స్టెప్పులేస్తున్న వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్
విశాఖపట్నం: వైజాగ్ వస్తే చాలా హుషారుగా ఉంటుందని హీరో వెంకటేష్ అన్నారు. సైంధవ్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలను ఆదివారం బీచ్‌రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మొదటి సినిమా నుంచి వైజాగ్ ప్రేక్షకులు తనను ఆదరిస్తూ వస్తున్నారన్నారు. చాలా సినిమాలు వైజాగ్‌లో షూటింగ్ చేశామన్నారు. తన 75వ సినిమా సైంధవ్ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు.
ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించారు. సైంధవ్ సినిమాకు హీరో సారా పాప అని చెప్పారు. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ తనకు వైజాగ్ బాగా కలిసి వచ్చిందన్నారు. సైంధవ్ సినిమాను స్టీల్‌ప్లాంట్ కాలనీలో 40 రోజులు షుటింగ్ చేశామన్నారు.
హిట్, హిట్–2 సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసి మంచి విజయం సాధించామన్నారు. వెంకీమామను ప్రేక్షకులను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో చూపించామన్నారు. వెంకీమామ 75 సినిమా తనకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, నటీనటులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment