ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగోసారి వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్‌మన్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది.
అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ను డారిల్ మిచెల్ (134), విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) గెలిపించేందుకు ప్రయత్నించారు. ఓ దశలో వీరు ముగ్గురు టీమిండియాను భయపెట్టారు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో చేయాల్సిన ప్రయత్నం చేసి చేతులెత్తేశారు. మిచెల్, విలియమ్సన్, ఫిలిప్స్ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారీ ఛేదనలో న్యూజిలాండ్ ఆటగాళ్లు శక్తివంచన లేకుండా ప్రతిఘటించారు. డారిల్ మిచెల్, విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓ దశలో వారు మాకు చాలా అవకాశాలు ఇచ్చారు. మేము వాటిని ఒడిసిపట్టుకోవడంలో విఫలమయ్యాం. మాపై ఒత్తిడి ఉండింది. అయినా ప్రశాంతంగా ఉండగలిగాం.
బౌలింగ్ విషయానికొస్తే.. మా బౌలర్లందరూ చేయాల్సి ప్రతి ప్రయత్నం చేశారు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి సక్సెస్ సాధించాడు. మా టాపార్డర్ బ్యాటింగ్ అద్భుతం. అయ్యర్ సూపర్ టచ్‌లో ఉన్నాడు. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గిల్, రాహుల్ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. కోహ్లీ ఎప్పటిలాగే అద్భుతంగా ఆడాడు. తన ట్రేడ్‌మార్క్ ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా మా బ్యాటింగ్ సంతృప్తినిచ్చింది. మొదటి తొమ్మిది మ్యాచ్‌ల్లో (లీగ్ దశ) ఏం చేశామో ఈ మ్యాచ్‌లోనూ అదే చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ఫలితం సాధించాం.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment