వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం విడుదల అయిన విషయం తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్ టైమింగ్స్ వివరాలు
10 వేదికల్లో 48 మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నీలో 42 డే అండ్ నైట్ మ్యాచ్‌లు, 6 డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 3 నాకౌట్ మ్యాచ్‌లు (2 సెమీఫైనల్స్, ఫైనల్) ఉన్నాయి. డే అండ్ నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు.. డే మ్యాచ్‌లు ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి.
ఉదయం మొదలయ్యే మ్యాచ్‌ల వివరాలు..
- అక్టోబర్ 7: బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ధర్మశాల)
- అక్టోబర్ 14: బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ (చెన్నై)
- అక్టోబర్ 21: క్వాలిఫయర్-1 వర్సెస్ క్వాలిఫయర్-2 (లక్నో)
- అక్టోబర్ 28: ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల)
- నవంబర్ 4: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ (బెంగళూరు)
- నవంబర్ 12: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే)
Comments
Please login to add a commentAdd a comment