వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాంఖడే పిచ్ తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలించనుండటంతో టాస్ గెలిచిన రోహిత్ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
India in the World Cup Semi Finals:
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023
2011 - India batted first, won the game.
2015 - India batted second, lost the game.
2019 - India batted second, lost the game.
2023 - India batting first. pic.twitter.com/hbqPkkRgSc
కాగా, వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో టీమిండియా గత రికార్డును పరిశీలిస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గత మూడు ఎడిషన్లలో తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. 2011 ఎడిషన్ సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ సెమీస్ గండాన్ని అధిగమించడంతో పాటు ఫైనల్‌కు చేరి ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయింది.
ఆతర్వాత వరుసగా రెండు ఎడిషన్ల (2015, 2019 సెమీస్‌లో రెండో బ్యాటింగ్ చేసిన భారత్ ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుత వరల్డ్‌కప్ సెమీస్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తుండటాన్ని భారత అభిమానులు శుభపరిణామంగా పరిగణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలుస్తుందంటూ చరిత్రను సాక్షిగా చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment