వన్డే వరల్డ్‌కప్-2023 సవరించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 9) ప్రకటించింది. భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. అందరూ ఊహించిన విధంగానే అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ఓ రోజు ముందుకు (అక్టోబర్ 14) కదిలింది. ఈ మ్యాచ్‌తో పాటు టీమిండియా ఆడే మరో మ్యాచ్ తేదీలో కూడా మార్పు జరిగింది. బెంగళూరు వేదికగా నవంబర్ 11న నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ నవంబర్ 12వ తేదీకి మారింది. ఈ రెండు మార్పులతో పాటు మరో ఏడు మ్యాచ్‌ల తేదీల్లో కూడా మార్పులు జరిగాయి.
అవేంటంటే..
- ఢిల్లీ వేదికగా అక్టోబర్ 14న జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్ ఓ రోజు తర్వాత (అక్టోబర్ 15),
- అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరగాల్సిన పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10న,
- అక్టోబర్ 13న లక్నోలో జరగాల్సిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్ అక్టోబర్ 12న,
- చెన్నై వేదికగా న్యూజిలాండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య అక్టోబర్ 14న జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 13న,
- ధర్మశాల వేదికగా నవంబర్ 11న ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన డే అండ్ నైట్ మ్యాచ్ అదే రోజు (నవంబర్ 11) డే మ్యాచ్ (10:30)గా,
- ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య నవంబర్ 12 ఉదయం (10:30) పూణే వేదికగా జరగాల్సిన మ్యాచ్ నవంబర్ 11కు,
- ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నవంబర్ 12న జరగాల్సిన డే అండ్ నైట్ మ్యాచ్ నవంబర్ 11కు మారింది.
కాగా, ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..
అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై)
అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ)
అక్టోబర్ 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే)
అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్ 2: ఇండియా వర్సెస్ శ్రీలంక (ముంబై)
నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్ 12: ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (బెంగళూరు)
నాకౌట్ మ్యాచ్‌ల వివరాలు..
నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై)
నవంబర్ 16: సెమీఫైనల్-2 (కోల్‌కతా)
నవంబర్ 19: ఫైనల్ (అహ్మదాబాద్)
హైదరాబాద్‌లో (ఉప్పల్ స్టేడియం) జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు..
అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్
అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్
అక్టోబర్ 10 (మంగళవారం): పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక
Comments
Please login to add a commentAdd a comment