
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(బుధవారం) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరు కానున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో.. హెలిప్యాడ్ నుంచి వేడుక జరిగే విపీఆర్ కన్వెన్షన్ వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి హాజరు కానున్న సంగతి తెలిసిందే.
సీఎం జగన్ మధ్యాహ్నం ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ద్వారా నెల్లూరు కనుపర్తిపాడు హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ఇరవై నిమిషాలపాటు ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. ఆపై రోడ్డు మార్గంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని.. కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేదిక వద్దకు చేరుకుని వధూవరులను ఆశీర్వదిస్తారు.
హెలికాప్టర్‌లో బయలుదేరి తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment