Dalit concern
-
దళితబంధు అందరికీ ఇవ్వాలి
హుజూరాబాద్/ సాక్షి ప్రతినిధి, వరంగల్: దళితబంధు పథకానికి అనర్హులను ఎంపిక చేస్తున్నారని.. ఒకేసారి అందరికీ వర్తించేలా పథకాన్ని అమలు చేయాలని హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు ఆందోళనలకు దిగారు. శనివారం పలుచోట్ల రహదారులపై బైఠాయించి రాస్తారోకోలు చేశారు. అధికార పార్టీకి చెందినవారికే పథకం వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో హుజూరాబాద్ సహా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనలు విరమింపజేశారు. హుజూరాబాద్ పట్టణంలో.. దళితులందరికీ ‘దళితబంధు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోతిరెడ్డిపేట, ఇప్పల్‌నర్సింగాపూర్ గ్రామాలకు చెందిన దళితులు హుజూరాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందినవారు పరకాల క్రాస్‌రోడ్డు వద్ద.. కందుగుల గ్రామ ఎస్సీ కాలనీకి చెందినవారు పరకాల–హుజూరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేశారు. అనర్హులను ‘దళితబంధు’ పథకానికి ఎంపిక చేశారని మండిపడ్డారు. వారిని ఏ అర్హత ప్రకారం ఎంపిక చేశారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, జెడ్పీటీసీ బక్కారెడ్డి వచ్చి ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ దళితులు వెనక్కి తగ్గలేదు. అర్హులను వదిలేసి అనర్హులను ఏ విధంగా ఎంపిక చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఆందోళనతో హుజూరాబాద్ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చివరికి పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. జమ్మికుంట, ఇల్లందకుంటల్లోనూ.. ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారికే పథ కం వచ్చేలా చేస్తున్నారంటూ తహసీల్దార్ సురేఖతో వాదన కు దిగారు. జెడ్పీ చైర్పర్సన్ ఫోన్లో వారితో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు. ఇక కనగర్తి గ్రామంలో దళితులు రోడ్డుపై బైఠాయించారు, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లిలోనూ దళితులు ఆందోళన చేశారు. కలెక్టర్లకు మంత్రి హరీశ్‌రావు ఫోన్.. దళితుల ఆందోళనల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు కర్ణన్, రాజీవ్‌గాంధీ హనుమంతులతో ఫోన్లో మాట్లాడారు. పథకం కోసం ఎంపిక చేస్తున్న దళితుల వివరా లు, ప్రాధాన్యతలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా, అపోహలకు అవకాశం లేకుండా ఎంపిక ప్రక్రియ జరగాలని ఆదేశించారు. -
దళితులకు సీఎం క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయుడుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘‘ఎస్సీ ల్లో ఎవరు పుట్టాలనుకుంటారు’’అని మాట్లాడడం దళితులను కించపరిచినట్లేనని, అందుకు క్షమాపణ చెప్పాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాల ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.దళితులపట్లవ్యంగ్యంగామాట్లాడటంమనోభావాలనుదెబ్బతీసినట్లేనన్నారు. ఎస్సీల్లో చిచ్చుపెట్టిన చంద్రబాబు ప్రస్తుతం బీసీ కులాల్లో చిచ్చును రగిల్చారన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. ఎన్నికల ముందు పెద్దమాదిగనవుతా.., చెప్పులు కుడతానంటూ దళిత వేషం కట్టిన చంద్రబాబు కుల రాజకీయాలతో గద్దెనెక్కలేరని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. మాలమాదిగల కులంలో పుట్టడం మాకెంతో గర్వంగా ఉందని, అదే కులంలా మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. ఎస్సీలకు క్షమాపణ చెప్పకుంటే చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తామని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వినర్ తంబిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, పేట చంద్రారెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గోవిందువాసుమాదిగ, దళిత సంఘాల నాయకులు ఉన్నారు. -
ఎంపీ తోట అవమానించారంటూ దళితుల ఆందోళన
కిర్లంపూడి :కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పలువురు దళితులు కాకినాడ ఎంపీ తోట నరసింహం తమను అవమానపరిచారంటూ శనివారం రాత్రి స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఎంపీ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. స్థానిక దళితులు పూల రాజుతోపాటు పలువురు దళితులు, మహిళల కథనం ప్రకారం.. నాలుగేళ్ల క్రితం అప్పటి మంత్రి, ప్రస్తుత ఎంపీ తోట నరసింహం కమ్యూనిటీహాలుకు నిధులు ఇచ్చారు. వీటితో తోట అనుచరులు భవన నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా విడిచిపెట్టారు. ఎన్నికల అనంతరం కూడా దీని నిర్మాణంపై దృష్టిపెట్టకపోవడంతో గ్రామవాసీ, మండల జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి కాశీబాబును దళితులు ఆశ్రయించారు. దీంతో గత మార్చి 5న కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ. 3 లక్షల జెడ్పీ నిధులు కేటాయించారు. అయితే వాటితో నిర్మాణం చేయకుండా అధికారులను ఆదేశించి ఎంపీ తోట ఆటంకం కలిగించారని దళితులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 13న హడావుడిగా రూ. 2 లక్షల ఎంపీ నిధులు కేటాయించి శనివారం సాయంత్రం ఎంపీ తోట కమ్యూనిటీహాలు వద్ద కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారు. నాలుగేళ్లుగా కమ్యూనిటీహాలును ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పకుండా వెళ్లిపోతున్న ఎంపీ కారును స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు కాశీబాబు కల్పించుకుని దళితులను వారించడంతో ఎంపీ తోట అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రాజుతోపాటు దళితులు గండే సూర్యాకాంతం, గుండే మణిబాబు, పూల నాగేశ్వరరావు, దాసరి కొండబాబు, ముసలయ్య, గణసతి. గుండే కృప, దాసరి బుజ్జమ్మ, సింహాచలం, గుండే రాజబాబు, చెరుగుల అప్పారావు, చక్రరరావు, వెంకటలక్ష్మి తదితరులు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు.