'ఆడాళ్లూ మీకు జోహార్లు' అంటున్న వెంకీ | Interesting update on Venkatesh’s next | Sakshi
Sakshi News home page

'ఆడాళ్లూ మీకు జోహార్లు' అంటున్న వెంకీ

Published Mon, Aug 8 2016 5:39 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

'ఆడాళ్లూ మీకు జోహార్లు' అంటున్న వెంకీ

'ఆడాళ్లూ మీకు జోహార్లు' అంటున్న వెంకీ

టైటిల్తోనే అభిమానులను ఆకట్టుకుంటున్నారు వెంకీ. తన మార్క్ నటనతో అటు మాస్ని, ఇటు క్లాస్ని ఆకట్టుకునే ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ జోరు పెంచారు.

టైటిల్తోనే అభిమానులను ఆకట్టుకుంటున్నారు వెంకీ. తన మార్క్ నటనతో అటు మాస్ని, ఇటు క్లాస్ని ఆకట్టుకునే ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ జోరు పెంచారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన వినోదాత్మక చిత్రం 'బాబు బంగారం' వచ్చేవారం విడుదలకు సిద్ధంగా ఉండగా ఆయన మరో సినిమాకు కమిట్ అయ్యారు. 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే ఆసక్తికర టైటిల్తో వెంకీ ప్రేక్షకులను అలరించనున్నారు. 'నేను..శైలజ' సినిమాతో సక్సెస్ కొట్టిన కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అక్టోబర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు దర్శనమివ్వనున్నారని సమాచారం. అయితే వారంతా పూర్తి స్థాయి పాత్రల్లో కనిపిస్తారా లేక స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.  పీఆర్ మూవీ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ఓ రేంజ్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వెంకీ.. ఈ టైటిల్తో ఎంటరై మరింతమంది మహిళల మనసు దోచుకోవడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement