సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరోలలో ఆయన ప్రత్యేకతే వేరు. విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్న గుంటూరు మిర్చి. ఆయన స్టెప్ వేస్తే.. ప్రేక్షకులకు జింగిడి.. జింగిడియే. ఈ చంటిగాడు సినిమా చూపిస్తే ఇక దృశ్యమే. రీమేక్ హీరోగా పేరు గడించిన ఆ స్టార్‌హీరో దగ్గుబాటి వెంకటేష్..లేదా విక్టరీ వెంకటేష్. సొంత టాలెంట్‌తో తన కంటూ ఒకస్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వెంకీ మామకు షష్టి పూర్తి శుభాకాంక్షలు చెబుతోంది సాక్షి.
మరోవైపు బాబాయ్ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా దగ్గుబాటి హీరో రానా ‘టీం దగ్గుపాటి సమర్పణ’లో ఒక మోషన్ పోస్టర్‌ను ట్విటర్ ద్వారా రిలీజ్ చేశాడు. ఇది ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Releasing the motion poster celebrating the one and only Victory V 🔥🔥🔥@VenkyMama #HBDVictoryVenkatesh pic.twitter.com/xowe9qxOOs
— Rana Daggubati (@RanaDaggubati) December 12, 2021
1960 డిసెంబర్ 13న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కారంచేడులో జన్మించారు. ఈ రోజుతో మన వెంకీ మామ 61వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అగ్రహీరోగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. 1971లో ఏఎన్నార్ ప్రేమ్‌నగర్‌లో బాలనటుడిగా కనిపించిన వెంకటేష్ తన ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ, మాస్, క్లాస్, ఫ్యామిలీ, యాక్షన్ జానర్ ఏదైనా తన అభినయంతో సిల్వర్ స్క్రీన్‌పై తనదైనముద్ర వేసుకున్న వెంకటేశ్. 1986 నాటి ‘కలియుగ పాండవులు’ మూవీ మొదలు, నేటి దృశ్యం వరకు సత్తా చాటుతూనే ఉన్నాడు. తొలి సినిమాకే ఉత్తన నటుడుగా నంది అవార్డు అందుకుని. కరియర్ ఆరంభంనుంచే వరుస విజయాలతో అటుఫ్యాన్ ఫాలోయింగ్‌ను, ఇటు విక్టరీ వెంకటేష్‌గా పేరును దక్కించు కున్నాడు.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వచ్చిన ‘బొబ్బిలిరాజా’ వెంకీ కరియర్‌కే అతి ముఖ్యమైన సినిమా. 1991లో వచ్చిన ‘చంటి’ వెంకటేశ్ కెరీర్‌లో మరో మైలురాయి. ఈ మూవీతోనే వెంకటేశ్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ‘శ్రీనివాస కళ్యాణం’, ’స్వర్ణకమలం’, ’గణేష్’, ‘తులసి’, ‘లక్ష్మి’, ‘నువ్వునాకు నచ్చావ్’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో పాటు ‘చంటి’, ‘సుందరకాండ’, ‘చినరాయుడు’, ‘పవిత్ర బంధం’, ‘రాజా’, ‘సంక్రాంతి’ లాంటి సినిమాలతో ఫ్యామిలీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. అలాగే ‘బొబ్బిలి రాజా’, ‘శత్రువు’, ‘ధర్మచక్రం’, వంటి మాస్ సినిమాలతో మాస్ ప్రేక్షకులను అలరించాడు. ‘ప్రేమ’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ప్రేమించుకుందాం..రా’, ‘వాసు’ గురు, ఘర్షణ, లాంటి సినిమాలతో యూత్‌కు దగ్గరయ్యాడు. కథాబలం సినిమాలతో ఆలోచింపచేయడమేకాదు, హీరోగా హాస్యాన్ని పండించాడు.రీమేక్ చిత్రాలను సక్సెస్‌ఫుల్ చేసిన ఘనతకూడా వెంకీకే దక్కుతుంది. బాడీగార్డ్, నాగవల్లి, లాంటి సినిమాలతోపాటు తాజాగా నారప్ప, దృశ్యం సినిమాలే ఇందుకు నిదర్శనం. మల్లీశ్వరి మూవీ ద్వారా కత్రినా కైఫ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన క్రెడిట్ కూడా వెంకీకే దక్కుతుంది.
ఇక తరువాత ట్రెండ్‌కు తగ్గట్టు తెలుగులో మల్టీస్టారర్ మూవీలతో సాహసం చేసింది కూడా వెంకీనే. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, యంగ్ హీరో రామ్‌తో మసాలా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గోపాలా గోపాలా ‘ఎఫ్2’ లాంటి సినిమాలతో ప్రయోగం చేసి, మల్టీ స్టారర్ మూవీలతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. మేనల్లుడు, యంగ్ హీరో నాగచైతన్యతో ‘ప్రేమమ్’ ‘వెంకీమామ’ మూవీలతో మంచి కలక్షన్లు రాబట్టాడు. మూవీ మొఘల్ దివంగత రామానాయుడు కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనదైన స్టయిల్‌లో దూసుకుపోతూ 35 యేళ్ల కెరియర్ లో ఇప్పటివరకు 74 సినిమాలు, కలియుగ పాండవులు , స్వర్ణకమలం, ప్రేమ, గణేష్, ధర్మచక్రం, కలిసుందాంరా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలకు 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు, 5 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకోవడం విశేషం. వెంకటేష్, నీరజారెడ్డి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment