టీ20 వరల్డ్‌కప్‌ 2024 షెడ్యూల్‌ విడుదల.. జూన్‌ 9న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ | ICC Released T20 World Cup 2024 Schedule | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024 Schedule: టీ20 వరల్డ్‌కప్‌ 2024 షెడ్యూల్‌ విడుదల.. జూన్‌ 9న భారత్‌-పాక్‌ మ్యాచ్‌

Published Fri, Jan 5 2024 7:34 PM | Last Updated on Fri, Jan 5 2024 8:25 PM

ICC Released T20 World Cup 2024 Schedule - Sakshi

2024 టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికలుగా జరిగే ఈ మెగా టోర్నీ జూన్‌ 1న మొదలై 29వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లు విభజించబడి పోటీపడతాయి.

గ్రూప్‌-ఏలో భారత్‌, పాక్‌లతో పాటు ఐర్లాండ్‌, కెనడా, యూఎస్‌ఏ జట్లు ఉండగా..

గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలతో పాటు నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌ జట్లు..

గ్రూప్‌-సిలో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌, ఉగాండ, పపువా న్యూ గినియా..

గ్రూప్‌-డిలో సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో పాటు బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌ జట్లు ఉన్నాయి.

  • ఈ టోర్నీలో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు జూన్‌ 1 నుంచి 18 వరకు జరుగనుండగా..
  • సూపర్‌ 8 దశ మ్యాచ్‌లు జూన్‌ 19 నుంచి 24 వరకు జరుగుతాయి.
  • జూన్‌ 26, 27 తేదీల్లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లు (గయనా, ట్రినిడాడ్‌) జరుగనుండగా.. జూన్‌ 29న ఫైనల్‌ (బార్బడోస్‌) జరుగుతుంది. 
  • టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌.. జూన్‌ 1: యూఎస్‌ఏ వర్సెస్‌ కెనడా
  • మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతాయి. 

మెగా టోర్నీలో గ్రూప్‌ దశలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..

  • జూన్‌ 5: భారత్‌​ వర్సెస్‌ ఐర్లాండ్‌ (న్యూయార్క్‌)
  • జూన్‌ 9: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ (న్యూయార్క్‌)
  • జూన్‌ 12: భారత్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ (న్యూయార్క్‌)
  • జూన్‌ 15: భారత్‌ వర్సెస్‌ కెనడా (ఫ్లోరిడా)  

గ్రూప్‌ దశలో జరుగబోయే మొత్తం మ్యాచ్‌ల వివరాలు..

  1. జూన్‌ 1: యూఎస్‌ఏ వర్సెస్‌ కెనడా (డల్లాస్‌)
  2. జూన్‌ 2: నమీబియా వర్సెస్‌ ఒమన్‌ (బార్బడోస్‌)
  3. జూన్‌ 2: వెస్టిండీస్‌ వర్సెస్‌ పపువా న్యూ గినియా (గయానా)
  4. జూన్‌ 3: శ్రీలంక వర్సెస్‌ సౌతాఫ్రికా (న్యూయార్క్‌)
  5. జూన్‌ 3: ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ ఉగాండ (గయానా)
  6. జూన్‌ 4: నెదర్లాండ్స్‌ వర్సెస్‌ నేపాల్‌ (డల్లాస్‌)
  7. జూన్‌ 4: ఇంగ్లండ్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బార్బడోస్‌)
  8. జూన్‌ 5: భారత్‌​ వర్సెస్‌ ఐర్లాండ్‌ (న్యూయార్క్‌)
  9. జూన్‌ 5: ఆస్ట్రేలియా వర్సెస్‌ ఒమన్‌ (బార్బడోస్‌)
  10. జూన్‌ 5: పుపువా న్యూ గినియా వర్సెస్‌ ఉగాండ (గయానా)
  11. జూన్‌ 6: యూఎస్‌ఏ వర్సెస్‌ పాకిస్తాన్‌ (డల్లాస్‌)
  12. జూన్‌ 6: నమీబియా వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బార్బడోస్‌)
  13. జూన్‌ 7: శ్రీలంక వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (డల్లాస్‌)
  14. జూన్‌ 7: ఐర్లాండ్‌ వర్సెస్‌ కెనడా (న్యూయార్క్‌)
  15. జూన్‌ 7: న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఆప్ఘనిస్తాన్‌ (గయానా)
  16. జూన్‌ 8: నెదర్లాండ్స్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (న్యూయార్క్‌)
  17. జూన్‌ 8: ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (బార్బడోస్‌)
  18. జూన్‌ 8: వెస్టిండీస్‌ వర్సెస్‌ ఉగాండ (గయానా)
  19. జూన్‌ 9: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ (న్యూయార్క్‌)
  20. జూన్‌ 9: ఒమన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ (ఆంటిగ్వా)
  21. జూన్‌ 10: సౌతాఫ్రికా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (న్యూయార్క్‌)
  22. జూన్‌ 11: శ్రీలంక​ వర్సెస్‌ నేపాల్‌ (లాడర్‌హిల్‌)
  23. జూన్‌ 11: పాకిస్తాన్‌ వర్సెస్‌ కెనడా (న్యూయార్క్‌)
  24. జూన్‌ 11: ఆస్ట్రేలియా వర్సెస్‌ నమీబియా (ఆంటిగ్వా)
  25. జూన్‌ 12: వెస్టిండీస్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ (ట్రినిడాడ్‌)
  26. జూన్‌ 12: భారత్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ (న్యూయార్క్‌)
  27. జూన్‌ 13: ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఒమన్‌ (ఆంటిగ్వా)
  28. జూన్‌ 13: ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ పపువా న్యూ గినియా (ట్రినిడాడ్‌)
  29. జూన్‌ 13: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌ (సెయింట్‌ విన్సెంట్‌)
  30. జూన్‌ 14: యూఎస్‌ఏ వర్సెస్‌ ఐర్లాండ్‌ (లాడర్‌హిల్‌)
  31. జూన్‌ 14: న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఉగాండ (ట్రినిడాడ్‌)
  32. జూన్‌ 14: సౌతాఫ్రికా వర్సెస్‌ నేపాల్‌ (సెయింట్‌ విన్సెంట్‌)
  33. జూన్‌ 15: భారత్‌ వర్సెస్‌ కెనడా (ఫ్లోరిడా)  
  34. జూన్‌ 15: నమీబియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (ఆంటిగ్వా)
  35. జూన్‌ 15: ఆస్ట్రేలియా వర్సెస్‌ స్కాట్లాండ్‌ (సెయింట్‌ లూసియా)
  36. జూన్‌ 16: పాకిస్తాన్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌ (లాడర్‌హిల్‌)
  37. జూన్‌ 16: శ్రీలంక వర్సెస్‌ నెదర్లాండ్స్‌ (సెయింట్‌ లూసియా)
  38. జూన్‌ 16: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ నేపాల్‌ (సెయింట్‌ విన్సెంట్‌)
  39. జూన్‌ 17: న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ (ట్రినిడాడ్‌)
  40. జూన్‌ 17: వెస్టిండీస్‌ వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్‌ (సెయింట్‌ లూసియా)

సూపర్‌ 8 మ్యాచ్‌లు..

  1. జూన్‌ 19: ఏ2 వర్సెస్‌ డి1 (ఆంటిగ్వా)
  2. జూన్‌ 19: బి1 వర్సెస్‌ సి2 (సెయింట్‌ లూసియా)
  3. జూన్‌ 20: బి2 వర్సెస్‌ డి2 (ఆంటిగ్వా)
  4. జూన్‌ 20: ఏ1 వర్సెస్‌ సి1 (బార్బడోస్‌)
  5. జూన్‌ 21: ఏ2 వర్సెస్‌ సి2 (బార్బడోస్‌)
  6. జూన్‌ 21: బి1 వర్సెస్‌ డి1 (సెయింట్‌ లూసియా)
  7. జూన్‌ 22: ఏ1 వర్సెస్‌ డి2 (ఆంటిగ్వా)
  8. జూన్‌ 22: సి1 వర్సెస్‌ బి2 (సెయింట్‌ విన్సెంట్‌)
  9. జూన్‌ 23: సి2 వర్సెస్‌ డి1 (ఆంటిగ్వా)
  10. జూన్‌ 23: ఏ2 వర్సెస్‌ బి1 (బార్బడోస్‌)
  11. జూన్‌ 24: బి2 వర్సెస్‌ ఏ1 (సెయింట్‌ లూసియా)
  12. జూన్‌ 24: సి1 వర్సెస్‌ డి2 (సెయింట్‌ విన్సెంట్‌)

జూన్‌ 26: సెమీఫైనల్‌-1 (గయానా)

జూన్‌ 27: సెమీఫైనల్‌-2 (ట్రినిడాడ్‌)

జూన్‌ 29: ఫైనల్‌ (బార్బడోస్‌)

* సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డేస్‌ ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement