జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, డుప్లెసిస్, హార్దిక పాండ్యా, సంజూ శాంసన్(PC: IPL)
IPL 2022: ఐపీఎల్-2022 ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే లీగ్ దశ ముగియగా.. మే 24న తొలి క్వాలిఫైయర్-1 జరుగనుంది. ఆ తర్వాతి రోజు ఎలిమినేటర్ మ్యాచ్, మరుసటి రోజు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇక ఫైనల్ మే 29న జరుగననున్న విషయం తెలిసిందే.
తుది పోరుకు అర్హత సాధించేందుకు గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్‌జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ సీజన్ లీగ్ దశలో తమ జట్ల తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
ఐపీఎల్-2022 లీగ్ దశలో 10 జట్ల తరఫున అత్యధిక పరుగుల వీరులు
1. జోస్ బట్లర్- రాజస్తాన్ రాయల్స్- 629 పరుగులు- అత్యధిక స్కోరు 116
2. కేఎల్ రాహుల్(కెప్టెన్)- లక్నో సూపర్‌జెయింట్స్- 537 పరుగులు- అత్యధిక స్కోరు 103 నాటౌట్
3. శిఖర్ ధావన్- పంజాబ్ కింగ్స్- 460 పరుగులు- అత్యధిక స్కోరు 88 నాటౌట్
4. ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్)- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 443 పరుగులు- అత్యధిక స్కోరు- 96
5. డేవిడ్ వార్నర్- ఢిల్లీ క్యాపిటల్స్- 432 పరుగులు- అత్యధిక స్కోరు 92 నాటౌట్
6. అభిషేక్ శర్మ- సన్‌రైజర్స్ హైదరాబాద్- 426 పరుగులు- అత్యధిక స్కోరు 75
7. ఇషాన్ కిషన్- ముంబై ఇండియన్స్- 418 పరుగులు- అత్యధిక స్కోరు 81 నాటౌట్
8. హార్దిక్ పాండ్యా(కెప్టెన్)- గుజరాత్ టైటాన్స్- 413 పరుగులు- అత్యధిక స్కోరు 87 నాటౌట్
9. శ్రేయస్ అయ్యర్(కెప్టెన్)- కోల్‌కతా నైట్‌రైడర్స్- 401 పరుగులు- అత్యధిక స్కోరు- 85
10. రుతురాజ్ గైక్వాడ్- చెన్నై సూపర్‌కింగ్స్- 368 పరుగులు- అత్యధిక స్కోరు 99
ఐపీఎల్-2022 లీగ్ దశలో టాప్-5లో ఉన్న బ్యాటర్లు
1. జోస్ బట్లర్- రాజస్తాన్ రాయల్స్- 629 పరుగులు- అత్యధిక స్కోరు 116
2. కేఎల్ రాహుల్(కెప్టెన్)- లక్నో సూపర్‌జెయింట్స్- 537 పరుగులు- అత్యధిక స్కోరు 103 నాటౌట్
3. క్వింటన్ డికాక్- లక్నో సూపర్‌జెయింట్స్- 502 పరుగులు- అత్యధిక స్కోరు 140 నాటౌట్
4.3. శిఖర్ ధావన్- పంజాబ్ కింగ్స్- 460 పరుగులు- అత్యధిక స్కోరు 88 నాటౌట్
5. ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్)- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 443 పరుగులు- అత్యధిక స్కోరు- 96
చదవండి👉🏾Kusal Mendis: మ్యాచ్ జరుగుతుండగానే ఛాతి నొప్పి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
చదవండి👉🏾Ind Vs SA: వాళ్లందరికీ అవకాశం.. మీరు పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ బ్యాటర్
Comments
Please login to add a commentAdd a comment