చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో ఆధిపత్యం కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే ఇరుజట్లు ప్లేఆప్‌కు చేరుకోగా పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానం కోసం పోటీపడుతున్నాయి. బుధవారం స్థానిక చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. చిదంబరం స్టేడియం పిచ్ తొలుత బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్‌కే మొగ్గు చూపాడు.
జ్వరం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన ధోని.. ఢిల్లీ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ధోనితో పాటు డుప్లెసిస్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి చేరగా మురళీ విజయ్, సాంట్నర్, ధృవ్ షోరేలకు ఉద్వాసన పలికింది. ఇక రబడ, ఇషాంత్‌లు స్వల్ప గాయాలతో బాధ పడుతుండటంతో ఢిల్లీ మేనేజ్‌మెంట్ వారికి విశ్రాంతినిచ్చింది. దీంతో వారి స్థానాలలో ట్రెంట్ బౌల్ట్, సుచిత్‌లకు అవకాశం కల్పించింది.
తుదిజట్లు
సీఎస్‌కే: ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, డుప్లెసిస్, రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రేవో, ఇమ్రాన్ తాహీర్, దీపక్ చహార్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా
ఢిల్లీ: శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, కోలిన్ ఇంగ్రామ్, రూథర్‌ఫర్డ్, అక్షర్ పటేల్, జగదీష్ సుచిత్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రా, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment