
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు బ్యాట్‌ను ఝూలిపించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 246 పరుగుల భారీ లక్ష్య చేధనలో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఉప్పల్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, జాన్సెన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను శర్మ ఊతికారేశాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని అందుకున్నాడు.
ఓవరాల్‌గా కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 246 పరుగుల భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.
సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 66) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, చాహల్ తలా వికెట్ సాధించారు. కాగా ఐపీఎల్ చరిత్రలో రెండువ అత్యధిక స్కోర్ ఛేజ్ చేసిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది.