selfie photo
-
మెలోనీ ‘మెలోడీ’కి మోదీ ఫిదా
న్యూఢిల్లీ: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చేసిన ‘మెలోడీ’కి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నెటిజన్లంతా ఫిదా అయ్యారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానులిద్దరి మధ్య నడిచిన పోస్టులు వైరల్‌గా మారాయి. శుక్రవారం దుబాయ్‌లో కాప్28 సదస్సు సందర్భంగా వారిద్దరూ భేటీ కావడం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీతో తీసుకున్న సెల్ఫీని మెలోనీ శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘కాప్28 సదస్సులో మంచి మిత్రులు’అనే క్యాప్షన్‌తో పాటు, తామిద్దరి పేర్లనూ అందంగా కలుపుతూ ‘మెలోడీ’అంటూ హాష్టాగ్ జత చేశారు. దాంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. చూస్తుండగానే దానికి ఏకంగా 2.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీనికి మోదీ కూడా సరదాగా స్పందించారు. ‘మిత్రులతో కలయిక ఎప్పుడూ ఆహ్లాదకరమే’అనే క్యాప్షన్‌తో మెలోనీ సెల్ఫీని రీపోస్ట్ చేశారు. వారి పోస్టులు ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. జీ20 నుంచీ ట్రెండింగ్‌లోనే.. నిజానికి ‘మెలోడీ’ హా‹Ùటాగ్ గత నెలలో భారత్ తొలిసారి ఆతిథ్యమిచి్చన జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగినప్పటి నుంచీ ఇంటర్నెట్లో వైరలైంది. సోషల్ సైట్లలో తెగ తిరుగుతోంది. ఆ సదస్సు ఆద్యంతం మోదీ, మెలోనీ పరస్పరం స్నేహపూర్వకంగా మెలిగిన తీరు అందరి దృష్టినీ బాగా ఆకర్షించింది. ఆతిథ్య దేశ సారథిగా మిగతా దేశాధినేతలతో పాటు మెలోనీని కూడా మోదీ సాదరంగా సదస్సుకు ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆమె మోదీతో కరచాలనం చేశారు. కాసేపు ముచ్చటించుకుని ఇరువురూ నవ్వుల్లో మునిగి తేలారు. ఇదే ఒరవడి తాజాగా కాప్28 సదస్సులోనూ కొనసాగింది. -
‘ఐ విల్ ఓట్.. బికాజ్ ఐ లవ్ సూర్యాపేట’
దురాజ్‌పల్లి (సూర్యాపేట): ‘ఐ విల్ ఓట్.. బికాజ్ ఐ లవ్ సూర్యాపేట’అని రాసి ఉన్న సెల్ఫీ పాయింట్ వద్ద సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అదనపు కలెక్టర్లు ప్రియాంక, వెంకట్‌రెడ్డి ఫొటో దిగారు. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు, ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. శనివారం అక్కడ ఫొటో దిగిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి 12 చొప్పున సెల్ఫీ పాయింట్స్‌ను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలలో సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేసి ఓటు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమని, అర్హత ఉన్న ప్రతివారూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘సోషల్’ మానిటరింగ్! ఎన్నికల ప్రశాంతతను చెడగొట్టే మెసేజ్‌లపై పోలీసుల నిఘా అన్ని జిల్లాల్లో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికలను అన్ని పార్టీల వారూ విరివిగా వాడుతున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు వీటిని అ్రస్తాలుగా మార్చుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు శ్రుతిమించకుండా పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రతి జిల్లా పరిధిలో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రశాంతతను చెడగొట్టే, కించపర్చే వ్యాఖ్యలు, వర్గాల మధ్య ఉద్రిక్తలకు దారితీసే ఫొటోలు, వీడియోలు, సందేశాలపై నిఘా పెడుతున్నారు. స్థానికంగా నేతల పర్యటనలు, సభలు, ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రత్యర్థులను రెచ్చగొట్టే, కించపర్చే సందేశాలు ఉంటున్నాయా.. అని మానిటరింగ్ సెల్ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన పోస్టులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. వర్గాల మధ్య వైషమ్యాలు తెచ్చేలా, ఇతర వర్గాలను కించపర్చేలా ఎవరైనా పోస్టులు పెట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
అబద్ధాల ‘బాబు’ తీరు ఇది.. ఇదేం సెల్ఫీ చంద్రబాబు!
