
సాక్షి, నెల్లూరు: సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని నవదంపతులు శ్రావణ్, సౌజన్యలను సీఎం జగన్ ఆశీర్వదించారు. వివాహ వేడుకకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు.
అంతకుముందు కనుపర్తిపాడులో హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
చదవండి: (వైఎస్సార్‌సీపీ నేత హత్యపై సీఎం జగన్ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు)
Comments
Please login to add a commentAdd a comment