పండగ చేసుకున్నారు! | Vignesh Shivan's Onam selfie with Nayan goes viral | Sakshi
Sakshi News home page

పండగ చేసుకున్నారు!

Published Wed, Sep 14 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

పండగ చేసుకున్నారు!

పండగ చేసుకున్నారు!

నయనతార హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడున్న ఫొటో స్పష్టం చేస్తోంది. కేరళ స్టైల్ చీర, నుదుట చిన్ని బొట్టు, ఫ్రీగా వదిలేసిన జుత్తు.. సూపర్బ్‌గా ఉన్నారు. ఓనమ్ పండగ కోసమే ఇలా ముస్తాబయ్యారు. ఈ పండగను ఆమె దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలసి చేసుకున్నారని బయటికొచ్చిన ఫొటో నిరూపిస్తోంది. విఘ్నేశ్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీదాన్’లో కథానాయికగా నటిస్తున్నప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్.
 
  ఆ వార్తలకు నయనతార, విఘ్నేష్ స్పందించకపోయినప్పటికీ కలసి వేడుకల్లో పాల్గొనడం, క్లోజ్‌గా మాట్లాడుకోవడం నలుగురి దృష్టిలో పడింది. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ ఉందనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏం కావాలి? నయనతార, విఘ్నేష్ మాటలతో చెప్పకపోయినా తమ అనుబంధాన్ని సీక్రెట్‌గా ఉంచదల్చుకోలేదని నలుగురూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బయటికొచ్చిన ఫొటోని చూసి.. త్వరలో వివాహ తేదీ ప్రకటిస్తారనే ఊహాగానాలున్నాయి. మరి... ప్రకటిస్తారా? వెయిట్ అండ్ సీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement