vinayak reddy
-
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
దగ్గుబాటి కల్యాణ వైభోగమే...
హీరో వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమార్తె అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేంద్ర రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో నేడు జరగనుంది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజస్తాన్‌లో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా జరిగిన వేడుకలో రానా, నాగచైతన్య, సమంత, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరికొందరు పాల్గొన్నారు. శనివారం జరిగిన సంగీత్ కార్యక్రమంలో రానా, నాగచైతన్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు హైలైట్‌గా నిలిచాయని సమాచారం. నాగచైతన్య, సమంత వివాహ వేడుకల్లో అతిథులతో వెంకటేశ్ -
పార్టీ బలోపేతంపై వైఎస్సార్సీపీ దృష్టి
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ దృష్టి సారించింది. ఇందుకు కమిటీలను ఏర్పాటు చేసి అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కొమ్ముల వినాయక్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రింట్మీడియా ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో గ్రామ, బూత్, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నెలాఖరులోగా అన్ని కమిటీలను పూర్తి చేసే బాధ్యత మండల కన్వీనర్లకు అప్పగించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో వైఎస్సార్ అభిమానులను ఏకం చేసి.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ పోరాడుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. పేద ప్రజల కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. అత్యవసర సమయంలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 108 పథకాన్ని సైతం నీరుగారుస్తోందన్నారు. జిల్లాలోని పసుపు రైతులు అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని, వారికి కనీస మద్దతు ధర రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్‌కుమార్, ఆదిలాబాద్ మండల కన్వీనర్ గోపాల్, పట్టణ కన్వీనర్ ఇస్లామొద్దీన్, యువజన విభాగం నాయకుడు వసీం ఖాద్రీ, బీసీ సెల్ నాయకుడు కృష్ణమీనన్ యాదవ్, నాయకులు మోయినొద్దీన్, నామ్‌దేవ్ పాల్గొన్నారు. -
వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్: పెంచిన వం ట గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గిం చాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కొమ్ముల వినాయక్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని నిరసిస్తూ వై ఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్‌లో ఆందోళన నిర్వహించా రు. ఖాళీ సిలిండర్‌తో ఆర్డీవో కార్యాల యం గేటు వద్ద నిరసన తెలి పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. వినాయక్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం మోపిం దని మండిపడ్డారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే పుండు మీద కారం చల్లినట్లుగా ప్రభుత్వం గ్యాస్ ధర కూడా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. అయితే ఇప్పటి కిరణ్‌కుమార్ ప్రభుత్వం మాత్రం ప్రజల ఇబ్బందులను అస్సలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఆధార్‌కార్డుతో ప్రమేయం లేకుండా గ్యాస్ సబ్సిడీని అందజేయాలని సుప్రీంకోర్టు సూచించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని అన్నా రు. వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని, ఆధార్‌తో సంబంధం లేకుండా గ్యాస్ సబ్సిడీని అందజేయాలని కోరారు. మైనార్టీ సెల్ నాయకులు జుబేర్, ఇర్షద్, అర్షద్, ఉమర్, ఎస్సీ సెల్ నాయకులు నిగులపు లింగన్న, యువజన విభాగం నాయకులు ఎం.ఎస్.రాజు, నరేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో మహిళారైతు ఆత్మహత్య
చేగుంట, న్యూస్‌లైన్: అప్పుల బాధతో మహిళారైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట మండల పరిదిలోని పోతాన్‌పల్లి గ్రామంలో అది వారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుపతి శ్యామల, భర్త అంజనేయు లు వారికి ఉన్న ఎకరా పొలంలో వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నారు. ఇటీవల తన వ్యవసాయ భూమిలో బోరుబావిని తవ్వించారు. దానికొసం కొంత అప్పు చేశారు. అప్పులు తీర్చే విషయంలో మనస్థాపం చెందిన శ్యామల(35) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై వినాయక్‌రెడ్డి గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమెదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఎరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.