
'బాబు బంగారం' సెన్సార్ పూర్తి
'భలే భలే మగాడివోయ్' సినిమాతో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతి.. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాబు బంగారం'. టీజర్, ట్రైలర్ లతో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ టీమ్ ఈ సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతో ఆగష్టు 12న సినిమా విడుదలకు సిద్ధమైనట్టే.
ఈ సినిమాలో వెంకీ.. కామెడీ టచ్ ఉన్న పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. వినోదాత్మకంగా మలచిన ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని టాక్. జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.