
కుమార్తె అశ్రితతో వెంకీ
హీరో వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమార్తె అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేంద్ర రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో నేడు జరగనుంది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజస్తాన్‌లో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా జరిగిన వేడుకలో రానా, నాగచైతన్య, సమంత, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరికొందరు పాల్గొన్నారు. శనివారం జరిగిన సంగీత్ కార్యక్రమంలో రానా, నాగచైతన్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు హైలైట్‌గా నిలిచాయని సమాచారం.
నాగచైతన్య, సమంత
వివాహ వేడుకల్లో అతిథులతో వెంకటేశ్
Comments
Please login to add a commentAdd a comment