
‘ఎంపీ కూతురు పెళ్లి 2.5లక్షల్లో చేస్తున్నారా?’
కొనుగోళ్లకు ప్రతి చోట చెక్కుల ద్వారానే చెల్లించారా అని నిలదీశారు. ఆయన అసలు నోట్ల మార్పిడిని ఎలా చేసుకున్నారని అన్నారు. మొత్తం వివాహ ఏర్పాట్లు 2.5లక్షల్లోనే పూర్తి చేశారా అని మండిపడ్డారు. నిజంగా అలాగే చేస్తుంటే అలా ఎలా చేయగలిగారో కూడా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.