జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం మాత్రమే కాదు, సెల్ఫీ ప్రేమికులు ఈ రోజును సెల్ఫీ డేగా (2014 నుంచి) జరుపుకుంటున్నారు. సెల్ఫీ డే సందర్బంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొన్ని ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేసింది. ‘మీ అభిమాన క్రికెట్లర్ల సెల్ఫీ ఫోటోలు చూడండి’ అంటూ ఐసీసీ ఆ షేర్‌లో పేర్కొంది. గత ఏడాది కాలంగా ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న జట్లతో పాటు, మాజీ దిగ్గజ క్రికెట్లర్లు దిగిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి.
ఐసీసీ షేర్ చేసిన ఫోటోల్లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత బృందం ఉంది. 2017 మహిళల ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు సెల్ఫీ ఫోటో, 2018లో చాంపియన్ ట్రోఫీ నెగ్గిన పాకిస్తాన్ జట్టు ఫోటో, ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు దిగ్గిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
To celebrate World #SelfieDay, let's see some of your favourite cricket-related selfies! 😁🤳 pic.twitter.com/d4RbB5Rols
— ICC (@ICC) 21 June 2018
Comments
Please login to add a commentAdd a comment