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు మించిన వారు లేరు. చేయని పనిని చేసినట్లుగా చెప్పడం ఆయన నైజం. ఇది మరోసారి నిరూపితమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరులో కట్టిన టిడ్కో ఇళ్లంటూ బాబు సెల్ఫీ దిగారు. అయితే ఆ ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిన ఘనత గత ప్రభుత్వానిది. నిజం ఏంటంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గృహాలను లబ్ధిదారులకు అందించింది. ఇంకా వేలాదిమంది మహిళలకు పట్టాలిచ్చి గృహాలు కట్టిస్తోంది. నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఇళ్ల నిర్మాణం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు పూర్తిగా అసత్యాలు. వెంకటేశ్వరపురంలోని జనార్దనరెడ్డి కాలనీలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయం వద్దకు శుక్రవారం ఆయన చేరుకుని సెల్ఫీ తీసుకున్నారు. ‘చూడు జగన్ మా ప్రభుత్వ హయాంలో పేదలకు కట్టిన వేలాది ఇళ్లు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లు ఎక్కడ? జవాబు చెప్పగలవా?’ అని ట్వీట్ చేశారు. అసలు విషయం తెలిసిన వారందరూ చంద్రబాబు అబద్ధాల కోరంటూ మండి పడుతున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో జనార్దనరెడ్డి కాలనీలో టిడ్కో గృహ సముదాయంలో నాలుగు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగలేదు. ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. 2019లో ఎన్నికల కోడ్ వచ్చింది. ఇళ్లు పూర్తి కాకపోయినా టీడీపీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా హడావుడిగా కొందరు లబి్ధదారులకు తాళాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే లబ్ధిదారులు స్పందించలేదు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. అన్ని వసతులు కలి్పంచి లబి్ధదారులకు అందజేసింది. ఇప్పటికే వేలాదిమంది ఈ గృహాల్లో నివాసం ఉంటున్నారు. ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లు ఇస్తామని చెప్పిన అప్పటి పాలకులు పేదల నెత్తిన అప్పుల భారాన్ని మోపారు. సింగిల్, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు డిపాజిట్ రూపంలో నగదు వసూలు చేశారు. అంతేకాక బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి లబ్ధిదారులు నెల వాయిదాలు చెల్లించాలన్న నిబంధన పెట్టారు. సింగిల్ బెడ్రూం ఇల్లు పొందిన లబి్ధదారు క్రమం తప్పకుండా 20 సంవత్సరాలపాటు నెలకు రూ.3,500 చొప్పున చెల్లించేలా ఒప్పంద పత్రాలను తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సింగిల్ బెడ్రూం లబ్ధిదారుల నుంచి ఎటువంటి డిపాజిట్ రుసుం వసూలు చేయకుండా రూ.1కే రిజి్రస్టేషన్ చేసి ఇచ్చింది. అదేవిధంగా అప్పట్లో డబుల్ బెడ్రూం లబి్ధదారుల నుంచి కట్టించుకున్న డిజిపాట్లలో నేటి ప్రభుత్వం 50 శాతం మినహాయింపు ఇచ్చింది. నేడు అక్కడే ఏడు వేలకు పైగా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. నాడు 4 వేల ఇళ్లను అసంపూర్తిగా వదిలేయగా.. నేటి ప్రభుత్వం వాటిని పూర్తి చేసింది. అంతేకాకుండా అదే జనార్దనరెడ్డి కాలనీలోనే జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ఏడు వేలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టింది. సొంతింటి కల సాకారం చేసేందుకు.. నెల్లూరు(అర్బన్): టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిలువ నీడ లేని నిరుపేదలు వేలాది మంది తమకు ఇంటి స్థలం మంజూరు చేయాలని అర్జీలు ఇచ్చినా స్పందించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక జిల్లాలో 494 జగనన్న కాలనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో 56,734 మందికి స్థలాలు మంజూరు చేసింది. ఇళ్లు కూడా తామే కట్టిస్తామని చెప్పింది. ఇందుకోసం రూ.1,200 కోట్లను జిల్లాలోనే ఖర్చు చేస్తోంది. కేవలం స్థలాలను ఇవ్వడమే కాకుండా ఆ కాలనీలో తాగునీరు, విద్యుత్, రోడ్లు తదితర అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే సుమారు పదివేల ఇళ్లకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. పలుచోట్ల పేదలు ఇళ్లలో చేరి ఆనందంగా ఉంటున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తి ఒక్కో లబి్ధదారు సొంతం కానుంది. ఈ ఇంటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నందున వారి భవిష్యత్ అవసరాలకు విక్రయించుకోవచ్చు. రిజి్రస్టేషన్ వల్ల విలువ పెరుగుతుంది. కాగా ఏప్రిల్ 15వ తేదీ నాటికి 16 వేల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేశారు. అవి మంజూరు కావాలన్నా జన్మభూమి కమిటీల సిఫార్స్ తప్పనిసరి. సభ్యులకు లంచాలు ఇచ్చుకోవాల్సిందే. అసలు వాస్తవాలు ఇవైతే ప్రచార ఆర్భాటంతో చంద్రబాబు ఇప్పుడు ఇళ్ల పేరుతో డ్రామా ఆడుతున్నారని లబి్ధదారులు మండి పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది టీడీపీ హయాంలో జనార్దనరెడ్డి కాలనీలో నాకు టిడ్కో ఇల్లు మంజూరైంది. అయితే నిర్మాణ పనులు అప్పుడు పూర్తికాకపోవడంతో ఇవ్వలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఒక్క రూపాయితో రిజి్రస్టేషన్ చేయించి ఇచ్చారు. – జోత్స్న, టిడ్కో ఇల్లు లబి్ధదారు -
శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్‌పల్లిలో దిల్ రాజు ఇష్టదైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా నిరాడంబరంగా తేజస్వినితో ఆయన వివాహం జరిగింది. దీంతో గత రెండు రోజులుగా ఈ బడా నిర్మాత పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా రాజు-తెజస్వినిలకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివాహం తర్వాత శ్రీమతితో దిల్ రాజు దిగిన తొలి సెల్ఫీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొత్త జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక దిల్ రాజును వివాహం చేసుకున్న తేజస్విని గురించి తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్‌లో వెదుకులాట ప్రారంభించారు. అయితే ఆమె గురించి ఎలాంటి అధికారిక సమాచారం ఇప్పటివరకు తెలియలేదు. ఇక దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు ‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’ -
ఐసీసీ సెల్ఫీ డే స్పెషల్
జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం మాత్రమే కాదు, సెల్ఫీ ప్రేమికులు ఈ రోజును సెల్ఫీ డేగా (2014 నుంచి) జరుపుకుంటున్నారు. సెల్ఫీ డే సందర్బంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొన్ని ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది. ‘మీ అభిమాన క్రికెట్లర్ల సెల్ఫీ ఫోటోలు చూడండి’ అంటూ ఐసీసీ ఆ షేర్లో పేర్కొంది. గత ఏడాది కాలంగా ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న జట్లతో పాటు, మాజీ దిగ్గజ క్రికెట్లర్లు దిగిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి. ఐసీసీ షేర్ చేసిన ఫోటోల్లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత బృందం ఉంది. 2017 మహిళల ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు సెల్ఫీ ఫోటో, 2018లో చాంపియన్ ట్రోఫీ నెగ్గిన పాకిస్తాన్ జట్టు ఫోటో, ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు దిగ్గిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. To celebrate World #SelfieDay, let's see some of your favourite cricket-related selfies! 😁🤳 pic.twitter.com/d4RbB5Rols — ICC (@ICC) 21 June 2018 -
సెల్ఫీ కోసం ముక్కు కోసుకుంటున్నారు!
వాషింగ్టన్: ఇప్పుడు చాలా మందికి సెల్ఫీలు తీసుకోవడమంటే మహా సరదా. ఈ సెల్ఫీల పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఫొటోల్లో తమ ముక్కు పెద్దదిగా కనిపిస్తోందనీ, శస్త్రచికిత్స ద్వారా దాని పరిమాణాన్ని తగ్గించాలంటూ ప్లాస్టిక్ సర్జన్ల దగ్గరకు అనేకమంది వరుసలు కడుతున్నారు. సెల్ఫీ ఫొటో తీసుకునేటప్పుడు ఫోన్‌ను ముఖానికి దగ్గరగా పెట్టాల్సి రావడం వల్లనే ముక్కు అలా కనిపిస్తోంది తప్ప వాస్తవానికి సమస్యేమీ లేదని వైద్యులు చెబుతున్నా వారు వినడం లేదు. దీంతో ప్లాస్టిక్ సర్జన్లకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. ఈ విషయాన్ని అమెరికాలోని ప్లాస్టిక్ సర్జన్ల పత్రిక ‘జామా ఫేషల్ ప్లాస్టిక్ సర్జరీ’ ఇటీవల ప్రచురించింది. 30 శాతం పెద్దదిగా కనిపిస్తుంది.. ముఖానికి కెమెరా లెన్స్ 12 అంగుళాల కంటే తక్కువ దూరంలో ఉంటే సెల్ఫీల్లో ముక్కులు అసలు సైజు కన్నా 30 శాతం పెద్దగా కనిపిస్తాయి. ఇది గమనించకుండా అనేక మంది ఆపరేషన్ చేసి తమ ముక్కును అందంగా తీర్చిదిద్దాలంటూ తన క్లినిక్ వచ్చి అడుగుతున్నారని అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీలో పనిచేసే ఫేషల్ ప్లాస్టిక్ సర్జన్ బోరిస్ పాష్కోవర్ తెలిపారు. ఈయన తన సహచరులతో కలసి రాసిన వ్యాసాన్నే జామా ఫేషల్ ప్లాస్టిక్ సర్జరీ ప్రచురించింది. అమెరికన్ ఫేషల్ ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ సర్జన్ల అకాడమీ ప్రజల్లో కనిపిస్తున్న ఈ వేలం వెర్రిని గమనించింది. సెల్ఫీల్లో అందంగా కనిపించేలా చేయాలంటూ అనేక మంది తమను కలుస్తున్నారని 2017లో జరిపిన ఓ సర్వేలో 55 శాతం ఫేషల్ ప్లాస్టిక్ సర్జన్లు చెప్పారు. ‘సెల్ఫీల్లో ముక్కు పెద్దదిగా కనిపిస్తోందంటూ అనేకులు నా దగ్గరకు వస్తున్నారు. వారి ముక్కు పెద్దగా ఏమీ లేదనీ, కెమెరాను దగ్గరగా ఉంచి సెల్ఫీ తీయడం వల్లే పరిమాణంలో పెద్దగా కనిపిస్తోందని చెబుతున్నాను’ అని తెలిపారు. కెమెరాను దూరంగా పెడితే ముక్కు సైజు తగ్గుతుందని ఆయన వెల్లడించారు. -
నటితో ధోని సెల్ఫీ ఫోటో హల్చల్
పై ఫోటోలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్.ధోనితో నటి ఆండ్రియాను చూస్తుంటే మీకేమనిపిస్తోంది.ధోని ఆండ్రియాకు బాయ్‌ఫ్రెండ్ అయ్యారా?అనిపిస్తోందా?ఇంతకు ముందు నటి రాయ్‌లక్ష్మీని ధోనితో కలిపి మీడియాలో చాలా ప్రచారాలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ధోని,ఆండ్రియాలను అలా ఊహించుకునే అవకాశం లేక పోలేదు.ఎందుకంటే నటి ఆండ్రియాకు సంచలన నటి అనే పేరుంది.ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుద్‌తో ఉన్న సన్నిహిత ఫోటోలు చాలా కలకలాన్నే సృష్టించాయన్న విషయం తెలిసిందే.అయితే ధోని,ఆండ్రియాల మధ్య అలాంటి సంబంధాలను ఊహించకండి.ఇది ఒక క్రేజీ సెల్పీ ఫోటోనే.సాధారణంగా సినీ తారలకు అభిమానులు అధిక సంఖ్యలో ఉంటుంటారు.వారంతా తమ అభిమాన తారలను కలిసి ఫోటోలు తీసుకోవాలని ఆశపడుతుంటారు. అయితే సినీ తారలకు అభిమానులుంటారు.వారికీ తమ అభిమానులు తారస పడితే వారితో ఫోటో తీసుకోవాలని కోరుకుంటారు.అలా తన అభిమాన క్రీడాకారుడు ధోని తాను ప్రయాణిస్తున్న ఫై్లట్నే ఎదురైతే ఆండ్రియా ఊరుకుంటారా? వెంటనే ఒక సెల్ఫీ ఫోటోకు తన ఫోన్ కెమెరాకు పని చెప్పరూ అలాంటి సెల్ఫీ పోటోనే అది.ధోనితో తాను దిగిన ఫోలోను నటి ఆండ్రియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అదిప్పుడు హల్చల్ చేస్తోంది.ఇక పోతే నటి ఆండ్రియా ప్రస్తుతం తరమణి చిత్రంతో పాటు,ధనుష్‌తో వడచెన్నై చిత్రంలో నటిస్తున్నారు. -
నాకు సెల్ఫీ నచ్చదు
సృష్టిలో అమ్మతనాన్ని మించిన కమ్మదనం మరొకటి ఉండదంటారు. అలాంటి మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు నటి స్నేహ. నవ్వితే నోటి నుంచి ముత్యాలు రాలుతున్నాయా అన్నంత ఆకర్షణ ఈమె నవ్వులో ఉంది. ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ కుటుంబ కథా చిత్రాల నాయకి ఇమేజ్ను సంపాదించుకున్న స్నేహ మలయాళంలోనూ పలు మంచి చిత్రాలను చేసి బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. 2000వ సంవత్సరంలో విరుంబుగిరేన్(ఇష్టపడుతున్నాను)అంటూ నాయకిగా కోలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ భామ తొలి చిత్రంలోనే చక్కని అభినయాన్ని చూపి మంచి నటిగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత నటిగా తను వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. తమిళంలో అచ్చముండు అచ్చముండు చిత్ర షూటింగ్ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు ప్రసన్నతో పరిచయం ప్రేమగా మారడంతో అది పెళ్లికి దారి తీసింది. 2012లో ప్రసన్నతో ఏడడుగులు నడిచారు. 2015 ఆగస్ట్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. వివాహానంతం నటనకు దూరంగా ఉన్న స్నేహ మధ్యలో భర్తతో కలిసి వాణిజ్య ప్రకటనలు, ఫ్యాషన్‌షోలు లాంటివి చేశారు. ఎక్కువగా కుటుంబానికే సమయాన్ని కేటాయించిన స్నేహ ఇటీవల మళ్లీ నటనకు తిరిగారు. ఒక టీవీ డాన్స్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా స్నేహ ఇచ్చిన భేటీ చూద్దాం.. ప్ర: సంసార జీవితం ఎలా ఉంది: జ : చాలా చాలా హ్యాపీగా సాగుతోంది. ప్ర: మీ అబ్బాయి విహాన్ ముచ్చట్లేమిటీ? జ : విహాన్ ఒట్టి అల్లరివాడు. చాలా చలాకీగా ఉంటారు. వాడి ప్రతి మూమెంట్‌ను మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. విహాన్కిప్పుడు ఏడాది దాటింది.