శ్రేయస్ అయ్యర్, ధోని
ముంబై: వార్తా పత్రికలు చదవొద్దని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సలహాలిచ్చాడని యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఓ టీవీ షో ఫైనల్ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యర్ మాట్లాడుతూ.. ‘భారత జట్టులో చేరిన తర్వాత వార్తా పత్రికలు చదవడం మానెయ్యాలని, సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ధోని సలహా ఇచ్చాడు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ భాగమైన సోషల్ మీడియాకు దూరంగా ఉండటం కష్టమే. కానీ వాటి విషయంలో జాగ్రత్తపడుతున్నా’ అని చెప్పుకొచ్చాడు.
ఇక తనకు ముందు నుంచి తెలిసిన ఓ అమ్మాయి ఐపీఎల్ వేలంలో తర్వాత తనకు దగ్గరవ్వాలని ప్రయత్నించిందని అయ్యర్ తెలిపాడు. అంతకు ముందెప్పుడూ తన గురించి పట్టించుకోలేదని. వేలం జరిగిన వెంటనే మెసేజ్ చేసిందన్నాడు. తొలుత తన ఎంపిక పట్ల సంతోషంగా ఉందని భావించానని కానీ తర్వాత ఆమె మాట్లాడడానికి బాగా ప్రయత్నించిందని తెలిపాడు. దీంతో ఆమె డబ్బు చూసి దగ్గరవ్వాలని ప్రయత్నించినట్లు తనకు అర్థమైందని పేర్కొన్నాడు. ఇక అయ్యర్ ఈ సీజన్ ఐపీఎల్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రాతినిథ్యం వహించిన ఈ 23 ఏళ్ల ఆటగాడు.. 14 ఇన్నింగ్స్‌లో 411 పరుగులు చేశాడు. అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి గంభీర్ తప్పుకుంటే.. సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment