాల్సిన లక్ష్యాలను స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధించుకోవడంతో పాటు ప్రతి ఇంటా వెలుగులు నింపాలన్నా సంకల్పంతో నవరత్నాలాంటి పథకాలను ప్రకటించారన్నారు.
ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేక చివరకు తమ నేతపై హత్యాయత్నం చేసే విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించక పోవడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు మూసివేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యను దూరం చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. 2019లో ప్రజలు తమ నేతను అదరించి ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఖాయమన్నారు. సమావేశంలో వైఎప్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుడుపేట, సూళ్లూరుపేట మండల కన్వీనర్లు తంబిరెడి సుబ్రమణ్యంరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పాదర్తి హరినా«థ్‌రెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, రైతు విభాగ జిల్లా కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మహిళా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రత్నశ్రీ, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు కళాత్తూరు శేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి చెంగయ్య, పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాబు, వాణిజ్య విభాగ పట్టణ అధ్యక్షుడు జి.మోహన్‌రావు, పట్టుకోట రఘు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment