‘జరిగే పెళ్లి కూతురుది కాదయ్యా.. కొడుకుది’
తన ఇంట్లో వివాహం జరుగుతున్న మాట వాస్తవం అని అయితే, కేజ్రీవాల్ చెప్పినట్లు కూతురు పెళ్లి కాదని కుమారుడు పెళ్లి అని కేజ్రీవాల్ పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఆయన చెప్పారు. తాను పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బ్యాంకు ద్వారానే చెల్లింపులు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఓ దొంగ ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంలో అతడు బ్యాంకు క్యూలో నిల్చున్న డబ్బు దొరకక ఆత్మహత్య చేసుకున్నాడని ఒకసారి.. సిరియా పిల్లల ఫొటోలు చూపిస్తూ ఉత్తరప్రదేశ్ రైలు ప్రమాద బాధితులు అని పేర్కొంటూ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పెట్టి నవ్వులపాలయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఎంపీ కుమారుడి వివాహాన్ని కూతురు వివాహంగా చెప్పి అబాసు పాలయ్యారు.