దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడులో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డొనవన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే రానా.. వెంకటేశ్‌కు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేశారు రానా.
ఆ వీడియోలో ఏమన్నారంటే..
రానా మాట్లాడుతూ.. 'వచ్చేయ్. ట్రైలర్ లాంఛ్‌లో కలుద్దాం. అక్కడా గేటు దగ్గర వద్ద నీకు ఎంట్రీ దొరక్కపోతే రానా నాయుడు తండ్రినని చెప్పు. నీకు రానా పేరుతో ఎంట్రీ ఇస్తారు.' అని అన్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఇది వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే వెంకటేశ్ కూడా ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకీ. చేతిలో గన్ పట్టుకుని బెదిరిస్తున్న ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు.
Video toh koi bhi bana leta hai, Naga. Trailer launch par mil. Batata hu asli baap kaun hai.@VenkyMama #RanaNaidu pic.twitter.com/qveDM25zOB
— Rana Daggubati (@RanaDaggubati) February 13, 2023
Comments
Please login to add a commentAdd a comment