
సాక్షి, హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, క్రియేటివ్ డైరెక్టర్ తేజ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీకి 'ఆటనాదే వేటనాదే' అనే టైటిల్ పెట్టాలని భావిస్తోందట చిత్ర యూనిట్. సోమవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పరచూరి గోపాల కృష్ణ, రాజా రవీంద్ర, అనీల్ సుంకర తదితరులు హాజరయ్యారు.
తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం ఎట్టకేలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అధికారికంగా పూజ వేడుకలతో ప్రారంభమైంది.‘ నేనే రాజు నేనే మంత్రి` హిట్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన తేజ ఈ సారి ఏకంగా వెంకటేష్‌తో మరో హిట్ కొట్టేందుకు రడీ అవుతున్నాడు. అలాగే 'గురు' సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని వెంకీ చేస్తున్న సినిమా ఇది. టైటిల్ బట్టి చూస్తోంటే..థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని భావిస్తున్నారు. డిసెంబరు 16 లేదా 18 వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఈ నెల 13 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు వార్తలొచ్చినా .. ముందుగానే ప్రారంభించారు. తాజా నివేదికల ప్రకారం ఈ మూవీకి 'ఆటా నాదే వేటానాదే' అని పేరు పెట్టినట్టు తెలిసింది. సురేష్ ప్రొడక్షన్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి అభినందన్ సినిమాటోగ్రాఫర్. మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment