దళితులకు సీఎం క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
నాయుడుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘‘ఎస్సీ ల్లో ఎవరు పుట్టాలనుకుంటారు’’అని మాట్లాడడం దళితులను కించపరిచినట్లేనని, అందుకు క్షమాపణ చెప్పాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాల ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.దళితులపట్లవ్యంగ్యంగామాట్లాడటంమనోభావాలనుదెబ్బతీసినట్లేనన్నారు. ఎస్సీల్లో చిచ్చుపెట్టిన చంద్రబాబు ప్రస్తుతం బీసీ కులాల్లో చిచ్చును రగిల్చారన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. ఎన్నికల ముందు పెద్దమాదిగనవుతా.., చెప్పులు కుడతానంటూ దళిత వేషం కట్టిన చంద్రబాబు కుల రాజకీయాలతో గద్దెనెక్కలేరని విమర్శించడం హాస్యాస్పదమన్నారు.
మాలమాదిగల కులంలో పుట్టడం మాకెంతో గర్వంగా ఉందని, అదే కులంలా మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. ఎస్సీలకు క్షమాపణ చెప్పకుంటే చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తామని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వినర్ తంబిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, పేట చంద్రారెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గోవిందువాసుమాదిగ, దళిత సంఘాల నాయకులు ఉన్నారు.