అందుకే నేను మళ్లీ నటించడానికి సిద్ధమయ్యాను. వృత్తి రీత్యా మాకు ఎంత ఒత్తిడి ఉన్నా విహాన్ నవ్వుతో అంతా మటుమాయం అయిపోతుంది. ప్ర: వాళ్ల నాన్న ప్రసన్నతో విహాన్ ఎట్రాసిటి ఎలా ఉంటుంది? జ: కాళీ సమయాల్లో ప్రసన్న విహాన్తోనే గడుపుతారు. తండ్రికొడుకులిద్దరూ తరచూ సెల్ఫీలు తీసుకుంటారు. విహాన్ వాళ్ల నాన్న మాదిరిగానే సెల్ఫీకి ఫోజులిస్తాడు. నేను ఎప్పుడైనా వారితో సెల్ఫీ తీసుకుంటాను. సాధారణంగా నాకు సెల్ఫీ అంటే అంత నచ్చదు. ప్ర: ఈ మధ్య ఎవరి నుంచి అయినా ప్రశంసలు అందుకున్నారా? జ: ఇంట్లో మంచి కోడలిగా పేరు తెచ్చుకున్నాను. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాల వివరాలు? జ: ఇంతకు ముందు మలయాళంలో మమ్ముట్టితో కలిసి రెండు చిత్రాలు చేశాను. మళ్లీ ఇప్పుడు ఆయనతో కలిసి గ్రేట్ ఫాదర్ అనే చిత్రంలో నటిస్తున్నాను. నిజానికి మళ్లీ నటించడంపై నాకు ఆసక్తి లేదు. ప్ర: ప్రస్తుత నటీనటుల్లో మీకు ఎవరంటే ఇష్టం? జ: నటుడు విజయ్‌సేతుపతి అంటే చాలా ఇష్టం. ఇటీవల కలిసినప్పుడు ఆయనతో ఇదే విషయాన్ని చెప్పాను.ఆయన ఎంచుకుంటున్న కథలు, పాత్రల పోషణ, సంభాషణలు చెప్పే విధానం, ఎక్కడా ఓవర్ యాక్షన్ లేకుండా సహజ నటన నాకు నచ్చాయి. ఇక హీరోయిన్లు అందరూ చక్కగా నటిస్తున్నారు. -
పండగ చేసుకున్నారు!
నయనతార హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడున్న ఫొటో స్పష్టం చేస్తోంది. కేరళ స్టైల్ చీర, నుదుట చిన్ని బొట్టు, ఫ్రీగా వదిలేసిన జుత్తు.. సూపర్బ్‌గా ఉన్నారు. ఓనమ్ పండగ కోసమే ఇలా ముస్తాబయ్యారు. ఈ పండగను ఆమె దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలసి చేసుకున్నారని బయటికొచ్చిన ఫొటో నిరూపిస్తోంది. విఘ్నేశ్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీదాన్’లో కథానాయికగా నటిస్తున్నప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్. ఆ వార్తలకు నయనతార, విఘ్నేష్ స్పందించకపోయినప్పటికీ కలసి వేడుకల్లో పాల్గొనడం, క్లోజ్‌గా మాట్లాడుకోవడం నలుగురి దృష్టిలో పడింది. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ ఉందనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏం కావాలి? నయనతార, విఘ్నేష్ మాటలతో చెప్పకపోయినా తమ అనుబంధాన్ని సీక్రెట్‌గా ఉంచదల్చుకోలేదని నలుగురూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బయటికొచ్చిన ఫొటోని చూసి.. త్వరలో వివాహ తేదీ ప్రకటిస్తారనే ఊహాగానాలున్నాయి. మరి... ప్రకటిస్తారా? వెయిట్ అండ్ సీ.