గుండ్లపాళెంలో ఇళ్ల నిర్మాణాలు
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు మించిన వారు లేరు. చేయని పనిని చేసినట్లుగా చెప్పడం ఆయన నైజం. ఇది మరోసారి నిరూపితమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరులో కట్టిన టిడ్కో ఇళ్లంటూ బాబు సెల్ఫీ దిగారు. అయితే ఆ ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిన ఘనత గత ప్రభుత్వానిది. నిజం ఏంటంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గృహాలను లబ్ధిదారులకు అందించింది. ఇంకా వేలాదిమంది మహిళలకు పట్టాలిచ్చి గృహాలు కట్టిస్తోంది.
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఇళ్ల నిర్మాణం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు పూర్తిగా అసత్యాలు. వెంకటేశ్వరపురంలోని జనార్దనరెడ్డి కాలనీలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయం వద్దకు శుక్రవారం ఆయన చేరుకుని సెల్ఫీ తీసుకున్నారు. ‘చూడు జగన్ మా ప్రభుత్వ హయాంలో పేదలకు కట్టిన వేలాది ఇళ్లు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లు ఎక్కడ? జవాబు చెప్పగలవా?’ అని ట్వీట్ చేశారు. అసలు విషయం తెలిసిన వారందరూ చంద్రబాబు అబద్ధాల కోరంటూ మండి పడుతున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో జనార్దనరెడ్డి కాలనీలో టిడ్కో గృహ సముదాయంలో నాలుగు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగలేదు. ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. 2019లో ఎన్నికల కోడ్ వచ్చింది. ఇళ్లు పూర్తి కాకపోయినా టీడీపీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా హడావుడిగా కొందరు లబి్ధదారులకు తాళాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే లబ్ధిదారులు స్పందించలేదు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. అన్ని వసతులు కలి్పంచి లబి్ధదారులకు అందజేసింది. ఇప్పటికే వేలాదిమంది ఈ గృహాల్లో నివాసం ఉంటున్నారు.
ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్
టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు ఇస్తామని చెప్పిన అప్పటి పాలకులు పేదల నెత్తిన అప్పుల భారాన్ని మోపారు. సింగిల్, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చేందుకు డిపాజిట్ రూపంలో నగదు వసూలు చేశారు. అంతేకాక బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి లబ్ధిదారులు నెల వాయిదాలు చెల్లించాలన్న నిబంధన పెట్టారు. సింగిల్ బెడ్‌రూం ఇల్లు పొందిన లబి్ధదారు క్రమం తప్పకుండా 20 సంవత్సరాలపాటు నెలకు రూ.3,500 చొప్పున చెల్లించేలా ఒప్పంద పత్రాలను తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సింగిల్ బెడ్‌రూం లబ్ధిదారుల నుంచి ఎటువంటి డిపాజిట్ రుసుం వసూలు చేయకుండా రూ.1కే రిజి్రస్టేషన్ చేసి ఇచ్చింది. అదేవిధంగా అప్పట్లో డబుల్ బెడ్‌రూం లబి్ధదారుల నుంచి కట్టించుకున్న డిజిపాట్లలో నేటి ప్రభుత్వం 50 శాతం మినహాయింపు ఇచ్చింది.
నేడు అక్కడే ఏడు వేలకు పైగా..
టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. నాడు 4 వేల ఇళ్లను అసంపూర్తిగా వదిలేయగా.. నేటి ప్రభుత్వం వాటిని పూర్తి చేసింది. అంతేకాకుండా అదే జనార్దనరెడ్డి కాలనీలోనే జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ఏడు వేలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టింది.
సొంతింటి కల సాకారం చేసేందుకు..
నెల్లూరు(అర్బన్): టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిలువ నీడ లేని నిరుపేదలు వేలాది మంది తమకు ఇంటి స్థలం మంజూరు చేయాలని అర్జీలు ఇచ్చినా స్పందించలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక జిల్లాలో 494 జగనన్న కాలనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో 56,734 మందికి స్థలాలు మంజూరు చేసింది. ఇళ్లు కూడా తామే కట్టిస్తామని చెప్పింది. ఇందుకోసం రూ.1,200 కోట్లను జిల్లాలోనే ఖర్చు చేస్తోంది. కేవలం స్థలాలను ఇవ్వడమే కాకుండా ఆ కాలనీలో తాగునీరు, విద్యుత్, రోడ్లు తదితర అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే సుమారు పదివేల ఇళ్లకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి.
పలుచోట్ల పేదలు ఇళ్లలో చేరి ఆనందంగా ఉంటున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తి ఒక్కో లబి్ధదారు సొంతం కానుంది. ఈ ఇంటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నందున వారి భవిష్యత్ అవసరాలకు విక్రయించుకోవచ్చు. రిజి్రస్టేషన్ వల్ల విలువ పెరుగుతుంది. కాగా ఏప్రిల్ 15వ తేదీ నాటికి 16 వేల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేశారు. అవి మంజూరు కావాలన్నా జన్మభూమి కమిటీల సిఫార్స్ తప్పనిసరి. సభ్యులకు లంచాలు ఇచ్చుకోవాల్సిందే. అసలు వాస్తవాలు ఇవైతే ప్రచార ఆర్భాటంతో చంద్రబాబు ఇప్పుడు ఇళ్ల పేరుతో డ్రామా ఆడుతున్నారని లబి్ధదారులు మండి పడుతున్నారు.
ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది
టీడీపీ హయాంలో జనార్దనరెడ్డి కాలనీలో నాకు టిడ్కో ఇల్లు మంజూరైంది. అయితే నిర్మాణ పనులు అప్పుడు పూర్తికాకపోవడంతో ఇవ్వలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఒక్క రూపాయితో రిజి్రస్టేషన్ చేయించి ఇచ్చారు.
– జోత్స్న, టిడ్కో ఇల్లు లబి్ధదారు
Comments
Please login to add a commentAdd a comment