దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తర్వాతి మ్యాచ్‌ల్లో తన జోరును కొనసాగించలేకపోతున్నాడు. వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించి చరిత్రకెక్కిన శాంసన్.. ఇప్పుడు అదే వరుస మ్యాచ్‌ల్లో డకౌటై తీవ్ర నిరాశపరిచాడు.
ఏదైమైనప్పటకి బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై వరుసగా సెంచరీలు సాధించిన సంజూ భారత టీ20 జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడనే చెప్పుకోవాలి. 2015లో టీమిండియా తరపున టీ20 అరంగేట్రం చేసిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఎక్కువ సందర్భాల్లో జట్టు బయటే ఉన్నాడు.
కొన్ని సార్లు జట్టులోకి వచ్చినప్పటికి తన పేలవ ప్రదర్శనతో నిరాశపరిచేవాడు. దీంతో అతడిని సెలక్టర్లు పక్కన పెట్టేవారు. అయితే ఇటీవల కాలంలో సీనియర్ ఆటగాళ్లు బీజీ షెడ్యూల్ కారణంగా సంజూకు టీ20 జట్టులో రెగ్యూలర్‌గా చోటు దక్కుతుంది.
ఈసారి మాత్రం సంజూ తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. దీంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. కానీ సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అవకాశాలు ఇవ్వకుండా తన కొడుకు 10 ఏళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించాడు.
ఆ నలుగురే!
"ముగ్గురు-నలుగురు వ్యక్తులు నా కొడుకు 10 ఏళ్ల కెరీర్‌ను నాశనం చేశారు. విరాట్ కోహ్లి, ధోని, రోహిత్ శర్మ వంటి కెప్టెన్‌లు సంజూ శాంసన్‌కు సరైన అవకాశాలు ఇవ్వలేదు. వారితో కూడా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా సంజూవైపు పెద్దగా మొగ్గు చూపలేదు.
ఈ నలుగురు అతడి కెరీర్‌ను నాశనం చేయడంతో పాటు అతడిని తీవ్రంగా బాధపెట్టారు. కానీ సంజూ మాత్రం వాటన్నంటిని బలంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాడు"అని మలయాళం అవుట్‌లెట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వనాథ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment