నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్: పెంచిన వం ట గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గిం చాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కొమ్ముల వినాయక్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని నిరసిస్తూ వై ఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్‌లో ఆందోళన నిర్వహించా రు. ఖాళీ సిలిండర్‌తో ఆర్డీవో కార్యాల యం గేటు వద్ద నిరసన తెలి పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. వినాయక్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం మోపిం దని మండిపడ్డారు.
ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే పుండు మీద కారం చల్లినట్లుగా ప్రభుత్వం గ్యాస్ ధర కూడా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. అయితే ఇప్పటి కిరణ్‌కుమార్ ప్రభుత్వం మాత్రం ప్రజల ఇబ్బందులను అస్సలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఆధార్‌కార్డుతో ప్రమేయం లేకుండా గ్యాస్ సబ్సిడీని అందజేయాలని సుప్రీంకోర్టు సూచించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని అన్నా రు. వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని, ఆధార్‌తో సంబంధం లేకుండా గ్యాస్ సబ్సిడీని అందజేయాలని కోరారు. మైనార్టీ సెల్ నాయకులు జుబేర్, ఇర్షద్, అర్షద్, ఉమర్, ఎస్సీ సెల్ నాయకులు నిగులపు లింగన్న, యువజన విభాగం నాయకులు ఎం.ఎస్.రాజు, నరేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
Published Sat, Jan 4 2014 3:00 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM
Advertisement