
శ్రీవిశ్వ విజయకేతనం
సీతంపేట: ఇంటర్ ఫలితాల్లో శ్రీ విశ్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఫస్టియర్ ఎంపీసీలో లోపింటి తనుష్క, ఉమ్మెత్తల శ్రీలయ, చందక శరత్‌కుమార్, బండారు జాహ్నవి, గంటేడ కౌషిక్, సిహెచ్.ఎస్.సంయుక్త, జి.మీనాక్షి ఎ.భవ్యశ్రీ 465 మార్కులు సాధించారు. బైపీసీలో మేకా లక్ష్మీ ప్రసన్న 440 కి 435 మార్కులు, పి.డి.జ్యోతి మాన్విత, ఎస్.పూజా కృష్ణవేణి 434 మార్కులు, గొండు భార్గవి 433 మార్కులు పొందారు. సెకండియర్ ఎంపీసీ బొల్లా రోహిత్, కన్నం నవ్యశ్రీ, పాలవలస మేఘన వెయ్యికి 989 మార్కులు, మడసు హాసిని, మంగ భాను తేజ, దంగేటి పల్లవి 988, బైపీసీలో రెడ్డి రేష్మ 984 మార్కులు సాధించారు. వీరిని శ్రీవిశ్వ విద్యా సంస్థల చైర్మన్ కె.ఎస్.హెచ్.ఆర్.కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ అభినందించారు.