నటితో ధోని సెల్ఫీ ఫోటో హల్‌చల్
నటితో ధోని సెల్ఫీ ఫోటో హల్‌చల్
Published Mon, Nov 21 2016 10:58 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM
పై ఫోటోలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్.ధోనితో నటి ఆండ్రియాను చూస్తుంటే మీకేమనిపిస్తోంది.ధోని ఆండ్రియాకు బాయ్‌ఫ్రెండ్ అయ్యారా?అనిపిస్తోందా?ఇంతకు ముందు నటి రాయ్‌లక్ష్మీని ధోనితో కలిపి మీడియాలో చాలా ప్రచారాలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ధోని,ఆండ్రియాలను అలా ఊహించుకునే అవకాశం లేక పోలేదు.ఎందుకంటే నటి ఆండ్రియాకు సంచలన నటి అనే పేరుంది.ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుద్‌తో ఉన్న సన్నిహిత ఫోటోలు చాలా కలకలాన్నే సృష్టించాయన్న విషయం తెలిసిందే.అయితే ధోని,ఆండ్రియాల మధ్య అలాంటి సంబంధాలను ఊహించకండి.ఇది ఒక క్రేజీ సెల్పీ ఫోటోనే.సాధారణంగా సినీ తారలకు అభిమానులు అధిక సంఖ్యలో ఉంటుంటారు.వారంతా తమ అభిమాన తారలను కలిసి ఫోటోలు తీసుకోవాలని ఆశపడుతుంటారు.
అయితే సినీ తారలకు అభిమానులుంటారు.వారికీ తమ అభిమానులు తారస పడితే వారితో ఫోటో తీసుకోవాలని కోరుకుంటారు.అలా తన అభిమాన క్రీడాకారుడు ధోని తాను ప్రయాణిస్తున్న ఫై్లట్‌నే ఎదురైతే ఆండ్రియా ఊరుకుంటారా? వెంటనే ఒక సెల్ఫీ ఫోటోకు తన ఫోన్ కెమెరాకు పని చెప్పరూ అలాంటి సెల్ఫీ పోటోనే అది.ధోనితో తాను దిగిన ఫోలోను నటి ఆండ్రియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అదిప్పుడు హల్‌చల్ చేస్తోంది.ఇక పోతే నటి ఆండ్రియా ప్రస్తుతం తరమణి చిత్రంతో పాటు,ధనుష్‌తో వడచెన్నై చిత్రంలో నటిస్తున్నారు.
Advertisement
Advertisement