క్రికెట్.. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. క్రికెటర్లను ఆరాధ్య దైవంగా భావించే వీరాభిమానులు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. మన క్రికెటర్లకు కేవలం ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ క్రేజ్ ఉంది. విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. మరి క్రికెట్ అంటేనే కాసుల వర్షం అంటుంటారు. వివిధ కంపెనీలు సైతం క్రికెట్ ఈవెంట్లకు స్పాన్సర్ చేస్తూ తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంటాయి.
ఇక వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్లతో ఎండార్స్ చేయించడానికి కంపెనీలు ఆసక్తి చూపడం సహజం. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ సారథి విరాట్ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వారికి డిమాండ్ ఎక్కువే. వార్షిక జీతాలు, ఐపీఎల్ వంటి లీగ్‌లలో ఆడటంతో పాటు ఇలా అదనంగా ఆదాయం గడించే క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. ఐపీఎల్-2022 సీజన్ సమీపిస్తున్న తరుణంలో 10 జట్ల కెప్టెన్ల ‘సంపాదన’కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం!
మయాంక్ అగర్వాల్
కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌ను వీడటంతో ఈసారి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్. రిటెన్షన్‌లో భాగంగా పంజాబ్ అతడికి 12 కోట్లు చెల్లించింది. ఇక ప్రమోషన్ల విషయానికొస్తే సియట్ కంపెనీతో అతడికి ఒప్పందం ఉంది.
అంతేకాదు స్పోర్ట్స్ న్యూట్రీషియన్ బ్రాండ్ ఫాస్ట్ అండ్ అప్‌నకు మయాంక్ బ్రాండ్ అంబాసిడర్. అదే విధంగా బీసీసీఐ కాంట్రాక్ట్‌లో అతడు సీ గ్రేడ్‌లో ఉన్నాడు. తద్వారా ఏడాదికి కోటి జీతం పొందుతున్నాడు. ఈ క్రమంలో అతడి సంపాదన 26 కోట్లుగా ఉన్నట్లు స్పోర్టింగ్‌క్రేజ్ అంచనా వేసింది.
రిషభ్ పంత్
గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు చేపట్టాడు టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్. ఈ యువ కెరటానికి యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో పలు కంపెనీలు అతడిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాయి. డిష్ టీవీ, కాడ్‌బరీ ఫ్యూజ్, నాయిస్, బూస్ట్, జేఎస్‌డబ్ల్యూ తదితర బ్రాండ్లను అతడు ప్రమోట్ చేస్తున్నాడు.
అంతేకాదు పంత్ ప్రాజెక్ట్ పేరిట ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ను స్థాపించాడు కూడా. భారత జట్టులో కీలక ప్లేయర్ అయిన పంత్‌కు బీసీసీఐ ఏటా 5 కోట్లు చెల్లిస్తోంది. మరి పంత్ నికర సంపాదన ఎంతంటే.. 36 కోట్లు అని స్పోర్ట్స్‌అన్‌ఫోల్డ్ అంటోంది.
హార్దిక్ పాండ్యా
ఒకప్పుడు టీమిండియాలో కీలక సభ్యుడైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. అంతేకాదు ఐపీఎల్ విజయవంతమైన జట్టు, అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్‌లోనూ కీలక ఆటగాడు. అయితే, గత కొంతకాలంగా అతడు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్‌లోనూ బంతితో రాణించకపోవడంతో ముంబై వదిలేసింది.
ఈ క్రమంలో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ హార్దిక్‌ను తమ కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. ఇందుకోసం 15 కోట్లు ఖర్చు చేసింది. ఇక బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా హార్దిక్ ఏడాదికి కోటి సంపాదిస్తున్నాడు. డ్రీమ్ 11, మాన్‌స్టర్ ఎనర్జీ డ్రింక్, ఒప్పో మొబైల్స్, హలా ప్లే, గల్ఫ్ ఆయిల్ ఆఫ్ ఇండియా తదితర బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా నికర సంపాదన 37 కోట్లుగా ఫస్ట్‌స్పోర్ట్స్ అంచనా వేసింది.
సంజూ శాంసన్
రాజస్తాన్ రాయల్స్‌లో కీలక సభ్యుడిగా ఎదిగిన సంజూ శాంసన్.. ఆ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. మెగా వేలం-2022 నేపథ్యంలో అతడిని రిటైన్ చేసుకునేందుకు ఫ్రాంఛైజీ 14 కోట్లు చెల్లించింది. ఇక గతంలో ఎంఆర్‌ఎఫ్ కూకాబురా, ఎస్‌ఎస్ వంటి బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న సంజూ ప్రస్తుతం ఎస్‌జీతో ఒప్పందం కలిగి ఉన్నాడు. అంతేగాక హీల్ అనే వెల్‌నెస్ బ్రాండ్‌కు అంబాసిడర్ కూడా. మరి ఖేల్ తక్ వివరాల ప్రకారం సంజూ నికర సంపాదన 52 కోట్లు.
శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ మెగా వేలం-2022లో టీమిండియా స్టార్ బ్యాటర్ 12.25 కోట్లకు అమ్ముడుపోయాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ ధర చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. ఇక బీసీసీఐ కాంట్రాక్ట్‌లో బీ గ్రేడ్‌లో ఉన్న శ్రేయస్‌కు ఏడాదికి 3 కోట్ల జీతం వస్తుంది. జిల్లెట్, బోట్, ఫ్రెస్కా జ్యూసెస్, మైప్రొటిన్, గూగుల్ పిక్సెల్, మన్యావర్, డ్రీమ్ 11, సియట్ వంటి బ్రాండ్లను శ్రేయస్ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రేయస్ నికర సంపాదనను 53 కోట్లుగా ఇండియా ఫాంటసీ అంచనా వేసింది.
కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈక్రమంలో మెగా వేలం -2022 నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ అతడిని 14 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఇక పవరేడ్, రాకిట్, ఏసిక్స్, సీగ్రామ్ రాయల్‌స్టాగ్ వంటి బ్రాండ్లకు ఎండార్స్ చేస్తున్న విలియమ్సన్‌కుగ్రే నికోల్స్ కంపెనీతో డీల్ ఉంది. ఇక న్యూజిలాండ్ క్రికెట్ అతడికి ఏడాదికి 27 లక్షల జీతం చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో కేన్ మామ 58 కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడని స్పోర్ట్స్‌అన్‌ఫోల్డ్ తెలిపింది.
కేఎల్ రాహుల్
టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్. గతంలో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన రాహుల్‌ను కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌జెయింట్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా 17 కోట్లు ఖర్చు చేసింది.
ఇక నూమీ పారిస్, పూమా, రియల్ మీ, గేమ్సీ, బోట్ వంటి కంపెనీలతో రాహుల్‌కు ఒప్పందం ఉంది. బీసీసీఐ కాంట్రాక్ట్‌లో భాగంగా ఏడాదికి 5 కోట్ల రూపాయల జీతం పొందుతున్నాడు. ఈ క్రమంలో సీఏనాలెడ్జ్ అతడి సంపాదన 75 కోట్లుగా అంచనా వేసింది.
ఫాఫ్ డుప్లెసిస్
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. ఈ క్రమంలో మెగా వేలంలో ఆర్సీబీ అతడిని 7 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్‌గా నియమించుకుంది కూడా. ఇక సౌతాఫ్రికా బోర్డు నుంచి ఏడాదికి 3 కోట్ల మేర జీతం పొందుతున్న ఫాఫ్.. పలు బ్రాండ్లకు ఎండార్స్ చేస్తున్నాడు. ఐపీఎల్‌తో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడు 102 కోట్ల సంపాదన కలిగి ఉన్నట్లు ఫస్ట్‌స్పోర్ట్స్' అంచనా వేసింది. ఐపీఎల్‌లో మూడో సంపన్న క్రికెటర్‌గా పేర్కొంది.
రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో విజయవంతమైన సారథిగా గుర్తింపు పొందాడు. ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. ఇక బీసీసీఐ ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న రోహిత్‌కు ఏడాదికి 7 కోట్ల జీతం.
పలు బ్రాండ్లను అతడు ప్రమోట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడి నికర సంపాదన రమారమి 180 కోట్లుగా ఉన్నట్లు సీఏనాలెడ్జ్ అంచనా వేసింది.
మహేంద్ర సింగ్ ధోని
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని రిటైర్ అయినా అతడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడంలో అతిశయోక్తి లేదు.
జియో, అన్‌అకాడమీ, భారత్ మాట్రిమొని, వింజో, కార్స్ 24, గో డాడీ వంటి కంపెనీలతో ఒప్పందం కలిగి ఉన్న ధోని సంపాదన ఇంచుమించు 819 కోట్లు అని వియాన్ అంచనా వేసింది.
నోట్: ఇవన్నీ కేవలం అంచనాలతో కూడిన వివరాలు మాత్రమే!
చదవండి: IPL 2022 Female Anchors: ఐపీఎల్‌లో అందాల యాంకర్ రీ ఎంట్రీ.. టాప్-5లో ఉన్నది వీళ్లే!
Comments
Please login to add a commentAdd a comment