సౌతాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (డిసెంబర్ 11) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జనవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. భ్లోంఫాంటీన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
అనంతరం భారత్.. జనవరి 25, 28 తేదీల్లో ఐర్లాండ్, యూఎస్‌ఏలతో తమ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 19న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఐర్లాండ్, యూఎస్‌ఏ జట్లు తలపడనున్నాయి.
16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించడిన ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్‌ఏ జట్లు ఉండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు.. గ్రూప్-సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా జట్లు.. గ్రూప్-డిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్ జట్లు పోటీపడనున్నాయి.
కాగా, తొలుత ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ భావించింది. అయితే ఆ దేశ క్రికెట్ బోర్డులో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఐసీసీ వేదికను దక్షిణాఫ్రికాకు మార్చింది.
Comments
Please login to add a commentAdd a comment