Hero Venkatesh
-
రిపీట్ కానున్న లక్ష్మి కాంబినేషన్
-
వైజాగ్.. భలే హుషారు
విశాఖపట్నం: వైజాగ్ వస్తే చాలా హుషారుగా ఉంటుందని హీరో వెంకటేష్ అన్నారు. సైంధవ్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలను ఆదివారం బీచ్‌రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మొదటి సినిమా నుంచి వైజాగ్ ప్రేక్షకులు తనను ఆదరిస్తూ వస్తున్నారన్నారు. చాలా సినిమాలు వైజాగ్‌లో షూటింగ్ చేశామన్నారు. తన 75వ సినిమా సైంధవ్ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించారు. సైంధవ్ సినిమాకు హీరో సారా పాప అని చెప్పారు. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ తనకు వైజాగ్ బాగా కలిసి వచ్చిందన్నారు. సైంధవ్ సినిమాను స్టీల్‌ప్లాంట్ కాలనీలో 40 రోజులు షుటింగ్ చేశామన్నారు. హిట్, హిట్–2 సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసి మంచి విజయం సాధించామన్నారు. వెంకీమామను ప్రేక్షకులను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో చూపించామన్నారు. వెంకీమామ 75 సినిమా తనకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, నటీనటులు పాల్గొన్నారు. -
నా గర్ల్ ఫ్రెండ్ తో నీకెందుకయ్యా: హీరో వెంకటేష్
-
'వచ్చేయ్.. ఎంట్రీ నేనే ఇప్పిస్తా'.. రానా స్వీట్ వార్నింగ్
దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడులో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డొనవన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే రానా.. వెంకటేశ్‌కు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ట్విటర్లో షేర్ చేశారు రానా. ఆ వీడియోలో ఏమన్నారంటే.. రానా మాట్లాడుతూ.. 'వచ్చేయ్. ట్రైలర్ లాంఛ్‌లో కలుద్దాం. అక్కడా గేటు దగ్గర వద్ద నీకు ఎంట్రీ దొరక్కపోతే రానా నాయుడు తండ్రినని చెప్పు. నీకు రానా పేరుతో ఎంట్రీ ఇస్తారు.' అని అన్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఇది వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే వెంకటేశ్ కూడా ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకీ. చేతిలో గన్ పట్టుకుని బెదిరిస్తున్న ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. Video toh koi bhi bana leta hai, Naga. Trailer launch par mil. Batata hu asli baap kaun hai.@VenkyMama #RanaNaidu pic.twitter.com/qveDM25zOB — Rana Daggubati (@RanaDaggubati) February 13, 2023 -
వెంకీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అదిరిపోయిన పోస్టర్ లుక్
టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేశ్ చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన హీరో తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలే విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన వెంకటేశ్ మరే కొత్త సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇటీవల హీరో రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్‌లో కనిపించారు. తాజాగా తన నెక్స్ట్ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ న్యూ అడ్వెంచర్ అంటూ ఫైర్ ఎమోజీని జత చేశారు. అది కాస్తా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న చిత్రానికి 'వెంకీ75' పేరుతో విడుదలైన పోస్టర్ వెంకీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి జనవరి 25న పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. గతంలో వెంకటేశ్ నటించిన నారప్ప, ఎఫ్-3 చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై వెంకీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ లుక్ పోస్టర్ చూస్తే వెంకటేష్ చేతిలో తుపాకీ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. భారీ పేలుడు ముందు నిలబడిన వెంకటేశ్ లుక్ అదిరిపోయింది. పోస్టర్ చూస్తే ఈ సినిమా యాక్షన్ జోనర్‌ను తలపించేలా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలోని నటీనటులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. కాగా.. ఇటీవల వెంకటేశ్-రానా నటించిన రానానాయుడు వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) -
వెంకీ మామా.. కొత్త బిజినెస్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర హీరోలలో ఒకరైన వెంకటేష్ దగ్గుబాటి కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) స్టార్టప్ బైక్ వో టాలీవుడ్ హీరో వెంకటేష్ దగ్గుబాటితో భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. బైక్ వో అనేది ఈవీ టూ వీలర్ స్మార్ట్ హబ్ నెట్ వర్క్. ఈ కంపెనీ 2025 నాటికి దేశవ్యాప్తంగా 20,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. "బైక్ వో అనేది ఈవీ రంగంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్, సర్వీసింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది" అని విక్టరీ వెంకటేష్ తెలిపారు. ఈ భాగస్వామ్యంతో బైక్ వో తన ఈవీ సర్వీసింగ్, ఛార్జింగ్ నెట్ వర్క్ విస్తరిస్తుంది. మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్ కార్యకలాపాల కోసం తనను వినియోగించుకోనుంది. ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. గతంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారు మంచి నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్‌లో ఈ కంపెనీ తమ బిజినెస్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. (చదవండి: కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది..!) -
వెంకీ మామకు బర్త్‌డే శుభాకాంక్షలు,మోషన్ పోస్టర్ అదిరిపోయిందిగా!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరోలలో ఆయన ప్రత్యేకతే వేరు. విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్న గుంటూరు మిర్చి. ఆయన స్టెప్ వేస్తే.. ప్రేక్షకులకు జింగిడి.. జింగిడియే. ఈ చంటిగాడు సినిమా చూపిస్తే ఇక దృశ్యమే. రీమేక్ హీరోగా పేరు గడించిన ఆ స్టార్హీరో దగ్గుబాటి వెంకటేష్..లేదా విక్టరీ వెంకటేష్. సొంత టాలెంట్‌తో తన కంటూ ఒకస్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వెంకీ మామకు షష్టి పూర్తి శుభాకాంక్షలు చెబుతోంది సాక్షి. మరోవైపు బాబాయ్ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా దగ్గుబాటి హీరో రానా ‘టీం దగ్గుపాటి సమర్పణ’లో ఒక మోషన్ పోస్టర్‌ను ట్విటర్ ద్వారా రిలీజ్ చేశాడు. ఇది ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. Releasing the motion poster celebrating the one and only Victory V 🔥🔥🔥@VenkyMama #HBDVictoryVenkatesh pic.twitter.com/xowe9qxOOs — Rana Daggubati (@RanaDaggubati) December 12, 2021 1960 డిసెంబర్ 13న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కారంచేడులో జన్మించారు. ఈ రోజుతో మన వెంకీ మామ 61వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అగ్రహీరోగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. 1971లో ఏఎన్నార్ ప్రేమ్‌నగర్‌లో బాలనటుడిగా కనిపించిన వెంకటేష్ తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ, మాస్, క్లాస్, ఫ్యామిలీ, యాక్షన్ జానర్ ఏదైనా తన అభినయంతో సిల్వర్ స్క్రీన్‌పై తనదైనముద్ర వేసుకున్న వెంకటేశ్. 1986 నాటి ‘కలియుగ పాండవులు’ మూవీ మొదలు, నేటి దృశ్యం వరకు సత్తా చాటుతూనే ఉన్నాడు. తొలి సినిమాకే ఉత్తన నటుడుగా నంది అవార్డు అందుకుని. కరియర్ ఆరంభంనుంచే వరుస విజయాలతో అటుఫ్యాన్ ఫాలోయింగ్‌ను, ఇటు విక్టరీ వెంకటేష్‌గా పేరును దక్కించు కున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన ‘బొబ్బిలిరాజా’ వెంకీ కరియర్కే అతి ముఖ్యమైన సినిమా. 1991లో వచ్చిన ‘చంటి’ వెంకటేశ్ కెరీర్లో మరో మైలురాయి. ఈ మూవీతోనే వెంకటేశ్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ‘శ్రీనివాస కళ్యాణం’, ’స్వర్ణకమలం’, ’గణేష్’, ‘తులసి’, ‘లక్ష్మి’, ‘నువ్వునాకు నచ్చావ్’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో పాటు ‘చంటి’, ‘సుందరకాండ’, ‘చినరాయుడు’, ‘పవిత్ర బంధం’, ‘రాజా’, ‘సంక్రాంతి’ లాంటి సినిమాలతో ఫ్యామిలీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. అలాగే ‘బొబ్బిలి రాజా’, ‘శత్రువు’, ‘ధర్మచక్రం’, వంటి మాస్ సినిమాలతో మాస్ ప్రేక్షకులను అలరించాడు. ‘ప్రేమ’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ప్రేమించుకుందాం..రా’, ‘వాసు’ గురు, ఘర్షణ, లాంటి సినిమాలతో యూత్‌కు దగ్గరయ్యాడు. కథాబలం సినిమాలతో ఆలోచింపచేయడమేకాదు, హీరోగా హాస్యాన్ని పండించాడు.రీమేక్ చిత్రాలను సక్సెస్ఫుల్ చేసిన ఘనతకూడా వెంకీకే దక్కుతుంది. బాడీగార్డ్, నాగవల్లి, లాంటి సినిమాలతోపాటు తాజాగా నారప్ప, దృశ్యం సినిమాలే ఇందుకు నిదర్శనం. మల్లీశ్వరి మూవీ ద్వారా కత్రినా కైఫ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన క్రెడిట్ కూడా వెంకీకే దక్కుతుంది. ఇక తరువాత ట్రెండ్‌కు తగ్గట్టు తెలుగులో మల్టీస్టారర్ మూవీలతో సాహసం చేసింది కూడా వెంకీనే. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, యంగ్ హీరో రామ్‌తో మసాలా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గోపాలా గోపాలా ‘ఎఫ్2’ లాంటి సినిమాలతో ప్రయోగం చేసి, మల్టీ స్టారర్ మూవీలతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. మేనల్లుడు, యంగ్ హీరో నాగచైతన్యతో ‘ప్రేమమ్’ ‘వెంకీమామ’ మూవీలతో మంచి కలక్షన్లు రాబట్టాడు. మూవీ మొఘల్ దివంగత రామానాయుడు కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనదైన స్టయిల్లో దూసుకుపోతూ 35 యేళ్ల కెరియర్ లో ఇప్పటివరకు 74 సినిమాలు, కలియుగ పాండవులు , స్వర్ణకమలం, ప్రేమ, గణేష్, ధర్మచక్రం, కలిసుందాంరా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలకు 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకోవడం విశేషం. వెంకటేష్, నీరజారెడ్డి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. -
ఇంటి పనిలో సహాయం చేద్దాం: వెంకటేష్
టాలీవుడ్లో సందీప్‌రెడ్డి వంగా ప్రారంభించిన ‘బి ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్..సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తమ పేవరెట్ స్టార్స్ ఇలా గరిటె పడుతూ స్వయంగా ఇంటిపనులు చేస్తున్న వీడియోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వేసవి సినిమా వినోదం లేకున్నా ఈ ఎంటర్టైన్మెంట్ చాలు అనుకుంటున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను హీరో వెంకటేశ్ పూర్తిచేశారు. ఇళ్లు తుడిచి తోట పనిచేసి వంట చేసి పెట్టారు. ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ..ఇంటి పనిలో కుటుంబానికి సహాయం చేద్దాం అంటూ ట్వీట్ చేశారు. అనంతరం ఈ ఛాలెంజ్‌కు ‘చిన్నోడు’ మహేష్ బాబు, ‘కోబ్రా’ వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడిలను నామినేట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఉత్సవ్ తరంగం..
సాక్షి, విశాఖపట్నం: జనమా.. తీరాన వీచిన ప్రభంజనమా! నగరమా.. నవ్యోత్సాహ తరంగాల సాగరమా! ఆదివారం సాయంత్రం అగుపించిన విచిత్రాన్ని చూస్తే కలిగిన సందిగ్ధమిది. చలికాలం సాయంత్రం ఉప్పొంగిన ఉత్సాహాన్ని చూస్తే తలెత్తిన సందేహమిది. ఉత్సవ సంరంభంతో విశాఖ అంతా హోరెత్తిపోయింది. అపూర్వరీతిలో ఎగసిన ఉత్తేజంతో సాగర నగరమంతా ఉప్పొంగిపోయింది. ఆవంక సాగర తీరంలో రాత్రివేళ.. సాంస్కృతిక కార్యక్రమాల హరివిల్లు విరిస్తే.. ఇటు నగర మధ్యంలోని వైఎస్సార్ పార్క్‌లో ఉప్పొంగిన పూల కెరటం ఉల్లాసపు జల్లుల్ని కురిపించింది. బీచ్‌లో వేల దీపాల వెలుగుల మధ్య జిగేల్మన్న సాంస్కృతిక సంరంభం.. ప్రజానీకాన్ని సమ్మోహితుల్ని చేసింది. విభిన్న కళా ప్రదర్శనలకు వినోదం మిళితం కాగా.. సాగరతీరం ఉత్సాహంతో ఊగిపోయింది. ప్రముఖుల ఆటామాటా మరింత సంతోషాని్న చ్చింది. ఉత్సవ ఉత్సాహంతో ఊరంతా సాగరతీరం వైపే ఉరకలేయగా.. ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ జన గమనానికి ఆటంకం కలిగింది. పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి చక్కబడింది. అపూర్వమైన సంబరాన్ని తిలకించిన సంభ్రమంతో నగరం పరవశించింది. వెంకిమామ సందడి విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో హీరో వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జోక్స్‌తో ప్రేక్షకుల్ని నవి్వంచారు. విశాఖతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. వైజాగ్ వస్తే సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుందన్నారు. సంప్రదాయాలను పాటించడం, వినోదాన్ని పంచడంలో విశాఖవాసుల ప్రత్యేకతే వేరని కొనియాడారు. వెంకి మామ చిత్రంలోని పలు డైలాగ్స్‌ను చెప్పి ప్రేక్షకుల్ని అలరించారు. ఉత్సవ్ సాగిందిలా... ►బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన విశాఖ ఉత్సవ్–2019 ఆదివారం అంగరంగ వైభవంగా ముగిసింది. ►ఆర్కేబీచ్‌లోని ప్రధాన వేదికపై సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనేలా సాగాయి. ►వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్కేబీచ్ వరకు జనం పోటెత్తారు. ►‘ఆట’ సందీప్ టీం వినాయక పాటతో ప్రదర్శన ప్రారంభించింది. ►హైదరాబాద్‌కు చెందిన థీరి బ్యాండ్ ప్రదర్శన శ్రోతల్ని సంగీతలోకంలో ఓలలాడించింది. ఈ ప్రదర్శన 45 నిమిషాల పాటు సాగింది. ►థింక్ బిగ్ టీమ్.. మహిళల సంరక్షణ కోసం రూపొందించిన అత్యవసర అలారమ్ వినియోగంపై అవగాహన కలి్పంచింది. ►ఎంజె5 బృందం ప్రదర్శించిన డ్యాన్సులతో సందర్శకులు ఊగిపోయారు. ►సౌత్ ఆఫ్రికాకు చెందిన జరన్ టీం ప్రదర్శన అద్భుతంగా సాగింది. ►ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ తన బృందంతో 45 నిమిషాల పాటు సాగరతీరాన్ని హోరెత్తించారు. సింహా, గీతా మాధురి, శ్రీకృష్ణ, ఆదిత్య, హనుమాన్ తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. ►ఉత్సవ్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా ఉన్నతాధికారులను మంత్రి ముత్తంశెట్టి సన్మానించారు. ►ఉత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా సాగరతీరంలో ఏర్పాటు చేసిన బాణసంచాతో తీరం మెరిసిపోయింది. ►20 నిమిషాల పాటు సాగిన లేజర్ షోతో విశాఖ ఉత్సవ్ ముగిసింది. ►ముగింపు వేడుకల్లో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కలెక్టర్ వినయ్‌చంద్, జేసీలు వేణుగోపాల్ రెడ్డి, శివశంకర్, ఎమ్మెల్యేలు అమర్నాథ్, నాగిరెడ్డి, అదీప్ రాజ్, వైఎస్సాసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ట తదితరులు పాల్గొన్నారు. -
మంచి మలుపు అవుతుంది
సీనియర్ నటుడు సత్యప్రకాశ్ దర్శకుడిగా మారి, రూపొందిస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. రక్షకభటుడు, ఆనందం, లవర్స్ డే లాంటి చిత్రాలను అందించిన నిర్మాత ఎ. గురురాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటరాజ్, నూరిన్, అంకిత తదితరులు ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మోషన్ పోస్టర్ని హీరో వెంకటేశ్ ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘సత్యప్రకాష్ నాకు మంచి మిత్రుడు. నటునిగా అతనిలో ఎంత ఫైర్ ఉందో, దర్శకునిగా అంతకు మించిన ఫైర్ ఉంది. ఈ చిత్రానికి నేనే కథను అందించాను. నిర్మాతగా నాకు, దర్శకునిగా సత్యప్రకాష్‌కు ఈ చిత్రం మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదు’’ అన్నారు సత్యప్రకాష్. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ. -
దగ్గుబాటి కల్యాణ వైభోగమే...
హీరో వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమార్తె అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేంద్ర రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో నేడు జరగనుంది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజస్తాన్‌లో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా జరిగిన వేడుకలో రానా, నాగచైతన్య, సమంత, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరికొందరు పాల్గొన్నారు. శనివారం జరిగిన సంగీత్ కార్యక్రమంలో రానా, నాగచైతన్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు హైలైట్‌గా నిలిచాయని సమాచారం. నాగచైతన్య, సమంత వివాహ వేడుకల్లో అతిథులతో వెంకటేశ్ -
‘ఆటా నాదే..వేటా నాదే’ అంటున్న అగ్రహీరో
సాక్షి, హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, క్రియేటివ్ డైరెక్టర్ తేజ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీకి 'ఆటనాదే వేటనాదే' అనే టైటిల్ పెట్టాలని భావిస్తోందట చిత్ర యూనిట్. సోమవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పరచూరి గోపాల కృష్ణ, రాజా రవీంద్ర, అనీల్ సుంకర తదితరులు హాజరయ్యారు. తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం ఎట్టకేలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అధికారికంగా పూజ వేడుకలతో ప్రారంభమైంది.‘ నేనే రాజు నేనే మంత్రి` హిట్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన తేజ ఈ సారి ఏకంగా వెంకటేష్‌తో మరో హిట్ కొట్టేందుకు రడీ అవుతున్నాడు. అలాగే 'గురు' సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని వెంకీ చేస్తున్న సినిమా ఇది. టైటిల్ బట్టి చూస్తోంటే..థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని భావిస్తున్నారు. డిసెంబరు 16 లేదా 18 వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఈ నెల 13 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు వార్తలొచ్చినా .. ముందుగానే ప్రారంభించారు. తాజా నివేదికల ప్రకారం ఈ మూవీకి 'ఆటా నాదే వేటానాదే' అని పేరు పెట్టినట్టు తెలిసింది. సురేష్ ప్రొడక్షన్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి అభినందన్ సినిమాటోగ్రాఫర్. మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
ఐ వాంట్ గెస్ట్ రోల్స్ అంటున్న వెంకీ
-
ఎన్ఫీల్డ్ బైకుపై వెంకటేష్ సందడి
వెంకటేష్ హీరోగా నటిస్తున్న గురు సినిమా షూటింగ్ విశాఖ జిల్లా భీమిలిలో జరుగుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డు బైకు మీద వెంకటేష్ వెళ్తున్న దృశ్యాన్ని మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీచ్‌రోడ్డులోని బోయివీధి సమీపంలో చిత్రీకరించారు. రుతికాసింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ కొంగర సుధ, నిర్మాత యశ్వంత్. కాగా ఎవరికీ తెలియకుండా వచ్చి గంటలోపే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించుకుని వెళ్లి పోవడంతో షూటింగ్ జరిగిన విషయం ఈ ప్రాంత ప్రజలకు కూడా పెద్దగా తెలియలేదు. -
పుష్కర స్నానం చేసిన హీరో వెంకటేష్
-
'ఆడాళ్లూ మీకు జోహార్లు' అంటున్న వెంకీ
టైటిల్‌తోనే అభిమానులను ఆకట్టుకుంటున్నారు వెంకీ. తన మార్క్ నటనతో అటు మాస్‌ని, ఇటు క్లాస్‌ని ఆకట్టుకునే ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ జోరు పెంచారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన వినోదాత్మక చిత్రం 'బాబు బంగారం' వచ్చేవారం విడుదలకు సిద్ధంగా ఉండగా ఆయన మరో సినిమాకు కమిట్ అయ్యారు. 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే ఆసక్తికర టైటిల్‌తో వెంకీ ప్రేక్షకులను అలరించనున్నారు. 'నేను..శైలజ' సినిమాతో సక్సెస్ కొట్టిన కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు దర్శనమివ్వనున్నారని సమాచారం. అయితే వారంతా పూర్తి స్థాయి పాత్రల్లో కనిపిస్తారా లేక స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పీఆర్ మూవీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ఓ రేంజ్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వెంకీ.. ఈ టైటిల్‌తో ఎంటరై మరింతమంది మహిళల మనసు దోచుకోవడం ఖాయం. -
'బాబు బంగారం' సెన్సార్ పూర్తి
'భలే భలే మగాడివోయ్' సినిమాతో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతి.. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాబు బంగారం'. టీజర్, ట్రైలర్ లతో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ టీమ్ ఈ సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతో ఆగష్టు 12న సినిమా విడుదలకు సిద్ధమైనట్టే. ఈ సినిమాలో వెంకీ.. కామెడీ టచ్ ఉన్న పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. వినోదాత్మకంగా మలచిన ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని టాక్. జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. -
హరిత హారంలో పాల్గొన్న వెంకటేష్
-
తళుకులీనే తారలెన్నో...
సీనియర్ నట, దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి దగ్గర నుంచి కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ దాకా దాదాపు ప్రతి హీరో ఇప్పుడు షూటింగ్‌లోనో, స్క్రిప్ట్ పనిలోనో బిజీగా ఉన్నారు. ప్రజాపంథా చిత్రాలకు పాపులర్ అయిన ఆర్.నారాయణమూర్తి తాజాగా అలాంటి మరో కొత్త చిత్రం పనిలో ఉన్నారు. ‘దృశ్యం’ తరువాత కొంత విరామం తీసుకున్న అగ్రహీరో వెంకటేశ్ కొత్త సినిమా షూటింగ్‌కు స్క్రిప్ట్ ఓకే చేసే పనిలో ఉన్నారు. ఇక, లేటెస్ట్ బాక్సాఫీస్ స్టుపెండస్ హిట్ ‘బాహుబలి... ది బిగినింగ్’తో ఉత్సాహంగా ఉన్న ప్రభాస్ ఈ అక్టోబర్ నుంచి ‘బాహుబలి-2’ షూటింగ్లో పాల్గొనడానికి సన్నద్ధమవుతున్నారు. రానా కూడా భల్లాలదేవ క్యారెక్టర్లోకి మరోసారి పరకాయ ప్రవేశం చేస్తున్నారు. వచ్చే సమ్మర్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్. ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం (వర్కింగ్ టైటిల్ ‘రథం’ అని ప్రచారం) ప్రస్తుతం శరవేగంతో షూటింగ్ జరుపుకొంటోంది. మంచు కుటుంబం నుంచి విష్ణు కొత్త చిత్రం షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నారు. మంచు మనోజ్ చేసిన వర్మ సినిమా ‘ఎటాక్’ రిలీజ్‌కు రెడీ అవుతుంటే, దశరథ్ దర్శకత్వంలో కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్ళింది. ‘భలే భలే మగాడివోయ్’తో చిన్న చిత్రాల్లో తాజా పెద్ద విజయం అందుకున్న హీరో నాని తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. తమిళ హిట్ ‘సుందర పాండియన్’కు భీమనేని శ్రీనివాసరావు రూపొందిస్తున్న తెలుగు రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ మేర్లపాక గాంధీ డెరైక్షన్‌లో ఈసారి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’గా శర్వానంద్ అలరిస్తారు. ఇప్పటికే చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ సినిమా సెట్స్‌పై ఉంది. వీటిలో కొన్ని చిత్రాలు ఈ ఏడాది ఆఖరుకు, మరికొన్ని కొత్త సంవత్సరంలో జనం ముందుకు వస్తాయి. -
వెంకటేశ్ ‘గోపాల గోపాల’ స్టిల్స్
-
వైవిధ్యమే విక్టరీ
హీరో అంటే నేల విడిచి సాము చేయాలనే బాక్సాఫీస్ సూత్రాలకు చాలా దూరంగా ఉంటారు వెంకటేశ్. సహజత్వానికే అధిక ప్రాధాన్యమిస్తారాయన. సాధ్యమైనంతవరకూ సమాజంలో ఒకడిగా కనిపించడానికే మొగ్గు చూపుతారు. నాటి ‘శ్రీనివాస కల్యాణం’ నుంచి సంక్రాంతికి రాబోతున్న ‘గోపాల గోపాల’ వరకూ ఆయన చేసింది అదే. అందుకే... వెంకటేశ్‌కు ప్రత్యేక అభిమానగణం ఉన్నారు. పాత్రల పరంగా ఈ పాతికేళ్లలో ఎన్నో ప్రయోగాలు చేశారాయన. ఏడు నంది అవార్డులు, ఏడు ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు పలు ప్రైవేటు పురస్కారాలు వెంకీని వరించాయంటే కారణం అదే. నేటికీ ప్రయోగాలకు వెనుకాడరు వెంకటేశ్. స్టార్‌గా కంటే నటునిగా గుర్తుండటానికే ఇష్టపడతారాయన. మల్టీస్టారర్స్‌కి మళ్లీ జీవం పోసి, తెలుగు తెరపై ఓ ఆరోగ్యకరమైన వాతావరణానికి తెర లేపిన ఘనత కూడా వెంకటేశ్‌దే. మహేశ్, రామ్‌లతో కలిసి ఇప్పటికే నటించిన వెంకీ... సంక్రాంతికి ‘గోపాల గోపాల’తో పవన్‌కల్యాణ్‌తో తెరను పంచుకోనున్నారు. నేడు వెంకటేశ్ 54వ పుట్టిన రోజు. ఈ వయసులో కూడా ధాటిగా సినిమాలు చేస్తూ, తన తర్వాతి తరం వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకటేశ్.. -
సినీ నటుడు వెంకటేశ్‌కు నోటీసులు
-
సినీ నటుడు వెంకటేశ్‌కు నోటీసులు
హైదరాబాద్ : ప్రముఖ హీరో వెంకటేశ్‌కు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. అనుమతి లేకుండా ప్లాటులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణల మేరకు ఆయనపై జీహెచ్ఎంసీ సర్కిల్-10 టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిలింనగర్ రోడ్ నెంబర్.1 లో హీరో వెంకటేశ్‌కు ప్లాటు ఉంది. గత కొద్దిరోజులుగా ఆ ప్లాటులో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే జీహెచ్ఎంసీ అనుమతి లేకుండానే ఈ నిర్మాణాలు జరుగుతుండటంతో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. -
వెంకటేష్, రామ్ 'మసాలా' ఫస్ట్ లుక్
వెంకటేష్, రామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ఫస్ట్ లుక్ విడుదలయింది. ఫేస్ బుక్‌లోని గరమ్ మసాలా పేజీలో ఈ ఫోటో పోస్ట్ చేశారు. ఈ సినిమా హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’కు ఇది రీమేక్. విజయభాస్కర్ దర్శకుడు. డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి’రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, షాజన్ పదమ్సి కథానాయికలు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంతవరకూ అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. అయితే ఇప్పటికే ‘గోల్మాల్’, ‘గరం మసాలా’, ‘రామ్-బలరామ్’, ‘సర్వేజనా సుఖినోభవంతు’, ‘బ్లాక్‌బస్టర్’ తదితర టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే దర్శక నిర్మాతలు ఇంకా ఏదీ ధ్రువీకరించలేదు. అయితే... ఫైనల్‌గా ‘మసాలా’ టైటిల్ ఓకే అయ్యే అవకాశం ఉందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం ఇటీవలే థాయ్‌లాండ్‌లో ఓ పాట చిత్రీకరించారు. బ్యాలెన్స్ ఒక్క పాటను ఈ నెల మూడోవారంలో హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. ఈ నెల 17న పాటలను విడుదల చేసే యోచనలో ఉన్నారు.