భారత్ తొలి పోరు పాకిస్థాన్‌తో | Team India to play first match with pakistan in T20 World cup | Sakshi
Sakshi News home page

భారత్ తొలి పోరు పాకిస్థాన్‌తో

Published Mon, Oct 28 2013 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

భారత్ తొలి పోరు పాకిస్థాన్‌తో

భారత్ తొలి పోరు పాకిస్థాన్‌తో

దుబాయ్: వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరగనున్న టి20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు 22 రోజుల పాటు చిట్టగాంగ్, ఢాకా, సెలైత్‌లలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. భారత్ తన తొలి మ్యాచ్ (మార్చి 21న)లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా వరుసగా మార్చి 23న వెస్టిండీస్‌తో... మార్చి 28న క్వాలిఫయర్-1తో... మార్చి 30న ఆస్ట్రేలియాతో ఆడుతుంది.
 
 పురుషుల, మహిళల విభాగాల్లో మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి. జట్ల సంఖ్య 12 నుంచి 16కు పెరగడంతో పురుషుల ఫార్మాట్‌లో మార్పులు చేశారు. మొదట టి20 టీమ్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్-8 జట్లు నేరుగా ప్రధాన టోర్నీ అయిన సూపర్-10 దశకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ‘ఎ’లో శ్రీలంక, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్; గ్రూప్ ‘బి’లో భారత్, వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. అయితే ఇందులో పాల్గొనే మరో రెండు జట్ల కోసం ఓ క్వాలిఫయింగ్ టోర్నీతో పాటు తొలి రౌండ్ పోటీలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 15 నుంచి 30 వరకు యూఏఈలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి ఆరు జట్లు తొలి రౌండ్ పోటీలకు అర్హత సాధిస్తాయి.
 
 ఈ తొలి రౌండ్ పోటీల్లో పూల్ ‘ఎ’లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో పాటు మూడు క్వాలిఫయింగ్ జట్లు; పూల్ ‘బి’లో జింబాబ్వేతో పాటు మరో మూడు క్వాలిఫయింగ్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ రెండు గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-10కు అర్హత సాధిస్తాయి. ఈవెంట్ ప్రైజ్‌మనీ 30 లక్షల డాలర్లు. విజేతకు 11 లక్షల డాలర్లు... రన్నరప్‌కు 5 లక్షల 50 వేల డాలర్లు ఇవ్వనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement