World Cup Schedule
-
టీ20 వరల్డ్‌కప్ 2024 షెడ్యూల్ విడుదల.. జూన్ 9న భారత్-పాక్ మ్యాచ్
2024 టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికలుగా జరిగే ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలై 29వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లు విభజించబడి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్, పాక్‌లతో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్లు ఉండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో పాటు నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ జట్లు.. గ్రూప్-సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఉగాండ, పపువా న్యూ గినియా.. గ్రూప్-డిలో సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో పాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు జూన్ 1 నుంచి 18 వరకు జరుగనుండగా.. సూపర్ 8 దశ మ్యాచ్‌లు జూన్ 19 నుంచి 24 వరకు జరుగుతాయి. జూన్ 26, 27 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు (గయనా, ట్రినిడాడ్) జరుగనుండగా.. జూన్ 29న ఫైనల్ (బార్బడోస్) జరుగుతుంది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్.. జూన్ 1: యూఎస్ఏ వర్సెస్ కెనడా మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతాయి. Groups of T20 World Cup 2024. 🏆 pic.twitter.com/If2Dyo6GTK — Johns. (@CricCrazyJohns) January 5, 2024 మెగా టోర్నీలో గ్రూప్ దశలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. జూన్ 5: భారత్ వర్సెస్ ఐర్లాండ్ (న్యూయార్క్) జూన్ 9: భారత్ వర్సెస్ పాకిస్తాన్ (న్యూయార్క్) జూన్ 12: భారత్ వర్సెస్ యూఎస్ఏ (న్యూయార్క్) జూన్ 15: భారత్ వర్సెస్ కెనడా (ఫ్లోరిడా) INDIA vs PAKISTAN ON JUNE 9th AT NEW YORK IN T20I WORLD CUP 2024.....!!!!! pic.twitter.com/y1d6l3gT3H — Johns. (@CricCrazyJohns) January 5, 2024 గ్రూప్ దశలో జరుగబోయే మొత్తం మ్యాచ్‌ల వివరాలు.. జూన్ 1: యూఎస్ఏ వర్సెస్ కెనడా (డల్లాస్) జూన్ 2: నమీబియా వర్సెస్ ఒమన్ (బార్బడోస్) జూన్ 2: వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూ గినియా (గయానా) జూన్ 3: శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా (న్యూయార్క్) జూన్ 3: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఉగాండ (గయానా) జూన్ 4: నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్ (డల్లాస్) జూన్ 4: ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్ (బార్బడోస్) జూన్ 5: భారత్ వర్సెస్ ఐర్లాండ్ (న్యూయార్క్) జూన్ 5: ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్ (బార్బడోస్) జూన్ 5: పుపువా న్యూ గినియా వర్సెస్ ఉగాండ (గయానా) జూన్ 6: యూఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్ (డల్లాస్) జూన్ 6: నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ (బార్బడోస్) జూన్ 7: శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ (డల్లాస్) జూన్ 7: ఐర్లాండ్ వర్సెస్ కెనడా (న్యూయార్క్) జూన్ 7: న్యూజిలాండ్ వర్సెస్ ఆప్ఘనిస్తాన్ (గయానా) జూన్ 8: నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా (న్యూయార్క్) జూన్ 8: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్) జూన్ 8: వెస్టిండీస్ వర్సెస్ ఉగాండ (గయానా) జూన్ 9: భారత్ వర్సెస్ పాకిస్తాన్ (న్యూయార్క్) జూన్ 9: ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్ (ఆంటిగ్వా) జూన్ 10: సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ (న్యూయార్క్) జూన్ 11: శ్రీలంక వర్సెస్ నేపాల్ (లాడర్‌హిల్) జూన్ 11: పాకిస్తాన్ వర్సెస్ కెనడా (న్యూయార్క్) జూన్ 11: ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా (ఆంటిగ్వా) జూన్ 12: వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ (ట్రినిడాడ్) జూన్ 12: భారత్ వర్సెస్ యూఎస్ఏ (న్యూయార్క్) జూన్ 13: ఇంగ్లండ్ వర్సెస్ ఒమన్ (ఆంటిగ్వా) జూన్ 13: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పపువా న్యూ గినియా (ట్రినిడాడ్) జూన్ 13: బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ (సెయింట్ విన్సెంట్) జూన్ 14: యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ (లాడర్‌హిల్) జూన్ 14: న్యూజిలాండ్ వర్సెస్ ఉగాండ (ట్రినిడాడ్) జూన్ 14: సౌతాఫ్రికా వర్సెస్ నేపాల్ (సెయింట్ విన్సెంట్) జూన్ 15: భారత్ వర్సెస్ కెనడా (ఫ్లోరిడా) జూన్ 15: నమీబియా వర్సెస్ ఇంగ్లండ్ (ఆంటిగ్వా) జూన్ 15: ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్ (సెయింట్ లూసియా) జూన్ 16: పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ (లాడర్‌హిల్) జూన్ 16: శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ (సెయింట్ లూసియా) జూన్ 16: బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్ (సెయింట్ విన్సెంట్) జూన్ 17: న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ (ట్రినిడాడ్) జూన్ 17: వెస్టిండీస్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (సెయింట్ లూసియా) సూపర్ 8 మ్యాచ్‌లు.. జూన్ 19: ఏ2 వర్సెస్ డి1 (ఆంటిగ్వా) జూన్ 19: బి1 వర్సెస్ సి2 (సెయింట్ లూసియా) జూన్ 20: బి2 వర్సెస్ డి2 (ఆంటిగ్వా) జూన్ 20: ఏ1 వర్సెస్ సి1 (బార్బడోస్) జూన్ 21: ఏ2 వర్సెస్ సి2 (బార్బడోస్) జూన్ 21: బి1 వర్సెస్ డి1 (సెయింట్ లూసియా) జూన్ 22: ఏ1 వర్సెస్ డి2 (ఆంటిగ్వా) జూన్ 22: సి1 వర్సెస్ బి2 (సెయింట్ విన్సెంట్) జూన్ 23: సి2 వర్సెస్ డి1 (ఆంటిగ్వా) జూన్ 23: ఏ2 వర్సెస్ బి1 (బార్బడోస్) జూన్ 24: బి2 వర్సెస్ ఏ1 (సెయింట్ లూసియా) జూన్ 24: సి1 వర్సెస్ డి2 (సెయింట్ విన్సెంట్) జూన్ 26: సెమీఫైనల్-1 (గయానా) జూన్ 27: సెమీఫైనల్-2 (ట్రినిడాడ్) జూన్ 29: ఫైనల్ (బార్బడోస్) * సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేస్ ఉన్నాయి. -
అండర్ 19 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల
సౌతాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (డిసెంబర్ 11) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జనవరి 20న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. భ్లోంఫాంటీన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనంతరం భారత్.. జనవరి 25, 28 తేదీల్లో ఐర్లాండ్, యూఎస్ఏలతో తమ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 19న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు తలపడనున్నాయి. 16 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించడిన ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు ఉండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు.. గ్రూప్-సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా జట్లు.. గ్రూప్-డిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్ జట్లు పోటీపడనున్నాయి. కాగా, తొలుత ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ భావించింది. అయితే ఆ దేశ క్రికెట్ బోర్డులో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఐసీసీ వేదికను దక్షిణాఫ్రికాకు మార్చింది. -
వరల్డ్‌కప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. 4 మ్యాచ్‌లు మినహాయించి అన్ని ఆదివారాలే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్ ప్రారంభానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు టోర్నీ ఆరంభ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మెగా టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ అక్టోబర్ 8న జరుగుతుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత భారత్ అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో (న్యూఢిల్లీ) తమ రెండో మ్యాచ్ ఆడుతుంది. దీని తర్వాత టీమిండియా.. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. వరల్డ్‌కప్-2023 భారత్ ఆడే మిగతా మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ సేన అక్టోబర్ 19న పూణేలో బంగ్లాదేశ్‌తో.. అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో.. అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లండ్‌తో.. నవంబర్ 2న ముంబైలో శ్రీలంకతో.. నవంబర్ 5న కోల్‌కతాలో సౌతాఫ్రికాతో.. నవంబర్ 12న బెంగళూరులో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశలో భారత్ ఆడబోయే 9 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు ఆదివారం జరుగుతుండగా.. ఓ మ్యాచ్ (పాకిస్తాన్) శనివారం, ఓ మ్యాచ్ (ఆఫ్ఘనిస్తాన్) బుధవారం, రెండు మ్యాచ్‌లు (బంగ్లాదేశ్, శ్రీలంక) గురువారం జరుగనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రపంచకప్‌లో భారత్ ఆడే 5 లీగ్ మ్యాచ్‌లు ఆదివారం రోజు ఉండటంతో భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మ్యాచ్‌లను బాగా ఎంజాయ్ చేయవచ్చని భావిస్తున్నారు. వరల్డ్‌కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ -
WC 2023: అక్టోబర్ 14న భారత్ vs పాకిస్తాన్
ముంబై: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 9 మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేశారు. అహ్మదాబాద్‌లో నవరాత్రి ఉత్సవాలు... కోల్‌కతాలో కాళీ మాత పూజల కారణంగా తప్పనిసరిగా రెండు మ్యాచ్‌ల తేదీలలో మార్పులు చేయాల్సి వచ్చింది. దీని వల్ల ఇతర మార్పులు కూడా అవసరం కావడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరో ఏడు మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చింది. దీని ప్రకారం టోర్నమెంట్కే హైలైట్ మ్యాచ్ అయిన భారత్, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న జరగాల్సిన పోరును ఒకరోజు ముందుగా అక్టోబర్ 14న నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో కూడా అక్టోబర్ 12న జరగాల్సిన పాకిస్తాన్–శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10కి మారింది. అక్టోబర్ 10న ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డే అండ్ నైట్‌గా జరగాల్సిన మ్యాచ్‌ను డేగా నిర్వహిస్తారు. -
వరల్డ్ కప్‌లో టీమిండియా మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు.. పాక్ మ్యాచ్‌తో పాటు..!
వన్డే వరల్డ్‌కప్-2023 సవరించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 9) ప్రకటించింది. భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. అందరూ ఊహించిన విధంగానే అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ఓ రోజు ముందుకు (అక్టోబర్ 14) కదిలింది. ఈ మ్యాచ్‌తో పాటు టీమిండియా ఆడే మరో మ్యాచ్ తేదీలో కూడా మార్పు జరిగింది. బెంగళూరు వేదికగా నవంబర్ 11న నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ నవంబర్ 12వ తేదీకి మారింది. ఈ రెండు మార్పులతో పాటు మరో ఏడు మ్యాచ్‌ల తేదీల్లో కూడా మార్పులు జరిగాయి. అవేంటంటే.. ఢిల్లీ వేదికగా అక్టోబర్ 14న జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్ ఓ రోజు తర్వాత (అక్టోబర్ 15), అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరగాల్సిన పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10న, అక్టోబర్ 13న లక్నోలో జరగాల్సిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్ అక్టోబర్ 12న, చెన్నై వేదికగా న్యూజిలాండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య అక్టోబర్ 14న జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 13న, ధర్మశాల వేదికగా నవంబర్ 11న ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన డే అండ్ నైట్ మ్యాచ్ అదే రోజు (నవంబర్ 11) డే మ్యాచ్ (10:30)గా, ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య నవంబర్ 12 ఉదయం (10:30) పూణే వేదికగా జరగాల్సిన మ్యాచ్ నవంబర్ 11కు, ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నవంబర్ 12న జరగాల్సిన డే అండ్ నైట్ మ్యాచ్ నవంబర్ 11కు మారింది. కాగా, ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై) అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ) అక్టోబర్ 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్) అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే) అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల) అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో) నవంబర్ 2: ఇండియా వర్సెస్ శ్రీలంక (ముంబై) నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా) నవంబర్ 12: ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (బెంగళూరు) నాకౌట్ మ్యాచ్‌ల వివరాలు.. నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై) నవంబర్ 16: సెమీఫైనల్-2 (కోల్‌కతా) నవంబర్ 19: ఫైనల్ (అహ్మదాబాద్) హైదరాబాద్‌లో (ఉప్పల్ స్టేడియం) జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ అక్టోబర్ 10 (మంగళవారం): పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక -
వరల్డ్‌కప్ వేదికలపై వివాదం.. బీసీసీఐ వివరణ
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 48 మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో 45 లీగ్ దశలో.. మరో మూడు నాకౌట్ మ్యాచ్‌లు(రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్) ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌లకు పది వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ.. వార్మప్ మ్యాచ్‌లకు మరో రెండు మైదానాలను(త్రివేండం, గుహవాటి) ఎంపిక చేసింది. అయితే ఈ వరల్డ్‌కప్‌కు పలు స్టేడియాలకు మ్యాచ్‌లు కేటాయించకపోవడంపై ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు గుర్రుగా ఉన్నాయి. వరల్డ్‌కప్ వేదికల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేశారు. ఈసారి వరల్డ్‌కప్ వేదికల జాబితాలో నాగ్‌పూర్, మొహాలీ, జైపూర్ లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా మొహాలీ వేదికపై దుమారం నెలకొంది. 1996 నుంచి ప్రపంచకప్ మ్యాచులకు ఇది వేదికగా ఉంటూ వస్తోంది. దీంతో ఈ స్టేడియాన్ని ఎంపిక చేయకపోవడంపై పంజాబ్ క్రీడా మంత్రి గుర్మీత్ సింగ్ విమర్శించారు. రాజకీయ జోక్యం వల్లే మొహాలిని పక్కన పెట్టారని ఆరోపించారు. బీసీసీఐ వద్ద ఈ అంశం లేవనెత్తుతామని గుర్మీత్ సింగ్ ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికకు లబ్ధి చేసేందుకే మొహాలీకి చేయిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సైతం విమర్శించారు. ఈ విమర్శలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ''ప్రపంచ కప్ కోసం తొలిసారి పన్నెండు వేదికలను ఎంపిక చేశాం. ఇందులో చాలా వేదికలు గత ప్రపంచ కప్‌ల కోసం ఎంపిక కాలేదు. ఈ 12 వేదికల్లో తిరువనంతపురం, గువాహటి స్టేడియాల్లో వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతావన్నీ లీగ్‌లు, నాకౌట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. మరిన్ని వసతులను కల్పించడంతోనే వాటికి అవకాశం వచ్చింది. సౌత్ జోన్ నుంచి నాలుగు, సెంట్రల్ జోన్ నుంచి ఒకటి, వెస్ట్ జోన్ నుంచి రెండు, నార్త్ జోన్ నుంచి రెండు వేదికలను ఎంపిక చేశాం. అలాగే ఢిల్లీ, ధర్మశాలలోనూ మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌లను కేటాయించడంపై ఏ వేదికపైనా వివక్షత చూపలేదు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లను మొహాలీ వేదికగానే నిర్వహించాం. విరాట్ కోహ్లి వందో టెస్టు మ్యాచ్ కూడా మొహాలీలో జరిగింది. మొహాలీలోని మల్లాన్‌పుర్ స్టేడియం సిద్ధమవుతోంది. ఒకవేళ రెడీగా ఉండుంటే వరల్డ్ కప్ మ్యాచ్‌కు వేదికయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడున్న మైదానం ఐసీసీ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా లేదు. అందుకే ఈసారి అవకాశం రాలేదు. ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌లను కేటాయించాం. వరల్డ్ కప్ కోసం మైదానాల ఎంపికలో ఐసీసీ నిర్ణయమే కీలకం. తిరువనంతపురంలో తొలిసారి వార్మప్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. అందులోనూ ఎన్నోసార్లు చర్చల తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసారి చాలా స్టేడియాలు కొత్తగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి'' అని శుక్లా వెల్లడించారు. చదవండి: వరుసగా ఏడు ఓవర్లు బౌలింగ్.. పూర్తిగా కోలుకున్నట్లేనా! 2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్‌కప్ మనదేనా అంటూ జోస్యం! -
వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్ టైమింగ్స్, తదితర వివరాలు
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం విడుదల అయిన విషయం తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్ టైమింగ్స్ వివరాలు 10 వేదికల్లో 48 మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నీలో 42 డే అండ్ నైట్ మ్యాచ్‌లు, 6 డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 3 నాకౌట్ మ్యాచ్‌లు (2 సెమీఫైనల్స్, ఫైనల్) ఉన్నాయి. డే అండ్ నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు.. డే మ్యాచ్‌లు ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి. ఉదయం మొదలయ్యే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 7: బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ధర్మశాల) అక్టోబర్ 14: బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ (చెన్నై) అక్టోబర్ 21: క్వాలిఫయర్-1 వర్సెస్ క్వాలిఫయర్-2 (లక్నో) అక్టోబర్ 28: ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల) నవంబర్ 4: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ (బెంగళూరు) నవంబర్ 12: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే) -
World Cup: హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే.. పాకిస్తాన్‌వే రెండు మ్యాచ్‌లు
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్వి కావడం విశేషం. మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్వాలిఫయర్-1తో తలపడుతుంది. ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-1 అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్-1 అక్టోబర్ 12 (గురువారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-2 హైదరాబాద్‌లో పాకిస్తాన్ ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, జింబాబ్వే ప్రత్యర్ధులుగా ఉండే అవకాశం ఉంది. -
వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై) అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ) అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్) అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే) అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల) అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో) నవంబర్ 2: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-2 (ముంబై) నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా) నవంబర్ 11: ఇండియా వర్సెస్ క్వాలిఫయర్-1 (బెంగళూరు) నాకౌట్ మ్యాచ్‌ల వివరాలు.. నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై) నవంబర్ 16: సెమీఫైనల్-2 (కోల్‌కతా) నవంబర్ 19: ఫైనల్ (అహ్మదాబాద్) -
భారత్ తొలి ప్రత్యర్థి ఇంగ్లండ్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల జూన్ 24 నుంచి జూలై 23 వరకు ఇంగ్లండ్‌లో టోర్నీ లండన్: మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు జూన్ 24న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో ఆడనుంది. ఇంగ్లండ్‌లో జూన్ 24 నుంచి జూలై 23 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్‌తోపాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటాయి. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్ జూలై 18న, రెండో సెమీఫైనల్ జూలై 20న జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌ను జూలై 23న లార్డ్స్ మైదానంలో నిర్వహిస్తారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ప్రపంచకప్ షెడ్యూ ల్ను విడుదల చేశాం. ఇప్పటికే లార్డ్స్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి తొమ్మిది వేల టికెట్లు అమ్ముడుపోయాయి. కొలంబోలో క్వాలిఫయింగ్ టోర్నీ విజయవంతంగా ముగిసింది. ప్రధాన టోర్నీ కూడా సక్సెస్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ తెలిపారు. భారత మ్యాచ్‌ల షెడ్యూల్: జూన్ 24: ఇంగ్లండ్‌తో; జూన్ 29: వెస్టిండీస్‌తో; జూలై 2: పాకిస్తాన్‌తో; జూలై 5: శ్రీలంకతో; జూలై 8: దక్షిణాఫ్రికాతో; జూలై 12: ఆస్ట్రేలియాతో; జూలై 15: న్యూజిలాండ్‌తో. -
భారత్ తొలి పోరు పాకిస్థాన్‌తో
దుబాయ్: వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరగనున్న టి20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు 22 రోజుల పాటు చిట్టగాంగ్, ఢాకా, సెలైత్లలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. భారత్ తన తొలి మ్యాచ్ (మార్చి 21న)లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా వరుసగా మార్చి 23న వెస్టిండీస్‌తో... మార్చి 28న క్వాలిఫయర్-1తో... మార్చి 30న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. పురుషుల, మహిళల విభాగాల్లో మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి. జట్ల సంఖ్య 12 నుంచి 16కు పెరగడంతో పురుషుల ఫార్మాట్లో మార్పులు చేశారు. మొదట టి20 టీమ్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్-8 జట్లు నేరుగా ప్రధాన టోర్నీ అయిన సూపర్-10 దశకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ‘ఎ’లో శ్రీలంక, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్; గ్రూప్ ‘బి’లో భారత్, వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. అయితే ఇందులో పాల్గొనే మరో రెండు జట్ల కోసం ఓ క్వాలిఫయింగ్ టోర్నీతో పాటు తొలి రౌండ్ పోటీలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 15 నుంచి 30 వరకు యూఏఈలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి ఆరు జట్లు తొలి రౌండ్ పోటీలకు అర్హత సాధిస్తాయి. ఈ తొలి రౌండ్ పోటీల్లో పూల్ ‘ఎ’లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో పాటు మూడు క్వాలిఫయింగ్ జట్లు; పూల్ ‘బి’లో జింబాబ్వేతో పాటు మరో మూడు క్వాలిఫయింగ్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ రెండు గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-10కు అర్హత సాధిస్తాయి. ఈవెంట్ ప్రైజ్‌మనీ 30 లక్షల డాలర్లు. విజేతకు 11 లక్షల డాలర్లు... రన్నరప్‌కు 5 లక్షల 50 వేల డాలర్లు ఇవ్వనున్నారు.