ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్ ప్రారంభానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు టోర్నీ ఆరంభ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
మెగా టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ అక్టోబర్ 8న జరుగుతుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత భారత్ అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో (న్యూఢిల్లీ) తమ రెండో మ్యాచ్ ఆడుతుంది. దీని తర్వాత టీమిండియా.. అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
వరల్డ్‌కప్-2023 భారత్ ఆడే మిగతా మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ సేన అక్టోబర్ 19న పూణేలో బంగ్లాదేశ్‌తో.. అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో.. అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లండ్‌తో.. నవంబర్ 2న ముంబైలో శ్రీలంకతో.. నవంబర్ 5న కోల్‌కతాలో సౌతాఫ్రికాతో.. నవంబర్ 12న బెంగళూరులో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది.
లీగ్ దశలో భారత్ ఆడబోయే 9 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు ఆదివారం జరుగుతుండగా.. ఓ మ్యాచ్ (పాకిస్తాన్) శనివారం, ఓ మ్యాచ్ (ఆఫ్ఘనిస్తాన్) బుధవారం, రెండు మ్యాచ్‌లు (బంగ్లాదేశ్, శ్రీలంక) గురువారం జరుగనున్నాయి. భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రపంచకప్‌లో భారత్ ఆడే 5 లీగ్ మ్యాచ్‌లు ఆదివారం రోజు ఉండటంతో భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మ్యాచ్‌లను బాగా ఎంజాయ్ చేయవచ్చని భావిస్తున్నారు.
వరల్డ్‌కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment