యువత జగన్‌ వెంటే నడవాలి | TDP Leaders Joining YSRCP In Nellore | Sakshi
Sakshi News home page

యువత జగన్‌ వెంటే నడవాలి

Published Mon, Jul 30 2018 10:54 AM | Last Updated on Sat, Oct 20 2018 6:23 PM

TDP Leaders Joining YSRCP In Nellore - Sakshi

పార్టీలో చేరిన యువకులతో ఎమ్మెల్యే సంజీవయ్య

సూళ్లూరుపేట రూరల్‌ (నెల్లూరు): గ్రామీణ యువత ఎప్పుడూ యువ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడవాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కోరారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో గోపాలరెడ్డిపాళెం దళితవాడకు చెందిన యువత 25 మంది పురపాలక సంఘ సభ్యుడు పాలా మురళి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువత సహకారంతోనే తాను ఇది వరకు ఎన్నికల్లో విజయం సాధించినట్లు తెలిపారు. ఆ యువతకు తోడు మరికొంతమంది చేరడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డిపాళెం దళితవాడ యువత చెప్పిన సమస్యలపై సంజీవయ్య వెంటనే స్పందించారు.

కొత్త దళితవాడకు దారి కోసం, దళిత కాలనీలో విద్యుత్‌ స్తంభాలు లేకపోవడంపై సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడారు. వచ్చే ఆదివారం గ్రామానికి విచ్చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఎం.బాలు, టి.నవీన్, టి.శరత్, బి.రాజేష్, ఎం.రామకృష్ణ, కె.సుబ్రమణ్యం, కె.అజయ్, ఎం.చిన్నరాజ, టి.ప్రసన్నకుమార్, ఎం.జానీ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గండవరం సురేష్‌రెడ్డి, తుపాకుల ప్రసాద్, గోగుల తిరుపాలు, తిరుమూరు రవిరెడ్డి, నరేష్‌రెడ్డి, బుంగా చెంగయ్య, ఆలీభాయ్, శరత్‌గౌడ్, యుగంధర బాబురెడ్డి, కన్నంబాకం శరత్, కుట్టి, రాఘవ, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement