Daughter wedding
-
YSRCP నేత తెర్నేకల్ సురేందర్ రెడ్డి కూతురి వివాహ రిసెప్షన్లో YS జగన్
-
కర్నూలు: వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైఎస్ జగన్
కర్నూలు, సాక్షి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ బుధవారం కర్నూలులో పర్యటించారు. జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరయ్యారు. నూతన వధూవరులు డాక్టర్ కె. చతుర, డాక్టర్ కె. నిఖిల్‌లకు వివాహా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. జగన్ రాకతో కర్నూలు కోలాహలంగా మారింది. ఆయన్ని ఫొటో తీసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారందరికీ అభివాదం చేసి ముందుకు కదిలారాయన. -
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కూతురి పెళ్లి..
-
జగ్గంపేట : నూతన వధువరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, కాకినాడ: జగ్గంపేట నియోజకవర్గంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇర్రిపాకలోని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసానికి వెళ్లిన సీఎం జగన్.. నూతన వధూవరులు అన్నపూర్ణ, సాయి ఆదర్శ్ లను ఆశీర్వదించారు. అంతకు ముందు ఇర్రిపాకలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు,ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికారు. -
విజయవాడ: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) వై.మధుసూదన్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం హాజరయ్యారు. నూతన దంపతులు తేజశ్రీ, అర్జున్‌లను సీఎం ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహుల్లా తదితరులు పాల్గొన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎం జగన్ బుధవారం పర్యటించారు. ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. చదవండి: నిడదవోలు: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
నిడదవోలులో వివాహ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్
-
వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. బుధవారం మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ వేడకకు సీఎం ముఖ్య అతిథిగా విచ్చేశారు. నూతన వధూవరులు సాయి అశ్విత, మంచుకొండ చక్రవర్తిలను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, రాహుల్లా, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉన్నారు. చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్) -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ కుమార్తె పూజా కౌర్ వివాహానికి హాజరయ్యారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్లో మానేరు డ్యాం వద్ద ఉన్న స్పోర్ట్స్ స్కూల్ మైదానానికి మధ్యాహ్నం 12.50 సమయంలో చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి బైపాస్ రోడ్డులోని వి–కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. గంటన్నరపాటు అక్కడే గడిపిన సీఎం.. భోజనానంతరం క్రిస్టియన్ కాలనీలోని మంత్రి గంగుల నివాసానికి చేరుకున్నారు. తేనీటి విందు తర్వాత సీఎంకు గంగుల వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. కలెక్టర్ హుజూరాబాద్‌లో అమలవుతున్న దళిత బంధు ప్రాజెక్టు తీరు తెన్నులపై రూపొందించిన బుక్‌లెట్‌ను సీఎంకు అందజేశారు. ప్రత్యేక బస్సులో హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం 3.45 నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. వివాహ వేడుకకు వెళ్లిన కేసీఆర్..రవీందర్‌సింగ్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చారు. అతడిని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా సర్దార్ రవీందర్ సింగ్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. pic.twitter.com/HoxC0UWxXS — TRS Party (@trspartyonline) December 8, 2022 చదవండి: (బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్.. కేసీఆర్‌కు లేఖ పంపిన ఈసీ) -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని నవదంపతులు శ్రావణ్, సౌజన్యలను సీఎం జగన్ ఆశీర్వదించారు. వివాహ వేడుకకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. అంతకుముందు కనుపర్తిపాడులో హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. చదవండి: (వైఎస్సార్సీపీ నేత హత్యపై సీఎం జగన్ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు) -
అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, అమరావతి, గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం గుంటూరు ఇన్నర్ రింగ్రోడ్లోని శ్రీకన్వెన్షన్‌లో జరిగిన రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్
సాక్షి, అమరావతి/గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్ మంగళవారం గుంటూరు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4.55 గంటలకు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌లోని శ్రీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. చదవండి: (సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం) -
Hyderabad: గవర్నర్ తమిళిసైను కలిసిన అలీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిశారు. అలీ దంపతుల పెద్ద కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బుధవారం గవర్నర్ తమిళిసైని కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. పెళ్లి పత్రికను స్వీకరించిన తమిళిసై తప్పకుండా వివాహానికి హాజరు అవుతానని అలీకి మాటిచ్చారు. చదవండి: (కమెడియన్ అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?) -
అంగరంగ వైభవంగా పొంగులేటి కుమార్తె వివాహ రిసెప్షన్
సాక్షి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డి వివాహ రిసెప్షన్ విందు ఖమ్మంలో అంగరంగ వైభవంగా జరిగింది. పొంగులేటి కుమార్తె స్వప్నిరెడ్డి, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి మనవడు అర్జున్‌రెడ్డిల వివాహం ఈ నెల 12న ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో జరిగింది. అనంతరం ఖమ్మంలో రాజస్థాన్ ప్యాలెస్‌ను తలపించే భారీ సెట్టింగ్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (Nandamuri Balakrishna: చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన బాలయ్య) -
సినీ నిర్మాత అన్బుసెలిన్ కుమార్తె పెళ్లి.. ప్రముఖుల హాజరు (ఫోటోలు)
-
తెల్లజుట్టుతోనే పెళ్లి కళ... భళా అంటున్న నెటిజన్లు
-
మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి భయాల నేపథ్యంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్ తన కూతురి వివాహాన్ని సాదాసీదాగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఆయన తన కూతురు నతాషా అవ్హాడ్‌కు రిజిస్టర్ వివాహం జరిపించారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా జరిగిన ఈ పెళ్లికి కేవలం ఆయన కుటుంబ సభ్యులు, కొందరు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. మంత్రి హోదాలో ఉండి కూడా తన ఏకైక కూతురి వివాహాన్ని నిరాడంబరంగా జరిపించిన మంత్రి జితేంద్ర అవ్హాడ్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. చదవండి: (కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి: ఎంపీ విజయసాయిరెడ్డి) -
బిల్ గేట్స్ కుమార్తె వివాహం.. ఖర్చు ఎంతంటే..
వాషింగ్టన్: ప్రస్తుత కాలంలో సామాన్యుల ఇళ్లల్లో జరిగే పెళ్లి వేడుకలే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి అలాంటిది ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ ఇంట పెళ్లి అంటే.. మాటలు కాదు. అతిరథ మహరథులు అతిథులుగా హాజరయ్యే ఈ వేడుకకు ఖర్చు మాములుగా ఉండదు. మన ఆసియా కుబేరుడు ముకేష్ అంబానీ ఆయన కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుకకు సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. మరి ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కుమార్తె వివాహం అంటే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నారా.. అయితే అక్కడే మీరు పప్పులో కాలేసినట్లు. బిల్‌గేట్స్ కుమార్తె వివాహ వేడుకకు కేవలం 2 మిలియన్ డాలర్లు అనగా 14 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయట. ఇంత తక్కువ ఎందుకంటే.. కరోనా. (చదవండి: ప్రియుడితో బిల్‌గేట్స్ తనయ జెన్నీఫర్ పెళ్లి!) కొన్ని రోజుల క్రితం బిల్ గేట్స్ కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ వివాహం జరిగినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్ రైడర్ అయిన నాయెల్ నాజర్‌తో జెన్నిఫర్ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్’ మ్యాగజైన్ ధృవీకరించింది. పెళ్లి అనంతరం జెన్నీఫర్ గేట్స్ తన వివాహ వేడుక గురించి వోగ్ మ్యాగ్జైన్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘2021 నాకు చాలా సవాళ్లు విసిరిన సంవత్సరం. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా అయిపోయింది. దానికి మించిన సంఘటన మా ఇంట్లోనే చోటు చేసుకుంది. దురదృష్టం కొద్ది ఈ ఏడాదే మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు మధ్య పెళ్లి వేడుకను ప్లాన్ చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని అయ్యింది’’ అని తెలిపింది జెన్నీఫర్. (చదవండి: ఈ పెళ్లి చరిత్రలో నిలిచిపోతుంది.. ఎందుకంటే!) ‘‘ఇక పెళ్లికి ఇరు కుటుంబాల సన్నిహితులను మాత్రమే పిలవాలని భావించాం. అలా చూసుకున్న 300 మంది లిస్ట్ తయారయ్యింది. ఇక వారందరిని టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేశాం. నెగిటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సిందిగా సూచించాం. పెళ్లి సందర్భంగా వారాంతంలో రెండు వివాహ వేడుకలు నిర్వహించాం. ఒకటి సివిల్ మరొకటి మతపరమైనది’’ అని తెలిపింది. ‘‘శనివారం మధ్యాహ్నం న్యూయార్క్‌లోని ఉత్తర సేలంలోని కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఎస్టేట్‌లో బహిరంగ వివాహ వేడుక జరిగింది. ప్రఖ్యాత న్యూయార్క్ సిటీ రెస్టారెంట్లు క్యాటరింగ్ చేశాయి. కస్టమ్ వెరా వాంగ్ డిజైన్ చేసిన వెడ్డింగ్ గౌను ధరించాను. ఈవెంట్ ప్లానర్ మార్సీ బ్లమ్ వారాంతంలో ఈ వేడుక జరిపించారు’’ అన్నది. జెన్నీఫర్ భర్త నాయల్ నాజర్ ఈక్వెస్ట్రియన్(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు. ఈజిప్టు సంతతికి చెందిన నాజర్‌ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్లో ఉన్నారట. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్నపటి నుంచే ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు బిల్‌గేట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గేట్స్ దంపతులు విడిపోవడంతో.. కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. బిల్‌గేట్స్.. కుమార్తె జెన్నీఫర్ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు -
రెడ్డి శాంతి కుమార్తె వివాహానికి సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, ఎల్.ఎన్.పేట: పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె, ఐఏఎస్ అధికారి రెడ్డి వేదిత వివాహ రిసెప్షన్ నవంబర్ 9న పాతపట్నంలో జరగనుంది. ఈ వేడుకకు రావాలని కోరుతూ.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ఆహ్వానపత్రికను అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేతో పాటు ఆమె కుమారుడు రెడ్డి శ్రావణ్‌కుమార్ ఉన్నారు. చదవండి: (రాష్ట్రాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం) చదవండి: (Andhra Pradesh: చిట్టి చెల్లెమ్మకు 'స్వేచ్ఛ') -
ఘనంగా కోమటిరెడ్డి కుమార్తె వివాహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధి- ప్రణవ్‌ల వివాహం బుధవారం ఘనంగా జరిగింది. కోవిడ్ కారణంగా ఈ వేడుకలో ఇరుకుటుంబాల దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. కర్నూలుకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్ రెడ్డి కుమారుడైన ప్రణవ్ రెడ్డి వరుడు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లోని లీలాప్యాలెస్ వేదికగా కల్యాణం జరుగుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా జర్నలిస్ట్ ప్రభు కూతురి వివాహం
-
మంత్రి ఈటల రాజేందర్ కుమర్తె వివాహ వేడుక
-
దగ్గుబాటి కల్యాణ వైభోగమే...
హీరో వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమార్తె అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేంద్ర రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో నేడు జరగనుంది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజస్తాన్‌లో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా జరిగిన వేడుకలో రానా, నాగచైతన్య, సమంత, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరికొందరు పాల్గొన్నారు. శనివారం జరిగిన సంగీత్ కార్యక్రమంలో రానా, నాగచైతన్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు హైలైట్‌గా నిలిచాయని సమాచారం. నాగచైతన్య, సమంత వివాహ వేడుకల్లో అతిథులతో వెంకటేశ్ -
జస్టిస్ రమణ కూడా తప్పుకున్నారు!
న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా ఎం.నాగే శ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. సీబీఐ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు తమ రాష్ట్రం వాడేననీ, ఆయన కుమార్తె వివాహానికి కూడా వెళ్లానని అందుకే ఈ ధర్మాసనం నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ తర్వాత ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న మూడో జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ. ఆయన వైదొలగడంతో సీనియర్ జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని మరో ధర్మాసనం ఈ కేసును శుక్రవారం నుంచి విచారిస్తుందని సీజేఐ ప్రకటించారు. జనవరి 10న ప్రధాని నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఐపీఎస్ అధికారి ఆలోక్‌వర్మను సీబీఐ చీఫ్ హోదా నుంచి తొలగించిన అనంతరం ఎం.నాగేశ్వరరావును తాత్కాలిక చీఫ్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియామకం సరిగా జరగలేదంటూ కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్ధ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ శంతన గౌడర్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ.. ‘సీబీఐ తాత్కాలిక చీఫ్ ఎం.నాగేశ్వర రావు, నేనూ ఒకే రాష్ట్రం వాళ్లం. ఆయనతో నాకు పరిచయం ఉంది. న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన అల్లుడు కూడా నాకు తెలుసు. అందుకే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నా’ అని ప్రకటించారు. కాగా, సీబీఐ చీఫ్ ఎంపిక విషయమై చర్చించేందుకు శుక్రవారం మరోసారి సమావేశం కానున్నట్లు ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ సభ్యుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. -
బియాన్స్... బడ్జెట్ అదుర్స్
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూతురి పెళ్లి సంబరాలు ఇటీవల జరిగిన విషయాన్ని వినే ఉంటారు. ఇండియన్ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు అంబానీ. కేవలం వెడ్డింగ్ పార్టీల కోసమే సుమారు వంద మిలియన్ డాలర్లను కార్లో పెట్రోల్లా ఖర్చు పెట్టారట ఆయన. ఈ ఫంక్షన్లో హాలీవుడ్ సింగర్ బియాన్స్ కనిపించడం విశేషం. ఎందుకంటే బియాన్స్ ఒక్క ప్రైవేట్ పార్టీకి సుమారు 3–4 మిలియన్ డాలర్స్ (దాదాపు 20 కోట్ల రూపాయలు) అందుకుంటారట. 2017లో మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదించిన సింగర్‌గా బియాన్స్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆమె అంబానీ పార్టీ కోసం ఎంత తీసుకున్నారంటే.. సుమారు 28 కోట్లు పుచ్చుకున్నారని టాక్. -
వందకోట్లు వైట్‌మనీగా మార్చారు!
గాలి కూతురి పెళ్లి కోసం 20% కమీషన్‌పై డబ్బు మార్పు ► కర్ణాటక అధికారి భీమానాయక్ డ్రైవర్ సూసైడ్ నోట్లో వెల్లడి ► లేఖలో ప్రభుత్వాధికారి భీమా నాయక్ అక్రమాస్తుల వివరాలు బెంగళూరు: పారిశ్రామికవేత్త గాలి జనార్దన రెడ్డి.. కూతురి పెళ్లి కోసం రూ.100 కోట్ల నల్లధనాన్ని చెలామణిలోకి తెచ్చారని.. మంగళవారం ఆత్మహత్య చేసుకున్న ఓ ప్రభుత్వాధికారి డ్రైవర్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. బెంగళూరలో ప్రత్యేక భూ సేకరణ అధికారిగా పనిచేస్తున్న భీమా నాయక్.. డ్రైవర్ కేసీ రమేశ్ గౌడ.. మాండ్యలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ గదినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆత్మహత్య లేఖలో గాలి కూతురి పెళ్లికి నల్లధనం ఎలా చెలామణిలోకి వచ్చిందీ, భీమానాయక్ అక్రమాలు, అక్రమాస్తుల వివరాలున్నాయి. ఈ వివరాలన్నీ తనకు తెలియటంతోనే చంపేందుకు ప్రయత్నిస్తున్నారని రమేశ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. కాగా, ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘అక్టోబర్ 28న భీమానాయక్, మరో వ్యక్తితో కలిసి.. ఓ గెస్ట్ హౌజ్‌లో బీజేపీ ఎంపీ శ్రీరాములు, గాలి జనార్దన రెడ్డిలను కలిశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హగరిబొమ్మనహల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్న ఆ వ్యక్తి.. అందుకోసం రూ.25 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు’ అని లేఖలో రమేశ్ పేర్కొన్నారు. గాలి కూతురి పెళ్లికి రూ.25 కోట్ల వైట్ మనీని ఎలా తెచ్చిందీ నవంబర్ 15న ఓ హోటల్లో తనముందే చెప్పారన్నారు. అవి కాకుండా.. రూ.100 కోట్లను 20 శాతం కమీషన్‌కు మార్చుకున్న తీరును రమేశ్ తన లేఖలో వివరించారు. అలాగే, శ్రీరాములు ఇంటికీ నాయక్ వెళ్లిన సందర్భాలు.. ఆయా సమయాల్లో వాడిన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లనూ రమేశ్ లేఖలో పేర్కొన్నారు.ఇవన్నీ తనకు తెలియటంతో చంపించేస్తామని బెదిరించారన్నారు. భీమ్ నాయక్ అక్రమ సంపాదన, అక్రమాస్తుల వివరాలనూ రమేశ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. నాయక్, ఆయన వ్యక్తిగత డ్రైవర్ మొహమ్మద్లే తన ఆత్మహత్యకు కారణమన్నారు. తనకు జీతం రాకుండా మూడు నెలలు అడ్డుకున్నారన్నారు. నోట్లరద్దు నేపథ్యంలో అంగరంగ వైభవంగా తన కూతురు వివాహాన్ని చేసిన గాలిపై ఐటీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఆరోపణలు అవాస్తవమని.. తమ పరువు తీసేందుకు ఆడుతున్న కుట్రలో భాగమని ఎంపీ శ్రీరాములు ఢిల్లీలో తెలిపారు. కాగా.. ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు.